E-Paper
Advertisement

వందే భారత్ vs విమానం.. ప్రయాణికులకు ఇచ్చే ఫుడ్‌ పరంగా ఏది బెస్ట్? నెట్టింట ఆసక్తికర చర్చ!

వందే భారత్ vs విమానం.. ప్రయాణికులకు ఇచ్చే ఫుడ్‌ పరంగా ఏది బెస్ట్? నెట్టింట ఆసక్తికర చర్చ!
Advertisement

Vande Bharat vs Flight Food: రైల్వేలో ప్రయాణికుల సౌకర్యాలు, ఆహార నాణ్యతలో వస్తున్న మార్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సెమీ హై-స్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’లో అందిస్తున్న భోజనాన్ని.. అంతర్జాతీయ విమానాల్లో ఇచ్చే ఆహారంతో పోలుస్తూ ఒక ప్రయాణికుడు పెట్టిన పోస్ట్ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. రైల్వే క్యాటరింగ్ సేవల్లో వచ్చిన ఈ మార్పుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

యోగి అనే ప్రయాణికుడు రెండు వేర్వేరు ప్రయాణాల్లో తనకు వడ్డించిన ఆహారం ఫోటోలను ఎక్స్ లో షేర్ చేశారు. అందులో ఒకటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇచ్చిన అల్పాహారం కాగా మరొకటి అంతర్జాతీయ విమాన ప్రయాణంలో అందించిన భోజనం. వందే భారత్ రైలులో తనకు బ్రెడ్, బటర్, జామ్, కెచప్, ఉప్మా, పోహా, కప్‌కేక్, కార్న్‌ఫ్లేక్స్‌తో పాటు జ్యూస్ అందించారని ఆయన తెలిపారు. అలాగే అంతర్జాతీయ విమానంలో అన్నం, పప్పు, పన్నీర్ కూర, సలాడ్, బటర్, పండ్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఆయా ప్రయాణాలకు తగ్గట్లుగా రెండు చోట్ల ఆహారం ఎంతో బాగుందని.. ముఖ్యంగా రైల్వేలో ఫుడ్ పరంగా భారీ మార్పు సాధించిందని ఆయన ప్రశంసించారు.

Advertisement

నెటిజన్ల స్పందన ఎలా ఉందంటే?

ఈ పోస్ట్ వైరల్ కావడంతో రైల్వేలో మారుతున్న ఆహార నాణ్యత, ప్రయాణ అనుభవంపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ‘వందేభారత్ వంటి రైళ్లలో లభిస్తున్న సౌకర్యాలు, రుచికరమైన ఆహారం చూస్తుంటే.. విమాన ప్రయాణాల కంటే రైళ్లే మెరుగైన ఎంపిక అనిపిస్తోంది’ అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఇలాగే చాలా మంది ప్రయాణికులు వందే భారత్ సేవలను, ఆహార నాణ్యతను అభినందిస్తూ కామెంట్లు పెట్టారు.

Advertisement

Also Read: ఏడాదంతా ఫ్రీ కాల్స్.. ఎయిర్‌టెల్, జియో, వీఐలో.. అత్యంత చౌకైన ప్లాన్లు ఇవే!

పోషక విలువలపై ఆందోళన

ఓవైపు వందే భారత్ క్యాటరింగ్‌పై ప్రశంసలు కురుస్తుండగా మరోవైపు కొందరు నెటిజన్లు భిన్నమైన కోణాన్ని తెరపైకి తెచ్చారు. రైళ్లలో అందించే ఆహారం రుచిగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అందులో ఉండే పోషక విలువల (Nutritional Value) విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం ఎక్కువగా ఉండే పదార్థాల కంటే ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మెుత్తం మీద వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్ల రాకతో భారతీయ రైల్వే పట్ల ప్రజల్లో ఉన్న పాత అభిప్రాయాలు మారుతున్నాయనేది ఈ చర్చ ద్వారా స్పష్టమవుతోంది.

Also Read: తనిష్క్‌లో 10 కేజీల గోల్డ్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Tags

Related News

గంగానదిపై వాటర్ మెట్రో ప్రయాణం.. టికెట్ ధర జస్ట్ రూ.50!

విమానం రంగంలో చైనా దూకుడు.. ఎలక్ట్రిక్ విమానం తయారు, తొలి ప్రయోగం సక్సెస్

అఖండ భారత్ లో ఇన్ని దేశాలు ఉండేవా? పాకిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఆసక్తికర విశేషాలివే!

ట్రావెల్ ట్రిప్ ప్లానింగ్ కోసం AI ఉపయోగిస్తున్నారా? ఈ సమస్యలు రావచ్చు జాగ్రత్త

60 రోజుల టికెట్ బుకింగ్‌ రూల్ మారనుందా? రైల్వే కొత్త ప్లాన్ ఇదే!

8 ఫాస్ట్ నమో భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ప్రయాణికులకు ఇక పండుగే!

పశ్చిమ కనుమల మీదుగా కొత్త వందే భారత్.. ప్రయాణమంతా ప్రకృతి అందాలే!

Big Stories

Advertisement
×