BigTV English
Advertisement

Mercedes-Benz: మెర్సిడెస్ నుంచి రెండు కొత్త కార్లు.. ధర, ఫీచర్లు, ఫుల్ డీటెయిల్స్ ఇవే..!

Mercedes-Benz: మెర్సిడెస్ నుంచి రెండు కొత్త కార్లు.. ధర, ఫీచర్లు, ఫుల్ డీటెయిల్స్ ఇవే..!

Mercedes-AMG GLC 43 4Matic Coupe and CLE Cabriolet launched: మెర్సిడెస్ బెంజ్ ఇండియా రెండు కొత్త టాప్ ఎండ్ హై రేంజ్ వాహనాలను లాంచ్ చేసింది. Mercedes-AMG GLC 43 4MATIC కూపే, Mercedes-Benz CLE 300 క్యాబ్రియోలెట్ AMG లైన్‌లు తాజాగా దేశీయ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. ఈ మోడల్‌లు అధిక పనితీరు అందిస్తాయి. లైఫ్‌స్టైల్ వాహనాలను కోరుకునే భారతీయ వినియోగదారులకు ఇవి ది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు.


GLC 43 4MATIC కూపే ప్రత్యేకమైన ‘వన్ మ్యాన్, వన్ ఇంజిన్’ ఫిలాసఫీని కలిగి ఉంది. అయితే CLE 300 క్యాబ్రియోలెట్ విలాసవంతమైన ఓపెన్-టాప్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అయితే కొత్తగా లాంచ్ అయిన ఈ రెండు వాహనాల ధరల విషయానికొస్తే.. Mercedes-AMG GLC 43 Coupé రూ.1.105 కోట్ల ధరతో (ఆల్-ఇండియా ఎక్స్-షోరూమ్ ధర) వచ్చింది. అలాగే కొత్త CLE 300 క్యాబ్రియోలెట్ AMG లైన్ రూ.1. 10 కోట్ల (ఆల్-ఇండియా ఎక్స్-షోరూమ్ ధర) నుండి ప్రారంభమవుతుంది.

Mercedes-AMG GLC 43 4MATIC కూపే


Mercedes-AMG GLC 43 4MATIC కూపే ఫేస్‌లిఫ్ట్ 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో పెట్రోలో ఇంజన్‌తో వచ్చింది. ఈ ఇంజన్ 421 hp, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ కేవలం 4.8 సెకన్లలో దాదాపు 0 నుంచి 100 కెఎంపిహెచ్ స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే దీని టాప్‌ స్పీడ్ విషయానికొస్తే.. ఇది గంటకు 250 కి.మీ దూరాన్ని చేరుకుంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా AMG GLC 43 అఫాల్టర్‌బాచ్ నుండి ‘వన్ మ్యాన్, వన్ ఇంజిన్’ ఫిలాసఫీని కలిగి ఉంది.

 Also Read: జూలైలో ఎక్కువగా అమ్ముడైన కార్లు ఇవే.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్ దీనికే..!

ఇది AMG డైనమిక్ ప్లస్ ప్యాకేజీతో కూడా వస్తుంది. ఇందులో AMG పనితీరు స్టీరింగ్ వీల్, రెడ్ బ్రేక్ కాలిపర్‌లు, డైనమిక్ AMG ఇంజన్ మౌంట్‌లు, RACE డ్రైవ్ ప్రోగ్రామ్ వంటి అధిక-పనితీరు గల బిట్‌లు ఉన్నాయి. అలాగే రియర్ యాక్సిల్ స్టీరింగ్‌తో AMG రైడ్ కంట్రోల్ సస్పెన్షన్‌ను కూడా కలిగి ఉంది. కాగా GLC 43 కూపే దాని గ్రిల్.. పెద్ద ఎయిర్ ఇన్‌లెట్‌లు, బాడీ కలర్‌లో పెయింట్ చేయబడిన వీల్ ఆర్చ్‌లు, సైడ్ సిల్ ప్యానెల్‌లు, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి AMG-నిర్దిష్ట స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. లోపలి భాగంలో GLC 43 ఒక పెద్ద 11.9-అంగుళాల పోర్ట్రెయిట్-స్టైల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంటుంది. అలాగే 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ డిస్‌ప్లేతో సమానమైన లేఅవుట్‌ను కలిగి ఉంది. మరో ప్రత్యేకత ఏఎంజీ స్టీరింగ్ వీల్.

Mercedes-Benz CLE 300 క్యాబ్రియోలెట్ AMG లైన్

Mercedes-Benz CLE 300 Cabriolet AMG లైన్ అనేది రెండు డోర్ల కారు. కస్టమర్లు ఆన్‌లైన్‌లో మాత్రమే కారును కొనుగోలు చేయగలరని మెర్సిడెస్-బెంజ్ పేర్కొంది. ఇది ఫ్రంట్ ఎండ్‌లో ‘షార్క్-నోస్’ డిజైన్‌ను కలిగి ఉంది. స్పోర్టీ లుక్‌తో వస్తుంది. హెడ్‌ల్యాంప్‌లు, C-క్లాస్ మాదిరిగానే కొంచెం పెద్దగా కనిపిస్తాయి. CLE 300 క్యాబ్రియోలెట్ 19-అంగుళాల AMG అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు కారు రెండు వేర్వేరు టెయిల్ ల్యాంప్ యూనిట్‌లను పొందుతుంది. కారు లోపల పోర్ట్రెయిట్-స్టైల్ 11.9-అంగుళాల టచ్‌స్క్రీన్‌ను పొందుతుంది.

Also Read: ఏంటి భయ్యా ఈ అరాచకం.. హ్యుందాయ్ కార్లపై రూ.90 వేల వరకు డిస్కౌంట్స్..!

లోపలి భాగంలో క్యాబిన్ లేఅవుట్ పెద్ద పోర్ట్రెయిట్-స్టైల్ 11.9-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ డిస్‌ప్లేతో ప్రస్తుత C-క్లాస్‌తో సమానంగా ఉంటుంది. ఇది లోపలి భాగంలో వెంటిలేటెడ్ AMG స్పోర్ట్స్ సీట్లను కూడా పొందుతుంది. దీని పవర్‌ట్రెయిన్ ముందు భాగంలో 2.0 లీటర్, నాలుగు-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 252 bhp, 400 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు 6.6 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం 250 కి.మీ. ఈ కారు AMG స్పోర్ట్స్ సస్పెన్షన్‌తో పాటు 4మ్యాటిక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా పొందుతుంది.

ఇందులో 3D సరౌండ్ సౌండ్, PM 2.5 ఫిల్టర్‌తో శక్తినిచ్చే ఎయిర్ కంట్రోల్, హ్యాండ్స్-ఫ్రీ యాక్సెస్, కీలెస్-GO వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. క్యాబిన్ డైనమిక్ యాంబియంట్ లైటింగ్, క్రోమ్ ట్రిమ్, లెదర్ అప్హోల్స్టరీతో ప్రత్యేకమైన ర్యాప్-అరౌండ్ అనుభూతిని అందిస్తుంది. ఇక మెర్సిడెస్ బెంజ్ నుంచి సెప్టెంబర్ 5, 2024న భారతదేశంలో సంపన్నమైన Mercedes-Benz EQS మేబ్యాక్ SUVని విడుదల చేస్తుంది.

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×