Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. గత వారం నుంచి బంగారం ధరలు(Gold Rate) తగ్గుతూ వస్తున్నాయి. డాలర్ బలపడడంతో గత అక్టోబర్ నెల వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఇక యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ గెలవడంతో అమెరికా వడ్డీరేట్ల తగ్గింపుపై ఎన్నికల ప్రభావం చూపనుండడంతో.. గోల్డ్ సెంటిమెంట్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర గ్రాముకి పది రూపాయలు తగ్గి.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,750కి చేరగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,190 వరకు తగ్గింది. మరోవైపు రాబోయే నాలుగు నెలల్లో బంగారం ధరలు 20 శాతం తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. వారి చెబుతున్న లెక్కల ప్రకారం రూ.60,000 వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది. అయితే కొంత మంది మాత్రం దీనికి భిన్నమైన విశ్లేషణ చేస్తున్నారు. బంగారం ధరలు తగ్గిన మరీ భారీగా పతనం ఉండకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బంగారం ధరలు(Gold Rate)..
చెన్నైలో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,750కి చేరగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,190 వరకు తగ్గింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,900 చేరింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు రూ. 72,340 వరకు తగ్గింది.
బెంగుళూరులో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,750కి చేరగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,190 వరకు తగ్గింది.
ముంబైలో 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.ృ78,750కి చేరగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,190 వరకు చేరుకుంది.
కేరళ, కోల్‌కత్తాలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,750కి చేరగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,190 వరకు తగ్గింది.
Also Read: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,750కి చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,190 వరకు తగ్గింది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,750కి చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,190 వరకు తగ్గింది.
వైజాగ్, గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,750కి చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,190 వరకు తగ్గింది.
వెండి ధరలు..
వెండి ధరలు కూడా భరాగా తగ్గాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.1,01,900 వరకు తగ్గింది.
ఢిల్లీ, బెంగుళూరులో, ముంబైలో కిలో వెండి ధర రూ.92,900 వద్ద స్థిరంగా ఉంది.