BigTV English

Nissan Magnite Freedom Price Offer: దిమ్మతిరిగే డీల్.. నిస్సాన్ కార్లపై రూ.1.64 లక్షల భారీ డిస్కౌంట్.. వారికి మాత్రమే..!

Nissan Magnite Freedom Price Offer: దిమ్మతిరిగే డీల్.. నిస్సాన్ కార్లపై రూ.1.64 లక్షల భారీ డిస్కౌంట్.. వారికి మాత్రమే..!

Nissan Magnite Freedom Offer:ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా తమ కార్ల సేల్స్ మరింత పెంచుకునేందుకు కొత్త ఆఫర్ ప్రకటించింది. ‘ఫ్రీడమ్ ఆఫర్’ పేరుతో తాజాగా ఓ కొత్త సేల్ తీసుకొచ్చింది. ఈ సేల్‌లో నిస్సాన్ మాగ్నైట్ కారుపై కళ్లుచెదిరే డిస్కౌంట్లను పొందవచ్చని తెలిపింది. దాదాపు రూ.1.64 లక్షల భారీ తగ్గింపును ఈ సేల్ కింద పొందవచ్చు. అయితే ఈ సేల్ కేవలం ఈ నెల అంటే ఆగస్టు 2024 చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ సేల్ అందరికీ వర్తించదు. డిఫెన్స్, సెంట్రల్ పారామిలిటరీ, స్టేట్ పోలీసులకు మాత్రమే అందించనున్నట్లు తెలిపింది.


కాగా ఈ ఎస్యూవీ ప్రారంభ ధర కూడా తక్కువే ఉండటం గమనార్హం. 5 సీటర్‌ను కలిగిన ఈ ఎస్యూవీ కేవలం రూ.5.99 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. అందువల్ల ఈ కారుపై ఆసక్తి ఉన్న రక్షణ శాఖలో పనిచేసే సిబ్బంది CSD AFD పోర్టల్ ద్వారా ఈ ఆఫర్‌తో మరింత తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. మరి నిస్సాన్ మాగ్నైట్‌లో ఏ వేరియంట్ పై ఎంతమేర తగ్గింపు లభిస్తుందో అన్న విషయానికొస్తే.. ఇందులోని బేస్ వేరియంట్ ఎక్స్ఈపై రూ.1,00,900 తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో రూ.5,99,000 ఎక్స్ షోరూమ్ ధరగా ఉన్న ఎక్స్ఈ మోడల్ రూ.4,99,000 లకే లభిస్తుంది. కాగా ఈ కారు 2020 డిసెంబర్‌లో లాంచ్ అయింది. ఆ సమయంలో అందుబాటులో ఉన్న ధరతోనే ఈ ఆఫర్‌లో అందిస్తున్నారు. అందువల్ల కారును కొనుక్కోవాలనుకునే వారు ఇతర వివరాల కోసం సమీపంలోని నిస్సాన్ షోరూమ్‌లను సంప్రదించాల్సి ఉంటుంది.

Also Read: ఎగిరి గంతేసే వార్త.. కార్లపై కిక్కిచ్చే డిస్కౌంట్లు.. వదలొద్దు బాబాయ్!


అలాగే మరో వేరియంట్ మాగ్నైట్ ఎక్స్ఎల్ పై రూ.1,64,010 తగ్గింపు లభిస్తుంది. దీంతో రూ.7,04,000గా ఉన్న ఈ మోడల్ రూ.5,39,990లకు CSD పోర్ట‌ల్‌లో కొనుక్కోవచ్చు. ఇక ఇందులోని టాప్ వేరియంట్ మాగ్నైట్ ఎక్స్‌వీ అసలు ధర రూ.7,82,000 ఉండగా.. తాజా తగ్గింపుతో రూ.6,29,000 కు కొనుక్కోవచ్చు. వీటితో పాటు కేంద్ర పారామిలటరీ, స్టేట్ పోలీస్ బలగాలు కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ ద్వారా స్పెషల్ ప్రైజ్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు.

దీని ప్రకారం.. దీని బేస్ మోడల్ అయిన మాగ్నైట్ ఎక్స్‌ఈని రూ.34,900 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ వేరియంట్‌ను రూ.5,65,000తో సొంతం చేసుకోవచ్చు. అలాగే మాగ్నైట్ ఎక్స్ఎల్‌ని రూ.6,04,000కి కొనుక్కోవచ్చు. ఇంకా మాగ్నైట్ ఎక్స్ఈ ఏఎంటీని రూ.5,94,900, మాగ్నైట్ GEZA సీవీటి ట్రాన్స్‌మిషన్‌ను రూ.9,09,000 కు సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో భాగంగా ఈ కార్లపై ధరలు వరుసగా రూ.65,000, రూ.75,000 తగ్గాయి. కాగా ఈ ఆఫర్లన్నీ ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఎవ్వరైనా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×