Big Stories

CNG Car Millage Tips: మీ సీఎన్‌జీ మైలేజ్ ఇవ్వడం లేదా.. అయితే ఈ టిప్స్ పాటించండి!

CNG Car Millage Tips: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో  పెట్రోల్, డీజిల్ వెహికల్స్ మార్కెట్‌లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్‌లో అయితే ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కార్లు అమ్మాకాల్లో వేగంగా దూసుపోతున్నాయి. వీటి నిర్వహణ మిగిలిన వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే అందుబాటులో ఉంటేవి.

- Advertisement -

అయితే ప్రస్తుత కాలంలో పెట్రోల్, డీజిల్ కార్ల మార్కెట్ వాల్యూ తగ్గిందనే చెప్పాలి. దీనికి ఆయిల్ రేట్లు పెరగడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కార్లు కొనుగోలు చేసే వారికి సీఎన్‌జీ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. సీఎన్‌జీ ఆకర్షణీయమైన పొదుపు ఇంధనంగా మారింది. సీఎన్‌‌జీ కార్ల అమ్మకాలు కూడా పెరిగాయి. అయితే వెహికల్ మెరుగైన మైలేజ్ ఇవ్వాలంటే ఈ చిట్కాలు పాటించండి.

- Advertisement -

ఎయిర్ ఫిల్టర్
CNG గాలి కంటే చాలా తేలికైనది. కారు ఎయిర్ ఫిల్టర్ మురికిగా ఉంటే అది గాలి-ఇంధనం కలిసి మండేప్పుడు సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.  ఇంధన వినియోగం పెరుగుతుంది. ఎయిర్ ఫిల్టర్ నాణ్యత గురించి మీకు ఖచ్చితంగా తెలియకుంటే ప్రొఫెషనల్ మెకానిక్ ద్వారా దాన్ని క్రమం తప్పకుండా చెక్ చేయండి. ప్రతి 5000 కిమీకి మార్చడం కూడా మర్చిపోవద్దు.

Also Read: భారత మార్కెట్‌లోకి రానున్న కొత్త ఎస్‌యూవీలు ఇవే..!

క్లచ్‌
సరీగా లేని క్లచ్ కారు మైలేజీని గణనీయంగా తగ్గిస్తుంది. దీని కారణంగా ఇంజిన్ శక్తి చక్రాలకు సమయానికి చేరుకోలేదు. దీని వలన తక్కువ సామర్థ్యం, అధిక ఇంధన వినియోగం, ఇంధనం వృధా అవుతుంది. అందువల్ల కారు క్లచ్ మంచి స్థితిలో ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా ఇంజిన్ ఎప్పడికప్పుడు తనిఖీ చేయండి. ట్రాన్స్మిషన్ ఫిల్టర్‌ను మార్చండి. ఇది ఇంజిన్ సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది.

స్పార్క్ ప్లగ్‌
CNG కార్లకు ఇంజిన్‌‌లో మంచి పవర్ కోసం స్పార్క్ ప్లగ్ అవసరం. ఎందుకంటే CNG వాహన ఇంజిన్ పెట్రోల్ కారు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మంచి నాణ్యత గల స్పార్క్ ప్లగ్‌ని ఉపయోగించడం చాలా ముఖ్యం.

Also Read: వీటి అమ్మకాలకు బ్రేకులేయడం కష్టమే.. సెల్స్‌లో దూసుకుపోతున్న బైకులు ఇవే!

టైర్ ప్రెసర్ 
కారుకు మెరుగైన మైలేజీని అందించడంలో నాలుగు టైర్లు కీలక పాత్ర పోషిస్తాయి. టైర్‌లో గాలి తక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేస్తే టైరు, రహదారి మధ్య ఘర్షణ పెరుగుతుంది. ఇది ఇంజిన్‌పై మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా ఇంధనం అధికంగా వినియోగం అవుతుంది. మీరు టైరులో గాలి చెక్ చేయండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News