BigTV English

Volkswagen Offers: కార్లపై రూ.3 లక్షల డిస్కౌంట్.. ఫుల్ డీటైల్స్‌పై ఓ లుక్కేయండి..!

Volkswagen Offers: కార్లపై రూ.3 లక్షల డిస్కౌంట్.. ఫుల్ డీటైల్స్‌పై ఓ లుక్కేయండి..!

Discount on Volkswagen: ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ నెలలో దేశీయ మార్కెట్‌లో కొన్ని సెలెక్టెడ్ వాహనాలపై ఊహించని డిస్కౌంట్లు అందిస్తోంది. జూన్ 2024 నెలలో Tiguan, Taigun, Virtus వంటి దాని మోడల్‌లపై మంచి తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. వోక్స్‌వ్యాగన్ ఫ్లాగ్‌షిప్ SUV Tiguan MY2023 విడుదల చేసిన మోడల్‌పై ఈ నెలలో రూ. 3.40 లక్షల వరకు తగ్గింపు ఇస్తుంది.


గత సంవత్సరం MY2023 మోడల్ వోక్స్‌వ్యాగన్ టైగన్ 1.0-లీటర్ TSI ఇప్పుడు రూ. 1.80 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. Volkswagen Virtus 1.0 TSI ప్రస్తుతం రూ. 1.05 లక్షల వరకు బెనిఫిట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు గురించి వివరంగా తెలుసుకోండి.

Also Read: టాటా మోటర్స్ నుంచి ప్రీమియం EV.. బండి నెక్స్ట్ లెవల్ అంతే..!


Volkswagen Tiguan
వోక్స్‌వ్యాగన్  ఫ్లాగ్‌షిప్ SUV Tiguan వేరియంట్‌ MY2023 తయారు చేసిన మోడల్‌పై ఈ నెలలో రూ. 3.40 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ప్రయోజనాలలో రూ. 75,000 క్యాష్ డిస్కౌంట్ , రూ. 75,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, 4 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీ (రూ. 90,000 వాల్యూ) రూ. 1 లక్ష వరకు కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది. దీని Asawa MY2024 Tiguan రూ. 50 వేల తగ్గింపు, రూ. 50 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్‌‌పై కొనుగోలు చేయవచ్చు.

Volkswagen Taigun
గత సంవత్సరం MY2023 మోడల్ వోక్స్‌వ్యాగన్ టైగన్ 1.0-లీటర్ TSI ఇప్పుడు రూ. 1.80 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌లో రూ. 50,000 వరకు నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 20,000 లాయల్టీ బోనస్‌తో పాటు రూ. 50,000 అదనపు తగ్గింపు ఉంటుంది. అదనంగా డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన టైగన్ మోడల్ ఇప్పుడు  ఆఫర్‌తో పాటు రూ. 40,000 అదనపు క్యాష్ బెనిఫిట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Also Read: బడ్జెట్ తక్కువ మైలేజ్ ఎక్కువ.. ఈ CNG కార్లను మిస్ చేయకండి!

Volkswagen Virtus
వోక్స్‌వ్యాగన్ వర్టస్ 1.0 TSI ప్రస్తుతం రూ. 1.05 లక్షల వరకు బెనిఫిట్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులో రూ.75 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.20 వేలు ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.20 వేలు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. Virtus 1.5 GT వేరియంట్ ఎక్స్‌ఛేంజ్, కార్పొరేట్ బోనస్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. టైగన్ మాదిరిగానే ఈ వెర్టస్ MY23 యూనిట్లు రూ. 50,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్ వేరియంట్‌పై రూ. 40,000 అదనపు తగ్గింపు దక్కించుకోవచ్చు.

Tags

Related News

BSNL Offers: రీఛార్జ్ చేసుకోండి.. 2% డిస్కౌంట్ పొందండి, కస్టమర్లకు BSNL క్రేజీ ఆఫర్!

GST 2.0: కొత్త జీఎస్టీతో పన్ను తగ్గలేదా? నెంబర్ ఇదిగో, సామాన్యుడు ఫిర్యాదు చేయొచ్చు

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

Big Stories

×