BigTV English

Top 5 Budget Friendly Cars: బడ్జెట్‌లో మంచి మైలేజీ ఇచ్చే కార్లు.. రూ.3 లక్షలతో కొనుగోలు చేయవచ్చు

Top 5 Budget Friendly Cars: బడ్జెట్‌లో మంచి మైలేజీ ఇచ్చే కార్లు.. రూ.3 లక్షలతో కొనుగోలు చేయవచ్చు

Top 5 Budget Cars With Good Mileage: భారతదేశంలో అధిక మైలేజ్ ఇచ్చే కార్లకు అధిక ప్రాధాన్యత ఉంది. మిడిల్ క్లాస్ ప్రజలు కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే చిన్న కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తున్నాయి. మార్కెట్‌లోకి మంచి మైలేజీ ఇచ్చే కార్లను తీసుకొస్తున్నాయి. అంతే కాకుండా రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో పెద్ద సెడాన్‌లు లేదా SUVల కంటే చిన్న కార్లు బాగా సరిపోతాయి. ప్రత్యేకించి పార్కింగ్ స్థలం లేకపోవడం, ఇరుకైన ప్రదేశాల కూడా కారణం కావచ్చు. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజీనిచ్చే కారు కోసం చూస్తున్నట్లయితే అటుంటి కార్లు ఐదు ఉన్నాయి.


Maruti Suzuki Alto K10
మారుతి ఆల్టో K10 ప్రస్తుతం తక్కువ ధర కలిగిన హ్యాచ్‌బ్యాక్. ఇది పట్టణ రద్దీ ప్రాంతాల నుండి కొండ రోడ్ల వరకు దూసుకుపోతుంది. Alto K10 ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు. దాని మైలేజ్ 24.39 kmpl (ARAI).

Also Read: మిడిల్ క్లాస్ కార్లు.. బైక్ కంటే ఇవే బెటర్!


Maruti Suzuki S-Presso
ఎవరైనా ఆల్టో లేదా చిన్న, మైలేజ్ కారు కోసం చూస్తున్నట్లయితే మారుతి సుజుకి S-ప్రెస్సో బెస్ట్ ఆప్షన్. దీని మైలేజీ,ధరతో పాటు దాని డిజైన్‌కు కూడా చాలా అట్రాక్ట్‌గా ఉంటుంది. మారుతి S-ప్రెస్సో  ప్రారంభ ధర రూ. 4.26 లక్షలు ఎక్స్-షోరూమ్. దీని మైలేజ్ 24.12 kmpl (ARAI).

Renault Kwid
బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లలో రెనాల్ట్ క్విడ్ కూడా ఉంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్, మైలేజీతో వస్తుంది. ఈ కారు మారుతి ఆల్టో కె10కి నేరుగా పోటీపడుతుంది. రెనాల్ట్ క్విడ్ ధర రూ. 4.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు లీటరుకు 21.46 కిమీ మైలేజీని కంపెనీ పేర్కొంది.

Maruti Suzuki Celerio
మారుతి సుజుకి సెలెరియో చాలా కాలంగా మార్కెట్‌లో ఎప్పటి నుంచి మంచి సేల్స్ నమోదు చేస్తోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.36 లక్షలు.ఇది మైలేజ్ 24.97 kmpl (ARAI).

Also Read: సిట్రోయెన్ నుంచి ధోని స్పెషల్ ఎడిషన్.. ఈ కార్లు కావాలంటే లక్ ఉండాలి!

Maruti Suzuki Eeco
మారుతి సుజుకి ఈకో ఫ్యామిలీ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ రూ. 5.32 లక్షలు. ఇందులో చాలా పెద్ద స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. అంతే కాకుండా అదనంగా రూ. 30,000 చెల్లిస్తే మీరు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌ను కూడా పొందవచ్చు. మారుతి ఈకో మైలేజ్ 19.71 kmpl (ARAI).

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×