Tummidihatti Project: ఇది ప్రాజెక్టులకు పోటీ కాదు. గోదావరి సాక్షిగా ఆదిలాబాద్ దాహం తీర్చే అసలైన పోరాటం. తెలంగాణ జల భవిష్యత్తుకు కొండంత తోడు అదే తుమ్మిడి హట్టి. నీళ్లు కొందరికి రాజకీయ నినాదం మరికొందరికి ఇంజనీరింగ్ అద్భుతం కానీ ఉత్తర తెలంగాణ సరిహద్దుల్లో ఎండనక వాననక శ్రమిస్తున్న గిరిజన రైతులకు మాత్రం ఇది కేవలం బతుకు తెరువు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కళ్ళ ముందే ఉన్న పక్కనే గోదావరికి ప్రాణం లాంటి ప్రాణ హిత పారుతున్న ఆదిలాబాద్ రైతు గొంతు ఎందుకు ఎండిపోతుంది? కాళేశ్వరం ఉండగా మళ్ళీ తుమ్మిడి హెట్టి ఎందుకు అనే ప్రశ్న వెనుక దాగున్న అసలు రహస్యం ఏంటి? 148మీటర్ల లేక 152మీటర్ల ఈ 4మీటర్ల తేడా తెలంగాణ జల భవిష్యత్తును ఎలా మార్చబోతుంది?
గోదావరి ఉపనదుల గురించి తెలుసా..?
ఈ కథను అర్థం చేసుకోవాలంటే మొదట మనం తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. గోదావరి ఉపనదుల గురించి తెలుసుకోవాలి. గోదావరికి మూడు ఉపనదులు కలిసి ఏర్పడ్డ ప్రాణహిత నది గురించి తెలుసుకోవాలి. మహారాష్ట్ర నుండి ప్రవహిస్తూ వచ్చే పెన్‌గంగ వార్దా నదితో కలుస్తుంది. ఈ ఉమ్మడి ప్రవాహం ముందుకు సాగుతూ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే భీకరమైన వైన్‌గంగా నదితో సంగమిస్తుంది. అలా పెన్‌గంగ వార్దా వెన్‌గంగ ఈ మూడు నదుల త్రివేణి సంగమే ప్రాణహితా నది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత అపారమైన వరద సామర్థ్యం ఉన్న నదుల్లో ఇది ఒకటి. ఈ మూడు నదులు కలిసిన సంగమస్థలానికి కేవలం 3 కిలోమీటర్ల ఎగువన తెలంగాణ సరిహద్దుల్లోని కొమరంబీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహట్ అనే గ్రామం వద్ద 2008వ సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాణహిత చేవెల్ల సుజలా శ్రవంతిగా ఓ అద్భుతమైన ప్రాజెక్టుకు పునాది పడింది. సముద్ర మట్టానికి 152మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించి ఏకంగా 160 టఎంసిల నీటిని తరలించి తెలంగాణలోని 16 లక్షల ఎకరాలను సస్యశ్యావలం చేయాలనేది ఆ ప్లాన్ కానీ ఆ ప్లాన్ కు మహారాష్ట్ర రూపంలో పెద్ద అడ్డంకి ఎదురైంది.
152 మీటర్ల కథేంటి?
152మీటర్ల ఎత్తుతో కడితే తమవైపు వేలాది ఎకరాల భూములు గ్రామాలు మునుగుతాయని మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. కేవలం 11వేల కోట్ల వేయంతో దాదాపు 71 కిలోమీటర్ల మేర కాలువల తవ్వకం పనులు మాత్రమే జరిగి ప్రాజెక్టు అర్ధాంతరంగా నిలిచిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 2014 15 లో అప్పటి ప్రభుత్వం సరికొత్త ఇంజనీరింగ్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. తుమ్మిడిహట్టి వద్ద కేంద్ర జలసంఘం లెక్కల ప్రకారం నీటి లభ్యత తక్కువగా ఉందని పైగా మహారాష్ట్ర ఒప్పందానికి రావడం లేదని పేర్కొంటూ ప్రాజెక్టు రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. తుమ్మిడిహట్టి స్థానంలో ప్రాణహిత నదికి కాస్త ముందుకు సాగి గోదావరితో ప్రాణహిత కలిసిన సంగమస్థలమైన మేడిగడ్డ వద్దకు ప్రాజెక్టును మార్చారు. అలా పుట్టిందే ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. పాత ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు చరిత్ర పుటల్లో కలిసిపోయింది. మేడిగడ్డ వద్ద బారి బ్యారేజీలు ఆసియాలోని అతి పెద్ద బాహుబలి మోటర్లు రాత్రింబగళలు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించాయి.
కాళేశ్వరం ఉంటే.. మళ్లీ తుమ్మిడిహట్టి ఎందుకు?
సాధారణ రోజుల్లో రోజుకు రెండు టీఎంసిల నీటిని వరదలు ఎక్కువగా ఉన్నప్పుడు రోజుకు గరిష్టంగామూడు టీఎంసిల నీటిని ఎత్తిపోసే అద్భుత సామర్థ్యం దీనికి ఉంది. ఏడాదికి 240 టీఎంసిల గోదావరి నదీ జలాలను వాడుకునేలా దీన్ని డిజైన్ చేశారు. మరి ఇంతటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ అందుబాటులోకి వచ్చాక మళ్ళీ నేడు తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఎందుకు పునరుద్ధరించాలని చూస్తున్నారు. దీని వెనక రెండు కఠినమైన వాస్తవాలు ఉన్నాయి. ఒకటి ఆర్థిక భారం రెండు భౌగోళిక అన్యాయం. మేడిగడ్డ అనేది సముద్ర మట్టానికి కేవలం 100 మీటర్ల ఎత్తులో చాలా దిగువన ఉంటుంది. అక్కడి నుండి నీటిని ఎగువకు ఎత్తిపోయడానికి ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల విద్యుత్ పిల్లుల భారం అవుతుంది. పైగా మేడిగడ్డ పునాదులలో సాంకేతిక లోపాలు తలెత్తి పిల్లర్లు కుంగాయి. కానీ తుమ్మిడి హట్టి వద్ద గట్టి రాతి నేల ఉండడం వల్ల నిర్మాణం అనేది అత్యంత సురక్షితంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మేడిగడ్డ చాలా దిగువన ఉండడం వల్ల దాని ద్వారా పాత ఆదిలాబాద్ అంటే ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల వంటి ఎగువన ఉన్న కొండ ప్రాంతాలకు నీరందించడం సాంకేతికంగా అసాధ్యం. కాళేశ్వరం నీరంతా ఆదిలాబాద్ దాటి కింది జిల్లాలకే వెళ్తుంది. అందుకే పాత ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సాగుభూములకు నీరువ్వాలంటే తుమ్మిడిహట్టి ఒక్కటే ఏకైక మార్గం.
మేడిగడ్డను రిపేర్ చేసుకోవడమే బెటర్..
గతంలో 2016 లో కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర ముంపు భయంతో తుమ్మిడిహట్టిని కేవలం 148మీటర్ల ఎత్తుతో మాత్రమే కట్టాలని నిర్ణయించారు. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. ఒకవేళ బ్యారేజీని 148మీటర్ల వద్ద కడితే అది ముమ్మాటికి వృధా ప్రయాస అవుతుంది. ఎందుకంటే ఎల్లంపల్లి రిజర్వాయర్ ఎత్తు కూడా 148మీటర్లే రెండు వైపులా సమాన ఎత్తు ఉంటే నీరు ముందుకు ప్రవహించదు. పైగా 148 మీటర్ల ఎత్తు ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఎత్తైన సాగుభూములకు కూడా గ్రావిటీ ద్వారా నీరు అందించలేము. మళ్ళీ అక్కడ మోటార్లు పెట్టి లిఫ్ట్ చేయాల్సిందే. కేవలం 20 టీఎంసిల కొద్దిపాటి నీటి లభ్యత కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ కరెంట్ బిల్లులు కట్టడం కంటే మేడిగడ్డను రిపేర్ చేసుకోవడమే బెటర్ అనే విమర్శలు వస్తాయి. అందుకే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తు కోసం పట్టుపడుతుంది. తుమిడిహట్టి వద్ద నీటిమట్టం 152మీటర్లు ఉంటే ఎల్లంపల్లి అంటే ఎల్లంపల్లి 148మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి ఈ మధ్యలో సుందిల్ల సముద్రమట్టానికి 130మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాబట్టి ఈ అదనపు 4మీటర్ల ఎత్తు వల్ల వచ్చే ఒత్తిడితో ఎటువంటి మోటార్లు కరెంట అవసరం లేకుండా దాదాపు 80టఎంసిల నీటిని నిరంతరాయంగా పూర్తి ఉచితంగా సహజ గ్రావిటీ ద్వారా ఆదిలాబాద్ ఎత్తైన ప్రాంతాలకు మరియు సుందిల్లకు తర్లించవచ్చు. ఇలా జరగాలంటే 152మీటర్ల ఎత్తులోనే తుమ్మిడి హట్టి కట్టాలి. లేకుంటే కట్టడం వృధ.
ఈ ప్రాజెక్ట్ యొక్క అసలైన గేమ్ ప్లాన్ ఏంటో తెలుసా?
వరద వచ్చే సమయంలో నీటిని ఒడిసి పట్టడం జూలై నుండి అక్టోబర్ మధ్య ప్రాణహితా నదికి బారి వరదలు వస్తాయి. ఆ సమయంలో మన మొదటి లక్ష్యం అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వడం తుమ్మిడిహట్టి హెడ్ రెగ్యులేటరీ ద్వారా వరదనీటిని మల్లించి ఆదిలాబాద్ లోని ఆసిఫాబాద్ బెల్లంపల్లి చెన్నూరు నియోజక వర్గాల్లోని చెరువులను రిజర్వాయర్లను నింపుతూ దాదాపు 2 లక్షల ఎకరాలకు తడపొచ్చు. ఆదిలాబాద్ అవసరాలు తీరిన తర్వాత ఇంకా మిగిలిన అదనపు వరద నీటిని నేరుగా కిందికి ఉన్న సుందిల్ల బ్యారేజ్ కు పంపుతారు. సుందిల్ల వద్ద ఇప్పటికే కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన గోలివాడ పంప్ హౌస్ సిద్ధంగా ఉంది. అక్కడి పంపులను వాడుకొని కేవలం 18 మీటర్ల ఎత్తుకు అంటే ఎల్లంపల్లికి నీటిని అత్యంత తక్కువ ఖర్చుతో ఎత్తిపోయొచ్చు. మరి తుమ్మిడి హట్టి సామర్థ్యం కేవలం మూడు నుండి నాలుగు టీఎంసిలే కదా నదికి వచ్చే లక్షలాది క్యూసెకుల బారి వరదను ఇది ఎలా తట్టుకుంటుంది అంటే ఇక్కడే మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. తుమ్మిడిహట్టి కేవలం వరద రోజుల్లో రోజుకు రెండు టీఎంసిల చొప్పున గరిష్టంగా మొత్తం వరద రోజుల్లో 80 టీఎంసిలను మాత్రమే పక్కకు మల్లించగలదు. మిగిలిన 85% బారి వరద ప్రవాహం అంతా కూడా తుమ్మిడిహట్టి గేట్ల ద్వారా కిందికి అంటే దిగువకు ప్రవహించి సహజంగానే కింద ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ కి చేరుకుంటుంది. అంటే తుమ్మిడి హట్టి కట్టిన మిగిలిన అపార జలాలను మేడిగడ్డలో మనం దాచుకోవచ్చు. ఇవి రెండు ఒకదానికిఒకటి పోటీ కావు ఒకదానికిఒకటి తోడు.
Also Read: రైళ్లు ఆపగలరేమో.. ఢిల్లీ రాకుండా ఆపలేరు! మహేష్ కుమార్ గౌడ్ సవాల్
తెలంగాణ ప్రభుత్వం వివాదాలు పక్కన పెట్టి..
2008లో వైఎస్సార్ వేసిన పునాది 2016 లో కేసిఆర్ చేసిన రీడిజైన్ మేడిగడ్డ పిల్లర్లు కుంగిన తర్వాత మారిన సమీకరణాలు ఇవన్నీ దాటుకొని నేడు అక్టోబర్ 2026 లో కథ మళ్ళీ తుమ్మిడిహట్టి వద్దనే ఆగింది. తెలంగాణ ప్రభుత్వం సరిహద్దు వివాదాలను పక్కన పెట్టి మహారాష్ట్రతో జరిపిన తాజా చర్చల ఫలితంగా 152మీటర్ల ఎత్తు వల్ల వచ్చే ముంపును సంయుక్తంగా అంచనా వేయడానికి ఉమ్మడి సాంకేతిక కమిటీ రంగంలోకి దిగింది. రాజకీయాలు ఏవైనా కావచ్చు కానీ ఇంజనీరింగ్ సూత్రం ఒక్కటే 148మీటర్ల వద్ద కడితే ఆదిలాబాద్ గిరిజనుల ఆశలు అడుగంటిపోతాయి. ప్రాజెక్టు నిర్జీవమైపోతుంది. అదే 152మీటర్ల ఎత్తు సాధిస్తే ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కావడమే కాకుండా ఎల్లంపల్లికి శాశ్వత జల భరోసా లభిస్తుంది. నదులను బలవంతంగా కొండలు ఎక్కించే బారి వ్యయ ప్రయాసల కంటే ప్రకృతి ఇచ్చిన భూమి వాలును వాడుకుంటూ గ్రావిటీ శక్తులతో పొలాలను తడపడమే నిజమైన ఇంజనీరింగ్. ప్రాణహిత జలాలు ఆదిలాబాద్ గిరిజన బిడ్డల పొలాలను తాకుతూ తెలంగాణ గుండెను తడిపే ఆ 152 మీటర్ల విజయం కోసమే ఇప్పుడు యావత్ తెలంగాణ నిరీక్షిస్తుంది.