BigTV English

Honda Car Discounts 2024: హూండా డిస్కౌంట్ల జాతర.. ఈ కార్లపై రూ. 1 లక్షకుపైగా ప్రయోజనాలు.. కొద్ది రోజులు మాత్రమే..!

Honda Car Discounts 2024: హూండా డిస్కౌంట్ల జాతర.. ఈ కార్లపై రూ. 1 లక్షకుపైగా ప్రయోజనాలు.. కొద్ది రోజులు మాత్రమే..!

Honda models have discounts exceeding Rs 1 lakh on month of june 2024: భారత మార్కెట్‌లో హోండా కార్ల తయారీ కంపెనీకి సూపర్ క్రేజ్ ఉంది. ఈ కంపెనీ బడ్జెట్ కార్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా తమ కార్ల సేల్స్ మరింత పెంచేందుకు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటించి అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే జూన్ 2024లో హోండా తన మోడళ్లపై గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. హోండా అమేజ్, సిటీ, సిటీ హైబ్రీడ్, హూండా ఎలివేట్ వంటి మోడళ్లపై క్రేజీ ఆఫర్లను అందిస్తోంది. దీనిద్వారా రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపులను కలిగి ఉన్నాయి.


ఈ ఆఫర్‌లలో నగదు తగ్గింపులు, లాయల్టీ ప్రయోజనాలు, మార్పిడి ప్రయోజనాలు, కార్పొరేట్ పథకాలు వంటివి పొందొచ్చు. అయితే ప్రాంతం, స్టాక్ బట్టి తగ్గింపులు మారవచ్చు. అందువల్ల ఈ బెనిఫిట్స్ పొందాలంటే ఈ నెల ఆఖరిలోగా ఈ కార్లను కొనుగోలు చేయాల్సిందే. ఆ తర్వాత ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉండకపోవచ్చు.

హోండా సిటీ


మారుతి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియాతో పోటీ పడుతున్న హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్ కోసం రూ. 1.15 లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇతర వేరియంట్లపై రూ.78,000 వరకు తగ్గింపు ఉంది. ఏప్రిల్ 1కి ముందు ఉత్పత్తి చేయబడిన మోడల్‌లకు రూ.88,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. సిటీ 121hp, 1.4-లీటర్ ఇంజన్‌తో నాలుగు వేరియంట్‌లలో వస్తుంది.

Also Read: కారు కొనాలనుకుంటున్నారా?.. అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే కొత్త కార్లు ఇవే.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం..!

హోండా అమేజ్

హోండా అమేజ్ ఎలైట్ ఎడిషన్‌ కొనుగోలు పై రూ. 1.06 లక్షల వరకు తగ్గింపు ఉంది. గత నెలతో పోలిస్తే రూ. 10,000 పెరిగింది. ప్రారంభ-స్థాయి ఎంట్రీ లెవెల్ వేరియంట్‌పై రూ. 66,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే S, VX ట్రిమ్‌పై రూ.76,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరాకు ప్రత్యర్థిగా ఉన్న అమేజ్ 90hp, 1.2-లీటర్ ఇంజన్ కలిగి ఉంది. ఇది మాన్యువల్, CVT ఎంపికలతో లభిస్తుంది.

హోండా సిటీ హైబ్రిడ్

హోండా సిటీ e:HEV కొనుగోలుపై కంపెనీ రూ. 65,000 ప్రత్యక్ష నగదు తగ్గింపును అందిస్తుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిపి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. మొత్తం 126hp ఉత్పత్తిని అందిస్తుంది. ఇది e-CVT గేర్‌బాక్స్‌ని ఉపయోగిస్తుంది. ఈ మోడల్ అదిరిపోయే ఫీచర్లతో మంచి పనితీరు అందిస్తుంది.

హోండా ఎలివేట్

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్‌లతో పోటీ పడుతున్న హోండా ఎలివేట్ SUV V, ZX వేరియంట్‌లకు రూ.55,000 వరకు తగ్గింపులను అందిస్తుంది. SV, VX వేరియంట్‌లపై రూ. 45,000 వరకు ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇది సిటీ సెడాన్‌తో 121hp, 1.5-లీటర్ ఇంజన్‌ను పంచుకుంటుంది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×