BigTV English

Amit Shah: ‘టెర్రరిస్టుల కంటే ఒక్కడుగు ముందుండాలి’.. భద్రతా ఏజెన్సీలకు అమిత్ షా కీలక సూచన

Amit Shah: ‘టెర్రరిస్టుల కంటే ఒక్కడుగు ముందుండాలి’.. భద్రతా ఏజెన్సీలకు అమిత్ షా కీలక సూచన

Amit Shah latest news(Telugu news live today): టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు దేశంలోని అన్ని భద్రతా, నిఘా ఏజెన్సీలు కలిసి పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి అన్ని భద్రతా ఏజెన్సీల అధ్యక్షులతో అమిత్ షా.. హై లెవిల్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఇంటెలిజెన్స్ విభాగం పనితీరును భద్రతా ఏజెన్సీల అధ్యక్షులతో కలిసి కేంద్ర హోం మంత్రి సమీక్షించారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భద్రతా ఏజెన్సీలు సమష్టిగా కొత్త విధానాలు తీసుకురాబోతున్నాయి. దేశంలో పౌరుల భద్రత విషయంలో ఏజెన్సీలు.. ఇంటెలిజెన్స్ విభాగం మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో క్రియాశీలంగా పనిచేసేందుకు కీలక మార్పులు తీసుకురాబోతున్నాయి.

ఈ కీలక సమావేశంలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. “ఉగ్రవాదుల నెట్ వర్క్, వారికి సహాయం అందించే సిస్టమ్‌ని ఎదర్కొనేందుకు అన్ని భద్రతా ఏజెన్సీలు కలిసి కట్టుగా పనిచేయాలి.. దేశంలో పెరుగుతున్న ఉగ్ర చర్యలను ఆపేందుకు ఇది అత్యవసరం,” అని చెప్పారు.


Also Read| NEET PG 2024: ‘వెబ్ సైట్ క్రాష్, లాగిన్ ప్రాబ్లమ్.. నాలుగు సెంటర్ల ఆపషన్లు’.. మండిపడుతున్న విద్యార్థులు

దీని కోసం భద్రతా ఏజెన్సీల ఒక జాయింట్ సెంటర్.. 24 గంటలూ పని చేసే ప్లాట్ ఫార్మ్ గా కావాలని… ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే స్పందించేందుకు కీలక సమాచారం అన్ని భద్రతా ఏజెన్సీలు.. అవసరమైనవాళ్లకు అందజేసేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

”భద్రతా సమస్యలను ఎదుర్కొనేందుకు ఉగ్రవాదల కంటే మనం ఒక్కడగు ముందే ఉండాలి.. అప్పుడే ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలం,” అని అమితా అధికారులకు సూచించారు.

జాతీయ భద్రత విషయంలో ఇంటెలిజెన్స్ శాఖ, భద్రతా ఏజెన్సీలు, పోలీస్ స్పెషల్ ఫోర్స్.. అందరూ కలిసి ప్రభుత్వ నిర్ణయాలను సమష్టిగా అమలుపరిచేందుకు ఒకే విధానంతో పనిచేయాలని అన్నారు.

దేశంలో ఇటీవల ఉగ్రవాద దాడులు, నక్సలైట్ల చర్యల దృష్ట్యా ఈ సమావేశం కీలకంగా మారింది. కశ్మీర్ డోడా, కఠువా ప్రాంతాల్లో ఇటీవలు పలువురు సైనికులు.. ఉగ్రవాద దాడులలో చనిపోయారు. ఛత్తీస్ గడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సైట్లను భద్రతా దళాలు ఎదుర్కొంటున్నాయి.

Also Read: Budget 2024| విద్యారంగానికి కేంద్ర బడ్డెట్ లో ప్రాధాన్యం ఎంత?

 

Tags

Related News

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Big Stories

×