BigTV English

Upcoming SUV’s : భారత మార్కెట్‌లోకి రానున్న కొత్త ఎస్‌యూవీలు ఇవే..!

Upcoming SUV’s : భారత మార్కెట్‌లోకి రానున్న కొత్త ఎస్‌యూవీలు ఇవే..!

Upcoming SUV’s from Skoda and KIA: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీలకు అత్యధి డిమాండ్ ఉంది. అమ్మకాల్లో కూడా ఈ వెహికల్స్ గణనీయమైన వృద్ధిని సాధించాయి. అనేక విదేశీ కంపెనీలు సైతం దేశంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పటికే దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన కంపెనీలు సైతం ఎస్‌యూవీ వాహనాల తయారీపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని రెండు ప్రముఖ ఆటోమేకర్లు స్కోడా, కియా రెండు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి. అవేంటో చూసేయండి.


స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ
స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ ఇటీవల భారత రోడ్లపై పరీక్షించింది. వచ్చే ఏడాది మార్చిలో దీన్ని లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్‌యూవీ డిజైన్‌ను స్పై షాట్‌లలో వెల్లడించారు. ఇందులో ఇన్‌వర్టెడ్ ఎల్-ఆకారపు LED టెయిల్ ల్యాంప్స్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఇంటిగ్రేటెడ్ హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన చిన్న రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి.

Also Read: వీటి అమ్మకాలకు బ్రేకులేయడం కష్టమే.. సెల్స్‌లో దూసుకుపోతున్న బైకులు ఇవే!


ఎమ్‌క్యూబి ఎవో ఇన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా.. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.0-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో  115 bhp, 178 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కోడా తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌లలో వస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం కొత్త స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి జనవరి 2025 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కియా క్లావిస్
కియా క్లావిస్ 2024 చివరి నాటికి భారతదేశంలో లంచ్ అయే అవకాశాలు ఉన్నాయి.  అయితే దాని మార్కెట్ లాంచ్ వచ్చే ఏడాది అంటే 2025‌లో ప్రారంభం కానున్నట్లు కియా ఇండియా తెలిపింది. కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రాండ్ లైనప్‌లో సోనెట్, సెల్టోస్ మోడల్ మాదిరిగా ఉండవచ్చు . కియా క్లావిస్ టెస్టింగ్ మోడల్ ఇటీవలే భారతదేశంలో పరీక్షించబడింది.

Also Read: భారత్ రోడ్లపై మరోసారి దూసుకుపోనున్న ఫోర్ట్.. ఎవరెస్ట్ పేరుతో కొత్త SUV

మొత్తంమీద కియా నేటి టెక్నాలజీకి అనుగుణంగా ఈ కొత్త క్లావిస్ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఆందులో అనేక లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ వెహికల్ ఇంటీరియర్‌లో AY అనే కోడ్‌నేమ్ ఉంటుంది. కియా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్, పెట్రోల్-పవర్ రెండు వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఇది హైబ్రిడ్ వెర్షన్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమచారం.

Tags

Related News

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Big Stories

×