BigTV English

Mini Cooper S – Countryman Ev: కొత్త మినీ మోడల్స్ లాంచ్‌కు రెడీ.. మొదలైన ప్రీ బుకింగ్స్.. ఎక్కడ బుక్ చేసుకోవచ్చంటే..?

Mini Cooper S – Countryman Ev: కొత్త మినీ మోడల్స్ లాంచ్‌కు రెడీ.. మొదలైన ప్రీ బుకింగ్స్.. ఎక్కడ బుక్ చేసుకోవచ్చంటే..?

Mini Cooper S – Countryman Ev: ప్రస్తుతం ఆటో మొబైల్ మార్కెట్‌లో తరచూ ఆధునిక ఫీచర్లతో కొత్త కొత్త వాహనాలు పరిచయం అవుతూనే ఉన్నాయి. ప్రముఖ కంపెనీలు వాహన ప్రియుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని తమ కార్లను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ కార్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మరొక కార్ భారతీయ మార్కెట్‌లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. 5th జెన్ ‘మినీ కూపర్ ఎస్’, ‘మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్’ కార్లు ఈ నెల అంటే జూలై 24న అఫీషియల్‌గా మార్కెట్‌లో లాంచ్ అవుతున్నాయి.


ఈ నేపథ్యంలో కంపెనీ ఈ కార్ల ప్రీ బుకింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే మరి ఈ ప్రీ బుకింగ్స్ ఎలా చేసుకోవాలి.. ఎక్కడ చేసుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం.. ఈ రెండు కార్ల కోసం కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. కాగా దేశ వ్యాప్తంగా కంపెనీకి సంబంధించి మొత్తం 9 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. అందులో ఢిల్లీ ఎన్సీఆర్, పూణే, కొచ్చి, అహ్మదాబాద్, ముంబై, చండీగఢ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రముఖమైన ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లు ఉన్నాయి.

ఈ డీలర్‌షిప్‌లను సంప్రదించి ముందుగా బుకింగ్స్ చేసుకోవచ్చు. అయితే డీలర్‌షిప్‌లలో వద్దనుకునే వారు కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు త్వరలోనే డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇకపోతే త్వరలో మార్కెట్‌లో దర్శనమివ్వనున్న మినీ కూపర్ ఎస్, మినీ కంట్రీమ్యాన్ కార్లు చాలా అత్యాధునికంగా ఉంటాయి.


Also Read: మినీ కూపర్ నుంచి కొత్త SUV.. బుకింగ్స్ ఓపెన్.. ఫీచర్స్ అదుర్స్..!

అంతేకాకుండా డిజైన్, ఫీచర్ల పరంగా కూడా కొత్త అప్డేట్స్ పొందుతాయి. అందువల్ల వీటిని సొంతం చేసుకున్న కస్టమర్లు మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందుతారని కంపెనీ చెబుతోంది. ఇందులో మినీ కూపర్ ఎస్ మోడల్ మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే విధంగా తయారుచేయబడింది. అదే సమయంలో మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ కూడా అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇక పనితీరు పరంగా కూడ ఈ రెండు కార్లు అదరగొడతాయని కంపెనీ చెబుతోంది. కాబట్టి మరికొద్ది రోజుల్లో లాంచ్ కాబోతున్న ఈ కార్లు దేశీయ మార్కెట్‌లో మంచి రెస్పాన్స్‌ను అందుకుంటాయని కొందరు భావిస్తున్నారు.

మినీ కూపర్ ఎస్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో LED DRL, రౌండ్ LED హెడ్‌ల్యాంప్, కొత్త గ్రిల్, యూనియన్ జాక్ థీమ్ టెయిల్ లైట్స్ వంటివి అందించారు. అలాగే క్యాబిన్ మినిమలిస్ట్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో యంబియంట్ లైటింగ్‌ను అమర్చారు. అంతేకాకుండా పార్కింగ్ బ్రేక్, టోగుల్ స్విచ్, గేర్ సెలక్టర్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు. ఇది 201 బిహెచ్‌పి పవర్, 250ఎన్ ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ఫుల్ ఛార్జింగ్‌తో 400 కి.మీ కంటే ఎక్కువ మైలేజీ అందిస్తుంది.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×