Mahila Samman Savings Certificate: చాలా మందికి తెలియదు కానీ మహిళల కోసం, అమ్మాయిల కోసం ఎన్నో పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ లో కొన్ని ముఖ్యమైన పొదుపు స్కీంలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి పథకాలలో ఒకటి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్. ఇది అధిక రాబడిని ఇవ్వడంతో పాటూ తక్కువ మొత్తాన్నే పొదుపు చేసుకుని లాభం పొందేలా ఉంటుంది. మధ్య తరగతి వారు, పేదవారు కూడా ఇందులో సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మన దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులో ఉంది.
Also read: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా..
మహిళల కోసమే కేంద్రం ప్రత్యేకంగా ఈ పథకాన్ని రూపొందించింది. మొదట కొంత పెట్టుబడిని మహిళలు పెడితే దానిపై 7.5 శాతం వడ్డీ ఇస్తారు. పథకంలో రెండు సంవత్సరాలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. అంతే కాకుండా గరిష్ఠ పరిమితి కూడా కేవలం రూ.2 లక్షలు మాత్రమే కావడం విశేషం. మొదటి సంవత్సరం పెట్టుబడి దారుడికి రూ.15,000 స్థిర వడ్డీరేటుతో వచ్చే ఏడాది మొత్తంపై వచ్చే వడ్డీతో కలిపి రూ.16,125 అందిస్తారు. ఈ లెక్కన కేవలం రెండేళ్లలోనే రూ.31,125 అందిస్తారు.
అంతే కాకుండా ఆదాయపు పన్ను సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా ఇందులో పెట్టుబడిగా ఉండటం విశేషం. ఈ పథకంలో మరో చెప్పుకొదగ్గ విషమేంటి అంటే కేవలం 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు సైతం ఖాతా తెరవవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగవచ్చు. అంతేకాకుండా డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు, కాబట్టి పెట్టుబడి పెట్టేందుకు చాలా సురక్షితంగా ఉంటుంది. ఈ పథకంలో పాక్షిక ఉపసంహరణ సైతం అందుబాటులో ఉంది. ఖాతా దారులు ఖాతా తెరిచిన ఏడాది తరవాత బ్యాలెన్స్ లో 40 శాతం వరకు తిరిగి తీసుకోవచ్చు. పథకానికి ఇండియన్ పోస్ట్ అధికారిక వెబ్ సైట్ నుండి కూడా అప్లై చేసుకోవచ్చు.