E-Paper
Advertisement

ఫోన్ హ్యాంగ్ అవుతోందా?ఈ సింపుల్ సెట్టింగ్స్‌తో రాకెట్ లా దూసుకెళ్తుంది

ఫోన్ హ్యాంగ్ అవుతోందా?ఈ సింపుల్ సెట్టింగ్స్‌తో రాకెట్ లా దూసుకెళ్తుంది
Advertisement

Old smartphone speed up tricks : ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్ లేనిదే మన రోజు గడవదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే..వరకు ప్రతి పనికి ఫోనే ఆధారం.అయితే..చాలా మంది వాడే.. కొద్దీ ఫోన్ స్లో అయిపోతోందని, యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు.. లాగ్ అవుతోందని బాధ పడుతుంటారు. కొత్త ఫోన్ కొనే.. బడ్జెట్ ప్రతి సారీ అందరికీ ఉండదు. అలాంటప్పుడు.. ఉన్న ఫోన్‌నే సూపర్ ఫాస్ట్‌గా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ పాత ఫోన్ స్పీడ్‌ను పెంచి,స్లో అయ్యే సమస్యను పూర్తిగా తగ్గించడానికి ఈ మూడు సింపుల్ పద్ధతులు అద్భుతంగా పని చేస్తాయి.

1. యాప్స్, క్యాచీ మెమరీ :

మనం ఫోన్‌లో వాడని యాప్స్ చాలా ఉంటాయి. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో.. రన్ అవుతూ రామ్ ను, ఇంటర్నల్ స్టోరేజ్‌ను ..నింపేస్తాయి. అలాగే.. ప్రతి యాప్ తరచూ వాడకం వల్ల ‘క్యాచీ డేటా’పేరుకు పోతుంది. ఇందు కోసం ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, మీరు అసలు వాడని యాప్స్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఆ తర్వాత ‘Storage’ లేదా ‘App Info’ లోకి వెళ్లి ‘Clear Cache’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ప్రతి యాప్‌కు సంబంధించిన జంక్ డేటా తొలగిపోవడంతో.. ఫోన్ మెమరీ ఫ్రీ అవుతుంది. దీని వల్ల ఫోన్ పని తీరు ఒక్క సారిగా మెరుగవుతుంది.

2. ఆటో-అప్‌డేట్స్, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ కంట్రోల్:

Advertisement

గూగుల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ప్రకారం.. బ్యాక్‌ గ్రౌండ్‌లో అనవసరంగా.. రన్ అయ్యే ప్రాసెస్‌లు ఫోన్‌ను స్లో చేస్తాయి. గూగుల్ ప్లే స్టోర్ లేదా సిస్టమ్ యాప్స్ అన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో.. ఆటో మేటిక్‌గా అప్‌ డేట్ అవుతూ ఉంటే.. ప్రాసెసర్‌పై భారం పడుతుంది. ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లో ‘Auto-update apps’ ఆప్షన్‌ను ‘Don’t auto-update apps’కి మార్చండి. అలాగే..డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసి, అందులో ‘Background Process Limit’ ని ‘At most 2 processes’ లేదా ‘Standard limit’ కి సెట్ చేసుకోండి. దీని వల్ల అనవసరమైన యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వకుండా ఆగిపోయి, ర్యామ్ ఫ్రీగా ఉంటుంది.

Also Read: కొత్త పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? వీటి కంటే బెస్ట్ ఉండవేమో!

3. యానిమేషన్ స్కేల్ తగ్గించడం లేదా ఆఫ్ చేయడం:

Advertisement

ఫోన్ స్క్రీన్ పై ఒక యాప్ నుంచి.. మరో యాప్‌లోకి మారేటప్పుడు లేదా హోమ్ స్క్రీన్‌కి వచ్చేటప్పుడు వచ్చే యానిమేషన్స్.. చూడటానికి బాగున్నా, అవి ఫోన్ స్పీడ్‌ను కాస్త నెమ్మదిస్తాయి. ప్రత్యేకించి పాత లేదా లో-రామ్ ఫోన్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇందుకోసం ఫోన్ ‘About Phone’ లోకి వెళ్లి ‘Build Number’ పై 7 సార్లు ట్యాప్ చేస్తే ‘Developer Options’ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అదనపు సెట్టింగ్స్‌లో ‘Developer Options’ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ Window animation scale, Transition animation scale, Animator duration scale అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిని ‘1x’ నుండి ‘0.5x’ కి మార్చండి లేదా పూర్తిగా ‘Animation Off’ చేయండి.ఈ చిన్న మార్పు చేయగానే మీ ఫోన్ ఎంత ఫాస్ట్ అయిందో మీకే అర్థమవుతుంది. యాప్స్ క్షణాల్లో ఓపెన్ అవుతాయి.

ఈ మూడు పద్ధతులతో పాటు .. మీ ఫోన్‌ను వారానికి ఒకసారైనా రీస్టార్ట్ చేయడం మంచిది. దీని వల్ల సిస్టమ్ రిఫ్రెష్ అయ్యి రామ్ క్లియర్ అవుతుంది. ఇకపై.. మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందనే టెన్షన్ ఉండదు.ఈ సింపుల్ టిప్స్ పాటించి మీ పాత ఫోన్‌ను కొత్త దానిలా సూపర్ ఫాస్ట్‌గా మార్చుకోండి!

Related News

పది మందిలో ఏడుగురికి తెలియని..వై-ఫై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ఇవే

ఒక సెకనులో 20 వేల 4K సినిమాలు డౌన్‌లోడ్.. ఇంటర్నెట్ వేగంలో చైనా ప్రపంచ రికార్డు!

కొత్త పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? వీటి కంటే బెస్ట్ ఉండవేమో!

వీఐ యూజర్లకు ఊహించని షాక్.. 84 రోజుల ప్లాన్ ధర పెంపు.. కొత్త ధర, బెనిఫిట్స్ ఇవే!

మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇది మీ మంచికే బాస్!

చిన్న కుటుంబాలకు బెస్ట్ 5 స్టార్ ఫ్రిజ్..ఇప్పుడు ఆఫర్‌‌లో తక్కువ ధరకే!

మీరు మాట్లాడింది ఇట్టే టెక్స్ట్ అయిపోతుంది! ట్రెండింగ్‌లో ఉన్న ఈ గాడ్జెట్ గురించి తెలుసా?

Big Stories

Advertisement
×