BigTV English

Rolls Royce Ghost : రోల్స్ రాయిస్ నుంచి ‘ఘోస్ట్ ప్రిజం’.. 120 మందికి మాత్రమే గురూ!

Rolls Royce Ghost : రోల్స్ రాయిస్ నుంచి ‘ఘోస్ట్ ప్రిజం’.. 120 మందికి మాత్రమే గురూ!
Rolls Royce
Rolls Royce Ghost

Rolls Royce Ghost : ప్రపంచంలోనే ఖరీదైన కారు అంటే గుర్తోచ్చేది రోల్స్ రాయిస్. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను రోల్స్ రాయిస్ లాంచ్ చేసింది. ఎట్టకేలకు మరో కొత్త కారు ఘోస్ట్ ప్రిజంను ఆవిష్కరించింది. ఇది పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండనుంది. దీని గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.


రోల్స్ రాయిస్ కంపెనీ ఆవిష్కరించిన కొత్త కారు ఘోస్ట్ ప్రిజం. ఈ ఘోస్ట్ ఫ్రీజం కేవలం
120 యూనిట్లకు మాత్రమే తయారు చేయనుంది. అంటే ఈ కారును 120 మంది మాత్రమే దక్కించుకోగలరు. కంపెనీ  ఈ ఏడాది 120వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కారును ప్రవేశపెట్టింది. 120 సంవత్సరాల రోల్స్ రాయిస్ చరిత్రకు సాక్ష్యంగా కంపెనీ ఈ ఘోస్ట్ ప్రిజం కారును రూపొందించింది.

Also Read : ఇండియాలో కియా కొత్త ఎస్​యూవీ..అదిరిపోయిన ఫీచర్స్


ఈ కొత్త ఘోస్ట్ ప్రిజం మునుపటి మోడళ్ల కంటే కూడా చాలా ప్రత్యేకమైంది. బంపర్ కింది భాగంలో బ్రేక్ కాలిపర్స్ మరియు కోచ్ లైన్ దగ్గర కూడా ప్రత్యేకమైన కలర్ ఇటుంది. దీనిని హ్యాండ్ పాలిష్ ప్రక్రియ ఫినిష్ చేయడానికి ఏకంగా 16 గంటల సమయం పట్టిందని టాక్.

ఘోస్ట్ ప్రిజం బయట భాగం గన్‌మెటల్ మెటల్ గ్రే పెయింట్ స్కీమ్‌తో రూపొందిచబడింది. అయితే కొనుగోలుదారులు ఫీనిక్స్ రెడ్, మాండరిన్ లేదా ఎల్లో మరియు టర్చెస్ అనే మూడు కలర్ ఆప్షన్స్ ద్వారా కారు పొందవచ్చు. అలానే వింగ్ మిర్రర్స్, గ్రిల్ మరియు బూట్ లిడ్ వంటివి స్టాండర్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫీచర్‌తో వస్తాయి. ఇవి స్మోక్డ్ బ్లక్ గ్రే కలర్ ట్విస్ట్‌ను పొందుతాయి.

ఇంటీరియర్ డిజైన్ విషనికి వస్తే.. వివరాలు అధికారికంగా అందుబాటులో లేవు. ఇది బెస్పోక్ కలర్ ఆప్షన్స్‌లో రూపొందించారని తెలుస్తోంది. క్యాబిన్ మొత్తం కూడా గన్ మెటల్ అండ్ వైట్ థీమ్ కలర్ కలిగి ఉంటుంది. డ్యాష్‌బోర్డు, స్టీరింగ్ వీల్ మరియు సీట్ల మీద రెడ్ యాక్సెంట్స్ ఉంటాయి. రోల్స్ రాయిస్ లోగో కూడా అదే షేడ్‌లో లభిస్తాయి. క్యాబిన్ సిగ్నేచర్ స్టార్‌లైట్ హెడ్‌లైనర్‌ ఉంటుంది. ఇందులో 1040 కలర్ స్టార్స్ ఉండటం విశేషం.

Also Read : జపాన్‌కు మేడ్ ఇన్ ఇండియా కార్లు.. అట్లుంటది మనతో!

కారు ఇంజిన్ విషయానికి వస్తే.. ఘోస్ట్ ప్రిజం 6.75 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ12 ఇంజిన్‌లో లభిస్తుంది. ఇది 555 బీహెచ్‌పీ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ధర కొంత ఎక్కువగానే ఉండొచ్చు.

Related News

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Big Stories

×