BigTV English

Lexus LM 350h: లెక్సస్ నుంచి లగ్జరీ కార్.. మామా లోపల చూస్తే ఉంటది..!

Lexus LM 350h: లెక్సస్ నుంచి లగ్జరీ కార్.. మామా లోపల చూస్తే ఉంటది..!
Lexus
Lexus LM 350h Hybrid

Lexus LM 350h Hybrid: దేశంలో లగ్జరీ కార్ల వినియోగం విపరీతంగా పెరగుతోంది. సొంత వాహనం ఉండాలని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇంటికి రెండేసి కార్లు ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో కంపెనీలు కూడా వరుసపెట్టి పోటాపోటీగా కార్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. మంచి ఫీచర్స్‌తో వినియోగదారులనుఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు, ధనికులు కార్లు కొనుగోలు చేయడంలో డబ్బును లెక్కచేయడం లేదు.సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.


ఇందులో భాగంగా తాజాగా భారత్ మార్కెట్‌లోకి ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ లెక్సస్ కొత్త కారును లాంచ్ చేసింది. ‘ఎల్ఎమ్ 350హెచ్’ మోడల్‌ను విడుదల చేసింది. ఆ కార్ ఫీచర్లు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

లెక్సన్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ‘ఎల్ఎమ్ 350హెచ్’ కారు ధర తెలిస్తే షాకవుతారు. దీని ప్రారంభ ధర అక్షరాల రూ. 2 కోట్లు. అయితే ఇది 7 సీటర్ వేరియంట్. ఇందులోని 4 సీటర్ వేరియంట్ ధర రూ. 2.50 కోట్లు. ఇందులో ఫీచర్స్ ఎంతో లగ్జరీగా ఉంటాయి. ధర విషయం కాస్త పక్కనపెడితే ఫీచర్ల పరంగా లెక్సస్ అట్రాక్ట్ చేస్తుంది.


Also Read: రోల్స్ రాయిస్ నుంచి ‘ఘోస్ట్ ప్రిజం’.. 120 మందికి మాత్రమే గురూ!

లెక్సస్ ఎల్‌ఎమ్ 350 చూడటానికి బాహుబలి వెహికల్‌‌ మాదిరిగా ఉంది. మంచి గ్రాండ్ డిజైన్ కలిగి ఉంది. ఇది జీఏ-కే మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ కారు భారీగా కనిపించే స్పిండిల్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ అలానే అద్భతమైన డిజైన్ కలిగిన ఫాగ్ ల్యాంప్‌ వంటివి ఉన్నాయి. వెనుక డోర్స్ స్లైడింగ్ కలిగి ఉన్నాయి. కారు వెనుక అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్ ఉంది.

అంతేకాకుండా ఇందులో ఫోల్ట్ అవుట్ టేబుల్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు, ఫ్రిజ్, మల్లిపుల్ యూఎస్‌బీ పోర్ట్స్‌తో పాటుగా ఇతర లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. లోపల క్యాబిన్ కూడా చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది.

కారు ఇంజిన్ విషయానికి వస్తే.. ఎల్‌ఎమ్ 350 హెచ్ 2.5 లీటర్ 4 సిలిండర్ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 250 హార్స్ పవర్, 239 న్యూటన్ మీటర్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది eCVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇంజిన్ నికెల్‌మెటల్ హైడ్రైడ్ బ్యాటరీతో కలిసి సూపర్ పవర్‌ను అందిస్తుంది. వీటితో పాటుగా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది.

Also Read: జపాన్‌కు మేడ్ ఇన్ ఇండియా కార్లు.. అట్లుంటది మనతో!

లెక్సస్‌లో ప్లస్ 3 సాప్ట్ ఆఫ్ ఏడీఏఎస్ టెక్నాలజీ కలిగిన సేఫ్టీ సిస్టం ఉంటుంది. కాబట్టి వెహికల్ డిటెక్షన్, స్టీరింగ్ అసిస్ట్‌తో లేన్ డిపార్చర్ అలర్ట్,డైనమిక్ రాడార్ క్రూయిజ్ జనుత్రోల్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఆటోమాటిక్ హై బీమ్ వంటి ఫీచర్స్ కారులో ఉన్నాయి. సేఫ్టీ విషయంలో లెక్సస్‌కు తిరుగులేదనే చెప్పాలి.

Related News

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

Big Stories

×