E-Paper
Advertisement

డీమార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. బిల్లు సగానికి తగ్గాలంటే.. ఏవి కొనాలి? ఏవి కొనకూడదు?

డీమార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. బిల్లు సగానికి తగ్గాలంటే.. ఏవి కొనాలి? ఏవి కొనకూడదు?
Advertisement

DMart Shopping Tips: ఈ రోజుల్లో డీమార్ట్ కు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట తక్కువ ధరకే దొరుకుతాయనే ఉద్దేశంతో చాలామంది డీమార్ట్ (DMart) వంటి పెద్ద రిటైల్ స్టోర్లకు వెళ్తున్నారు. అయితే అక్కడ కనిపించే భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల మాయలో పడి అవసరమైన వాటికంటే అనవసరమైన వస్తువులే ఎక్కువగా కొనేస్తున్నారు. నిజానికి స్మార్ట్ షాపింగ్ అంటే ఏది చౌకగా దొరికితే అది కొనేయడం కాదు. సరైన వస్తువును, సరైన పరిమాణంలో, సరైన ధరకు ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే డీమార్ట్ షాపింగ్‌లో భారీగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఇంట్లోని నిల్వలపై అవగాహన

డిమార్ట్ కు బయలుదేరే ముందు వంటింట్లో ఏయే సరుకులు ఎంత మేరకు ఉన్నాయో చెక్ చేయండి. బియ్యం, పప్పులు, వంట నూనె, సబ్బులు, డిటర్జెంట్, టూత్‌పేస్ట్ వంటివి ఇంట్లో ఎంత నిల్వ ఉన్నాయో చూసుకుని ఒక లిస్ట్ రాసుకోండి. ఆఫర్ ఉంది కదా అని ఇంట్లో ఉన్న వస్తువులనే మళ్లీ కొంటే డబ్బులు ఆదా అవ్వకపోగా.. వృథా అవుతాయి.

బల్క్‌గా కొనేటప్పుడు జాగ్రత్త

Advertisement

బియ్యం, పప్పులు, చక్కెర, ఉప్పు వంటి త్వరగా పాడైపోని సరుకులను నెలవారీ అవసరాలకు తగ్గట్టుగా పెద్ద ప్యాకెట్లు (బల్క్‌గా) కొనడం మంచిదే. అయితే పెద్ద ప్యాకెట్ ఎప్పుడూ తక్కువ ధరకే వస్తుందని గుడ్డిగా నమ్మకండి. 1 కిలో, 2 కిలోలు, 5 కిలోల ప్యాకెట్ల ధరలను పోల్చి చూసి కిలోకు ఎంత పడుతుందో లెక్కేయండి. ఉదాహరణకు.. ఒక కిలో ప్యాకెట్ ధర రూ.100 ఉండి, 2 కిలోల ప్యాకెట్ రూ.180కి వస్తే మంచి డీల్. అలా కాకుండా 2 కిలోల ప్యాకెట్ రూ.190 లేదా రూ.200 ఉంటే బల్క్‌గా కొనడం వల్ల పెద్దగా లాభం ఉండదు.

క్లీనింగ్, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై స్పెషల్ ఫోకస్

ఫ్లోర్ క్లీనర్, డిష్‌వాష్ లిక్విడ్, టాయిలెట్ క్లీనర్, వాషింగ్ పౌడర్ వంటివి సాధారణంగా ప్రతీ నెలా కొంటూనే ఉంటారు. కాబట్టి వీటి ధరల్లో ఉండే చిన్నపాటి తేడాలు కూడా నెలవారీ బడ్జెట్‌పై పెద్ద ప్రభావం చూపుతాయి. కాబట్టి ప్యాకెట్ మొత్తానికి ఉన్న ధరను కాకుండా 100 గ్రాములు లేదా 100 మిల్లీలీటర్లకు ఎంత ధర పడుతుందో చెక్ చేయాలి. అలాగే సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లపై వచ్చే కాంబో ఆఫర్లను ఇంట్లోని అందరూ వాడేవైతేనే పెద్ద మొత్తంలో కొనాలి. అయితే కొనేముందు ఎక్స్‌పైరీ డేట్‌ను తప్పనిసరిగా చెక్ చేయండి.

చిరుతిళ్లు విషయంలో కంట్రోల్

Advertisement

డీమార్ట్‌లో బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటివి వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. వీటి ధర విడిగా చూస్తే తక్కువగానే అనిపించినా సరుకులతో కలిపి బిల్లు వేసేసరికి మొత్తం అమౌంట్‌ అమాంతం పెరిగిపోతుంది. కాబట్టి చిరుతిళ్ల కోసం నెలవారీ బడ్జెట్‌లో ఒక లిమిట్ ను పెట్టుకోవాలి. అటు పండ్లు, కూరగాయల విషయానికి వస్తే.. ఆఫర్ ఉంది కదా అని ఎప్పుడూ ఎక్కువ మొత్తంలో కొనకండి. అవి పాడైపోతే ఎంత తక్కువకు కొన్నా అదంతా వృథా అయినట్లే లెక్క.

Also Read: రైలులో టికెట్ లేని ప్రయాణం.. ఆర్మీ జవాన్లు, మహిళా టీటీఈకి మధ్య గొడవ.. రెండుగా చీలిన నెటిజన్లు!

బడ్జెట్ ఫిక్స్.. బిల్లింగ్ ముందు చెక్

డీమార్ట్ స్టోర్‌లోకి అడుగుపెట్టే ఎంత బడ్జెట్ లో షాపింగ్ చేయాలనే దానిపై ఒక పరిమితిని పెట్టుకోండి. ఉదాహరణకు నెలవారీ బడ్జెట్ రూ.5,000 అయితే.. అందులో రూ.4,000 నిత్యావసర సరుకులకు, రూ.500 క్లీనింగ్, పర్సనల్ కేర్ వస్తువులకు కేటాయించండి. మిగిలిన రూ.500 అత్యవసర ఖర్చుల కోసం పక్కన పెట్టుకోండి. దీనివల్ల అనవసరమైన కొనుగోళ్లకు అడ్డుకట్ట పడుతుంది. చివరగా బిల్లింగ్ కౌంటర్‌కు వెళ్లే ముందు ట్రాలీలోని వస్తువులను పరిశీలించండి. ఆ వస్తువు నిజంగా అవసరమా? అది ఇప్పటికే ఇంట్లో ఉందా? ఆఫర్ లేకపోయినా దీన్ని కొనేవాడినా? అని మూడు ప్రశ్నలు వేసుకోండి. వీటిలో ఏ ఒక్కదానికి ‘కాదు’ అని సమాధానం వచ్చినా ఆ వస్తువును వెంటనే తిరిగి షెల్ఫ్‌లో పెట్టేయండి.

Also Read: ‘భోగాపురంపై హ్యాపీగా లేను.. అది జరిగిన రోజు ఎంతో సంతోషిస్తా’.. రానాతో లోకేశ్ కీలక వ్యాఖ్యలు!

Tags

Related News

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. రూ. 1.20 లక్షలకు పడిపోనున్న బంగారం ధర?

ఓలాకు భారీగా జరిమానా! ముందస్తు ‘టిప్’ వ్యవహారం, నిలిపి వేయాలని సీసీపీఏ ఆదేశం

ఆవు పేడతో అద్భుతం.. రూ. లక్షల్లో సంపాదిస్తున్న సాధారణ మహిళ.. ఇదెక్కడి వెరైటీ బిజినెస్!

భార్యాభర్తల అద్భుత ఆలోచన.. మట్టి లేకుండానే కుంకుమపువ్వు సాగు.. నెలకు రూ. 4 లక్షల సంపాదన!

సిటీ ఎందుకు మామ.. పల్లెల్లో ఉంటూ రూ.లక్షల్లో సంపాదించొచ్చు.. ఈ వ్యాపారాలు ట్రై చేయ్!

ఒక్క ఐడియాతో రూ.100 కోట్ల టర్నోవర్.. స్వీట్స్ బిజినెస్‌లో సరికొత్త ట్రెండ్ ప్రారంభించిన యువ వ్యాపారవేత్తలు

వందల మందిని ఉద్యోగం నుంచి తొలగించిన HR ఉద్యోగికి ప్రమోషన్.. కొన్ని నెలల తరువాత అతడికి భారీ షాక్

Big Stories

Advertisement
×