E-Paper
Advertisement

రూ. 5 వేల పెట్టుబడి.. రూ.కోటి టర్నోవర్.. కప్‌కేక్స్‌తో యువతి గేమ్ ఛేంజింగ్ బిజినెస్!

రూ. 5 వేల పెట్టుబడి.. రూ.కోటి టర్నోవర్.. కప్‌కేక్స్‌తో యువతి గేమ్ ఛేంజింగ్ బిజినెస్!
Advertisement

Success Story: బెంగళూరుకు చెందిన యువ పారిశ్రామికవేత్త మేఘనా జైన్ (Meghana Jain) వ్యాపార ప్రయాణం.. యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తోంది. 18 ఏళ్ల వయసులో రూ.5000ల పెట్టుబడితో కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన కప్ కేక్ ల వ్యాపారం.. నేడు రూ.కోట్లకు పడగలెత్తింది. దేశవ్యాప్తంగా 500 మందికి పైగా క్లయింట్లకు సేవలందించే స్థాయికి ఎదిగింది. ‘డ్రీమ్ ఏ డజన్’ (Dream A Dozen) అనే సంస్థను స్థాపించి కేకులు, కుకీలు, కస్టమైజ్డ్ కార్పొరేట్ గిఫ్ట్ హ్యాంపర్ల తయారీలో ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మేఘనా జైన్ బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లోనే ఆమెలో వ్యాపార ఆలోచన మెులకెత్తింది. తనకున్న బేకింగ్ అభిరుచిని ఆదాయ మార్గంగా మార్చుకోవాలని భావించిన ఆమె.. ఇంట్లో కప్‌కేక్‌లు తయారు చేసి కళాశాలకు తీసుకెళ్లేవారు. తరగతుల మధ్య దొరికే విరామ సమయాల్లో వాటిపై ఫ్రాస్టింగ్‌తో అలంకరించి తోటి విద్యార్థులకు విక్రయించేవారు. సరదాగా మొదలైన ఈ ప్రయత్నానికి స్నేహితుల నుండి మంచి ఆదరణ లభించింది.

Advertisement

అయితే కళాశాల ప్రాంగణంలో ఇలా విక్రయాలు జరపడం సరికాదని ఒక ప్రొఫెసర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ తోటి విద్యార్థులు ఆమెకు అండగా నిలబడ్డారు. మరికొందరు అధ్యాపకులు ఆమెలోని నైపుణ్యాన్ని గుర్తించి దీనిని ఒక వ్యాపారంగా మార్చుకోవాలని ప్రోత్సహించారు. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ‘ఇన్నర్‌చెఫ్’, ‘కేక్‌వాలా’ వంటి ఫుడ్ స్టార్టప్‌లలో పనిచేసి వ్యాపారాన్ని స్థాపించేందుకు అవసరమైన మెళుకువలు నేర్చుకున్నారు. ఆ అనుభవంతో 2018 జనవరిలో కేవలం రూ. 5,000 పెట్టుబడితో ‘డ్రీమ్ ఏ డజన్’ సంస్థకు శ్రీకారం చుట్టారు.

ఇంటి కిచెన్‌లో మొదలైన ఈ వ్యాపారానికి ఆర్డర్లు పెరగడంతో ఆరు నెలల్లోనే వేరే ప్రాంగణానికి మారాల్సి వచ్చింది. కానీ కొత్త ప్రదేశంలో అనుకోని జైన్ కు సమస్యలు ఎదురయ్యాయి. ఆర్డర్లు ఎక్కువగా ఉన్న సమయాల్లో భవన యజమాని ఉద్దేశపూర్వకంగా కరెంట్ కట్ చేయడం ద్వారా ఇబ్బందులకు గురిచేసేవారని మేఘన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ సమస్యలను అధిగమించి, వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో 2020 మార్చిలో ఒక పెద్ద భవనంలోకి ఆమె మారారు.

Advertisement

ఎన్నో ఆశలతో పెద్ద భవనంలోకి అడుగుపెట్టిన మేఘనా జైన్ కు కొవిడ్ – 19 రూపంలో దురదృష్టం వెంటాడింది. లాక్‌డౌన్ విధించడంతో కొత్తగా ప్రారంభించిన వ్యాపారం ఆరు వారాల పాటు పూర్తిగా మూతపడింది. ఆ క్లిష్ట సమయంలో నిరాశ చెందకుండా, ఆన్‌లైన్ బేకింగ్ క్లాసులు నిర్వహిస్తూ సంస్థను నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు జైన్. తన వ్యాపారాన్ని పూర్తిగా ఆన్‌లైన్ మోడల్‌లోకి మార్చడమే కాకుండా కొత్త కస్టమర్ల కోసం అన్వేషణ మొదలుపెట్టారు.

2020 దీపావళి పండుగ మేఘన వ్యాపార ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా నిలిచింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటి నుండే పనిచేస్తున్న ఉద్యోగులకు, క్లయింట్లకు బహుమతులు పంపేందుకు కార్పొరేట్ సంస్థలు మార్గాలను వెతుకుతున్నాయని ఆమె గుర్తించారు. వెంటనే పలు కంపెనీలను సంప్రదించి, ప్రత్యేకంగా తయారు చేసిన గిఫ్ట్ బాక్సులను అందించే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు బహుమతులను చేరవేయడానికి ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఆ ప్రయత్నం మేఘనా జైన్ కు విజయాన్ని అందించింది. ఆ ఒక్క పండుగ సీజన్‌లోనే దాదాపు 1,500 గిఫ్ట్ బాక్సులను డెలివరీ చేసి అంతకుముందు వరకూ ఉనన నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా రెట్టింపు అమ్మకాలను సాధించారు. అప్పటి నుండి ప్రత్యక్ష కస్టమర్లపైనే ఆధారపడకుండా యాహూ (Yahoo!), యాక్సెంచర్ (Accenture), మీడియాటెక్, ఇండిక్యూబ్ వంటి దిగ్గజ కంపెనీలకు కస్టమైజ్డ్ గిఫ్టింగ్ సేవలు అందించే స్థాయికి ఆమె ఎదిగారు.

Also Read: వందే భారత్ vs విమానం.. ప్రయాణికులకు ఇచ్చే ఫుడ్‌ పరంగా ఏది బెస్ట్? నెట్టింట ఆసక్తికర చర్చ!

వ్యాపారం విస్తరిస్తున్న కొద్దీ మేఘన తన ఫుడ్ మేకింగ్, డెలివరీ టీమ్ ను బలోపేతం చేసుకున్నారు. ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ పూర్తిస్థాయి ఉమెన్ కిచెన్‌గా తీర్తిదిద్దారు. 2021లో ఐఐఎం బెంగళూరులో గోల్డ్‌మన్ శాక్స్ సహకారంతో నిర్వహించిన ‘10,000 ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ప్రోగ్రామ్‌లో చోటు సంపాదించి తన వ్యాపార నైపుణ్యాలకు మరింత పదును పెట్టుకున్నారు. నేడు బెంగళూరులోని సెంట్రలైజ్డ్ కిచెన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘డ్రీమ్ ఏ డజన్’.. 500 మందికి పైగా క్లయింట్లతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటికి పైగా టర్నోవర్ సాధించింది. తద్వారా మేఘనా జైన్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

?utm_source=ig_embed&ig_rid=AImmw5P9I4CedxnH0l5dDpT

Also Read: ఏడాదంతా ఫ్రీ కాల్స్.. ఎయిర్‌టెల్, జియో, వీఐలో.. అత్యంత చౌకైన ప్లాన్లు ఇవే!

Tags

Related News

ఐపీఓ సీజన్ మళ్లీ మొదలు.. రూ.10 వేల కోట్లకు పైగానే, మహానది కోల్‌ఫీల్డ్స్‌తోపాటు

బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంకు కొత్త రూల్స్

52 టన్నులు.. రూ.72 వేల కోట్ల వ్యాపారం.. ఈ బంగారం క్రేజ్‌కు రీజన్స్ ఇవే!

కోడిగుడ్లు, చికెన్ ధరలు తగ్గనున్నాయా? కారణం ఇదే

వారంటీ vs గ్యారంటీ.. రెండింటికి తేడా ఏంటి? దేని వల్ల మనకి ఎక్కువ లాభం?

డీమార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. బిల్లు సగానికి తగ్గాలంటే.. ఏవి కొనాలి? ఏవి కొనకూడదు?

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. రూ. 1.20 లక్షలకు పడిపోనున్న బంగారం ధర?

Big Stories

Advertisement
×