E-Paper
Advertisement

వారంటీ vs గ్యారంటీ.. రెండింటికి తేడా ఏంటి? దేని వల్ల మనకి ఎక్కువ లాభం?

వారంటీ vs గ్యారంటీ.. రెండింటికి తేడా ఏంటి? దేని వల్ల మనకి ఎక్కువ లాభం?
Advertisement

Warranty vs Guarantee: కొత్తగా మొబైల్ ఫోన్, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఇలా ఏది కొన్నా ‘గ్యారంటీ’, ‘వారంటీ’ అనే పదాలు కచ్చితంగా తారసపడతాయి. చాలా మంది ఈ రెండింటినీ ఒకేలా భావిస్తారు. కానీ వాస్తవానికి ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

అసలు వారంటీ అంటే ఏంటి?

వారంటీ అనేది సదరు ప్రొడక్ట్ ను తయారు చేసిన కంపెనీ ఇచ్చే హామీ పత్రం. దీని ప్రకారం ప్రొడక్ట్‌లో ఏదైనా లోపం తలెత్తితే, కంపెనీ దానిని ఉచితంగా రిపేర్ చేస్తుంది. అవసరమైతే దానిని మార్చేసి కొత్త ప్రొడక్ట్ ను కస్టమర్ కు ఇస్తుంది. అయితే ఈ వారంటీ అనేది నిర్దిష్ట కాలానికి మాత్రమే కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్లు ఇలా వారంటీ పరిధిని కంపెనీలు నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఇందులో ప్రొడక్ట్ కు సంబంధించిన విడిభాగాలు, రిపేర్ ఖర్చులు కవర్ అవుతాయి. కొన్ని షరతుల మీద ఈ వారంటీ సేవలను కస్టమర్లకు కంపెనీలు అందిస్తుండటం గమనార్హం.

మరి గ్యారంటీ సంగతేంటి?

Advertisement

ఇక గ్యారంటీ విషయానికి వస్తే.. దీనిని అమ్మకందారుడు (షాపు యజమాని) కొనుగోలుదారుడికి ఇస్తాడు. ప్రొడక్ట్ చాలా నాణ్యమైనదని, సరిగ్గా పనిచేస్తుందనే భరోసాను కస్టమర్ లో కల్పించేందుకు గ్యారంటీ హామీని ఇస్తుంటారు. ఒకవేళ ఆ వస్తువు సరిగ్గా పనిచేయకపోతే కస్టమర్‌కు కొత్త వస్తువును ఇవ్వడం, రిప్లేస్ మెంట్, డబ్బు వాపస్ చేయడం వంటివి షాపు యజమాని చేస్తుంటారు. వారంటీతో పోలిస్తే గ్యారంటీ హామీ అనేది చాలా వేగంగా, పెద్దగా షరతులతో సంబంధం లేకుండా కొనుగోలుదారుడికి బెనిఫిట్ ను అందిస్తుంది.

రెండింటికి ప్రధాన తేడాలు

వారంటీ, గ్యారంటీలకు కొన్ని విషయాల్లో మరింత స్పష్టమైన తేడాలు ఉన్నాయి. కాలపరిమితి విషయానికి వస్తే.. వారెంటీ కాలం ఎక్కువ రోజులు ఉంటుంది. కానీ గ్యారంటీ గడువు తక్కువ కాలం పాటు ఉండొచ్చు. సమస్య పరిష్కారానికి వస్తే.. గ్యారంటీ విషయంలో కస్టమర్‌కు తక్షణమే పరిష్కారం దొరుకుతుంది. అదే వారంటీ అయితే రిపేర్ లేదా టెక్నికల్ అసెస్‌మెంట్ ప్రక్రియ ఉండటం వల్ల కొంత సమయం పట్టవచ్చు.

Advertisement

Also Read: డీమార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. బిల్లు సగానికి తగ్గాలంటే.. ఏవి కొనాలి? ఏవి కొనకూడదు?

ఫైనల్గా ఏది మంచిది?

ఈ రెండింటిలో ఏది బెటరన్నది కొనుగోలు చేసే వస్తువుపై పూర్తిగా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏళ్లతరబడి వాడే ఖరీదైన ప్రొడక్ట్‌లను కొంటున్నట్లయితే వారంటీ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని తెలియజేస్తున్నారు. అలా కాకుండా త్వరితగతిన పరిష్కారం, ఎలాంటి గందరగోళం లేకుండా మనశ్శాంతి కోరుకుంటే గ్యారంటీ మంచి ఆప్షన్ నిలుస్తుందని వివరిస్తున్నారు.

Also Read: ఆవు పేడతో అద్భుతం.. రూ. లక్షల్లో సంపాదిస్తున్న సాధారణ మహిళ.. ఇదెక్కడి వెరైటీ బిజినెస్!

Tags

Related News

డీమార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. బిల్లు సగానికి తగ్గాలంటే.. ఏవి కొనాలి? ఏవి కొనకూడదు?

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. రూ. 1.20 లక్షలకు పడిపోనున్న బంగారం ధర?

ఓలాకు భారీగా జరిమానా! ముందస్తు ‘టిప్’ వ్యవహారం, నిలిపి వేయాలని సీసీపీఏ ఆదేశం

ఆవు పేడతో అద్భుతం.. రూ. లక్షల్లో సంపాదిస్తున్న సాధారణ మహిళ.. ఇదెక్కడి వెరైటీ బిజినెస్!

భార్యాభర్తల అద్భుత ఆలోచన.. మట్టి లేకుండానే కుంకుమపువ్వు సాగు.. నెలకు రూ. 4 లక్షల సంపాదన!

సిటీ ఎందుకు మామ.. పల్లెల్లో ఉంటూ రూ.లక్షల్లో సంపాదించొచ్చు.. ఈ వ్యాపారాలు ట్రై చేయ్!

ఒక్క ఐడియాతో రూ.100 కోట్ల టర్నోవర్.. స్వీట్స్ బిజినెస్‌లో సరికొత్త ట్రెండ్ ప్రారంభించిన యువ వ్యాపారవేత్తలు

Big Stories

Advertisement
×