BigTV English

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టులు హతం, జవాన్ మృతి

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టులు హతం, జవాన్ మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపూర్ జిల్లాలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.


ఎనిమిది మంది మావోయిస్టులు, జవాన్ మృతి

నారాయణపూర్ జిల్లాలోని కుతుల్, ఫరస్ బేడ, కొడతమెట్ట అటవీ ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అదే విధంగా ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందగా.. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు.


రెండు రోజులుగా ఎన్‌కౌంటర్

అబుల్ మడ్ ప్రాంతంలో గత రెండు రోజుల నుంచి ఎన్ కౌంటర్ జరుగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. అంతర్ జిల్లాల యాంటీ నక్సల్ దళాలు కుంబింగ్ నిర్వహిస్తుండగా.. ఎదురుకాల్పులు జరిగాయని తెలపారు. ఈ ఆపరేషన్‌లో నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ, కాంకేర్‌లోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, 53వ బెటాలియన్‌కు చెందిన బలగాలు పాల్గొన్నాయన్నారు.

అటవీ ప్రాంతాల్లో కూంబింగ్

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కుతుల్, ఫరస్ బేడ, కొడతమెట్ట అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కొంతమంది పారిపోయనట్లు అధికారులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నామని తెలిపారు.

Also Read: విద్యార్థుల జీవితంతో చెలగాటమా ? నీట్ అవకతవకలపై కేంద్ర విద్యాశాఖమంత్రి రియాక్షన్

ఇటీవల కాంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. అంతకుముందు కాంకేర్‌లో జరిగిన ఎన్ కౌంటర్లో 29మంది మావోయిస్టులు మరణించారు.

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×