BigTV English

Cheapest 7 Seater Cars: ఫ్యామిలీ కార్లు.. ఎక్కువ మంది కూరోవచ్చు.. తక్కువ ధరకే!

Cheapest 7 Seater Cars: ఫ్యామిలీ కార్లు.. ఎక్కువ మంది కూరోవచ్చు.. తక్కువ ధరకే!

Cheapest 7 Seater Cars: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కొన్ని సంవత్సనాల క్రితం 7 సీటర్  కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఈ సెగ్మెంట్ కార్లు ఇప్పుడు చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. దేశంలో 7 సీటక్ కార్లు ఎక్కువగా అమ్ముడుపోడానికి కారణం ఇదే. ఈ కార్లలో కుటుబంతో కలిసి హాయిగా ప్రయాణించవచ్చు. ఈ క్రమంలో మీరు తక్కువ ధరలో లభించే 7 సీటర్ కార్లు కొనుగోలు చేయాలంటే కొన్ని ఆప్షన్లు మీకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మారుతీ సుజికి, రెనాల్డ్, కియా వంటి 7 సీటర్ కార్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ కార్ల ధరలు, మైలేజ్, ఇతర వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.


Maruti Suzuki Eeco
మీరు తక్కువ ధరలో 7 సీట్ల కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మారుతి సుజుకి EECOకి దక్కించుకోవచ్చు. వ్యక్తిగత అవసరాలతో పాటు EECO చిన్న వ్యాపారం కోసం ఉపయోగించవచ్చు. Eeco  ఎక్స్-షో రూమ్ ధర రూ. 5.22 లక్షల నుండి ప్రారంభమవుతుంది. Eeco ఇంజన్ గురించి మాట్లాడితే, ఇందులో 1.2L పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 81 PS పవర్, 104 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. పెట్రోల్ మోడ్‌లో, Eeco 20kmpl మైలేజీని అందిస్తుంది. ఇది CNG మోడ్‌లో ఇది 27 km/kg మైలేజీని అందిస్తోంది.

Also Read: Bajaj All Bikes On Flipkart: బజాజ్ సంచలన నిర్ణయం.. ఫ్లిప్‌కార్ట్ నుంచి బైకులను ఆర్డర్ చేయవచ్చు!


Maruti Ertiga
కుటుంబ అవసరాలకు మారుతీ ఎర్టిగా తన స్థానాన్ని సంపాదించుకుంది. ఇందులో 1.5 లీటర్ కెపాసిటీ కె-సిరీస్ డ్యూయల్ జెట్ ఇంజన్ ఉంటుంది. ఇది 101 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. కంపెనీ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు పెట్రోల్ ఇంజన్‌తో పాటు CNGతో వస్తుంది. ఈ కారు పెట్రోల్ మోడ్‌లో 20.51kmpl మైలేజీని అందిస్తుంది. అయితే CNGలో మైలేజ్ 26km/kg కి పెరుగుతుంది. దీని ఎక్స్-షో రూమ్ ధర రూ. 8.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 7 మందికి సీటింగ్ ఉంది.

Renault Triber
చాలా మంది తక్కువ బడ్జెట్‌లో రెనాల్ట్ ట్రైబర్‌ని ఇష్టపడతారు. ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ ఉంటుంది. ఇది 999cc పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది.  ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో కూడిన ట్రైబర్ మైలేజ్ 20 kmpl. ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సౌకర్యం ఉంది. ఇందులో 5+2 సీటింగ్ ఆప్షన్ ఉంది. ఇందులో 7 మంది సులభంగా కూర్చోవచ్చు. దీని బూట్‌లో ఎక్కువ స్పేస్ ఉండదు. ట్రైబర్ ఎక్స్-షో రూమ్ ధర రూ.5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Also Read: Skoda Discounts: ఊహించని ఆఫర్.. ఈ కారుపై రూ.2.5 లక్షల డిస్కౌంట్.. 4 రోజులే ఛాన్స్!

Kia Carens
కియా కేరెన్స్ కొంచెం ఖరీదైన కారు. అందులో 7 మంది సులభంగా కూర్చోవచ్చు. దీని బూట్‌లో స్పేస్ కూడా బాగానే ఉంటుంది. ఇది మంచి క్యాబిన్ స్పేస్, బూట్ స్పేస్ పొందుతుంది. కేరెన్స్ మూడు ఇంజన్ ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.5L GDi పెట్రోల్, 1.5L పెట్రోల్, 1.5L CRDI డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్‌లలో లభిస్తుంది. దీనిలో ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్  ఉంది. దీని ఎక్స్-షో రూమ్ ధర రూ. 10.45 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Related News

GST 2.0: కొత్త జీఎస్టీతో పన్ను తగ్గలేదా? నెంబర్ ఇదిగో, సామాన్యుడు ఫిర్యాదు చేయొచ్చు

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

Big Stories

×