E-Paper
Advertisement

బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంకు కొత్త రూల్స్

బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంకు కొత్త రూల్స్
Advertisement

Money Transfer No Bank Account| డబ్బులు పంపాలంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలా? ఇకపై అలాంటి అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతా లేని వారు కూడా నగదు రూపంలో ఇతరుల అకౌంట్లకు డబ్బులు పంపించవచ్చు. ముఖ్యంగా వలస కార్మికులు, రోజువారీ కూలీలు, బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నవారికి ఈ నిబంధనలు ఉపయోగపడతాయి. అయితే ఎంత డబ్బు పంపవచ్చు? ఈ ప్రక్రియ ఏంటి? డబ్బులు స్వీకరించడానికి ఉన్న పరిమితులేమిటి? తెలుసుకుందాం.

ఆర్బీఐ కొత్త మనీ ట్రాన్స్‌ఫర్ రూల్స్

ఆర్బీఐ నవంబర్ 11, 2026న డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ డైరెక్షన్స్ 2026ను విడుదల చేసింది. ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న సూచనలను ఒకే మార్గదర్శకాల్లోకి తీసుకొచ్చి, క్యాష్ ట్రాన్స్‌ఫర్ (నగదు బదిలీలు), ధ్రువీకరణ, భద్రతకు సంబంధించిన అంశాలను స్పష్టం చేసింది. ఈ నిబంధనలు వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అనుమతి పొందిన చెల్లింపు సంస్థలకు వర్తిస్తాయి. అయితే కార్డు నుంచి కార్డుకు చేసే ట్రాన్స్‌ఫర్ వీటి పరిధిలోకి రావు.

బ్యాంక్ అకౌంట్ లేకున్నా రూ.50 వేల వరకు పంపవచ్చు

Advertisement

బ్యాంక్ ఖాతా లేని వ్యక్తులు నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి నగదు జమ చేయవచ్చు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) ద్వారా ఇతరుల బ్యాంక్ అకౌంట్లకు రూ.50,000 వరకు పంపవచ్చు. ఇందుకోసం అదే బ్యాంకులో సొంత ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయం వలస కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు ఇతర నగరాల్లో ఉంటున్న తమ కుటుంబ సభ్యులకు సులభంగా డబ్బులు పంపవచ్చు.

ఏటీఎంలు, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా పరిమితి ఎంత?

ఏటీఎంలు, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా నగదు బదిలీ చేసేవారికి ఆర్బీఐ ప్రత్యేక పరిమితులు విధించింది. ఒక్కో లావాదేవీలో గరిష్ఠంగా రూ.5,000 పంపవచ్చు. ఒక నెలలో ఒక వ్యక్తి పంపగల మొత్తం రూ.25,000కు మించకూడదు. బిజినెస్ కరస్పాండెంట్లు అంటే బ్యాంకుల తరఫున ప్రాథమిక సేవలు అందించే అధీకృత ఏజెంట్లు.

బ్యాంక్ ఖాతా లేని వారు కూడా నగదు పొందవచ్చు

Advertisement

బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తులు కూడా నగదు రూపంలో డబ్బులు స్వీకరించవచ్చు. బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తి పంపిన డబ్బును ఏటీఎం, బిజినెస్ కరస్పాండెంట్ లేదా ఇతర అనుమతించిన మార్గాల ద్వారా పొందవచ్చు. అయితే ఒక్కో లావాదేవీలో రూ.10,000 వరకు మాత్రమే తీసుకోవచ్చు. ఒక నెలలో ఒక్కో లబ్ధిదారుడు గరిష్ఠంగా రూ.25,000 పొందవచ్చు.

Also Read: ఒక్క ఐడియాతో రూ.100 కోట్ల టర్నోవర్.. స్వీట్స్ బిజినెస్‌లో సరికొత్త ట్రెండ్ ప్రారంభించిన యువ వ్యాపారవేత్తలు

డబ్బు పంపేవారి గుర్తింపు ధ్రువీకరణ తప్పనిసరి

డబ్బులు పంపేవారి మొబైల్ నంబర్‌ను బ్యాంకులు ధ్రువీకరించాలి. అలాగే కేవైసీ నిబంధనల ప్రకారం స్వీయ ధ్రువీకరించిన అధికారిక గుర్తింపు పత్రాలను తీసుకోవాలి. ప్రతి లావాదేవీకి అదనపు భద్రతా ధ్రువీకరణ (AFA) తప్పనిసరి.

Also Read: తక్కువ జీతంతో సొంతూరిలో ఉండాలా? లేక ఎక్కువ జీతం కోసం హైదరాబాద్, బెంగుళూరుకు వెళ్లాలా?

మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ప్రత్యేక చర్యలు

ఎక్కువ మొత్తం లేదా అసాధారణంగా అనిపించే లావాదేవీలను బ్యాంకులు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి, అవసరమైన అధికారులకు నివేదించాలి. వినియోగదారులకు హెచ్చరికలు పంపే ఏర్పాట్లు కూడా ఉండాలి. ఈ బదిలీలు సాధ్యమైనంత వరకు తక్షణం లేదా దాదాపు తక్షణమే పూర్తయ్యేలా చూడాలని ఆర్బీఐ సూచించింది.

Related News

52 టన్నులు.. రూ.72 వేల కోట్ల వ్యాపారం.. ఈ బంగారం క్రేజ్‌కు రీజన్స్ ఇవే!

కోడిగుడ్లు, చికెన్ ధరలు తగ్గనున్నాయా? కారణం ఇదే

వారంటీ vs గ్యారంటీ.. రెండింటికి తేడా ఏంటి? దేని వల్ల మనకి ఎక్కువ లాభం?

డీమార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. బిల్లు సగానికి తగ్గాలంటే.. ఏవి కొనాలి? ఏవి కొనకూడదు?

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. రూ. 1.20 లక్షలకు పడిపోనున్న బంగారం ధర?

ఓలాకు భారీగా జరిమానా! ముందస్తు ‘టిప్’ వ్యవహారం, నిలిపి వేయాలని సీసీపీఏ ఆదేశం

ఆవు పేడతో అద్భుతం.. రూ. లక్షల్లో సంపాదిస్తున్న సాధారణ మహిళ.. ఇదెక్కడి వెరైటీ బిజినెస్!

Big Stories

Advertisement
×