BigTV English

Mumbai surpassing Beijing: బీజింగ్‌ను వెనక్కినెట్టిన ముంబయి.. ఆసియా కుబేరుల రాజధానిగా..

Mumbai surpassing Beijing: బీజింగ్‌ను వెనక్కినెట్టిన ముంబయి.. ఆసియా కుబేరుల రాజధానిగా..
Mumbai Emerged As Asia Billionaire capital
Mumbai Emerged As Asia Billionaire capital

Mumbai Emerged as Asia Billionaire Capital: భారత వాణిజ్య రాజధాని ముంబయి మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఆసియా ఖండంలో బిలియనీర్ల కేంద్రంగా ముంబయి అవతరించింది. బీజింగ్ ను దాటి అత్యధిక మంది సంపన్నులు ఉన్న నగరంగా ముంబయి నిలిచింది.


హురున్ గ్లోబల్ రిచ్ నివేదిక ప్రకారం ఆసియా ఖండంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న కేంద్రంగా ముంబయి అవరించింది. చైనా రాజధాని బీజింగ్ ను అధిగమించి తొలిసారిగా ముంబయి బిలియనీర్ క్యాపిటర్ గా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాదికి గానూ ఎక్కువ మంది ధనమంతులు నివాముంటున్న నగరాల జాబితాను హూరున్ తాజాగా వెల్లడించింది. అందులో ఆసియాలో ముంబుయి మొదటి స్థానంలో నిలిచింది.

92 మంది బిలియనీర్లు ముంబయి నగరంలో ఉండడంతో ఇది మొదటి స్థానంలో నిలిచింది. కేవలం ఒక్క బిలియనీర్ స్థానం తగ్గి 91 మంది బిలియనీర్లతో బీజింగ్ రెండో స్థానానికి పరిమితమైంది. గంతో బిజీంగ్ నగరమే ఆసియా ఖండంలో అత్యధిక శ్రీమంతులు ఉండే నగరంగా ఉండేది. కానీ ఈ ఏడాది ముంబయి స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది కాలంలో ముంబయిలో 26 మంది కుబేరుల క్లబ్ లో చేరారు. అయితే బీజింగ్ మాత్రం దీనికి భిన్నంగా 18 మందిని ఈ జాబితా నుంచి కోల్పోయింది.


ముంబయి ప్రపంచంలోనే అత్యంత వేగంగా బిలియనీర్ క్యాపిటల్ నగరంగా ఎదిగిన నగరం అని హూరున్ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కుబేరులున్న నగరాల జాబితాలో ముంబయి మూడో స్థానంలో నిలిచినట్లు హూరున్ గ్లోబల్ రిచ్ నివేదిక తెలిపింది. ఈ లిస్ట్ లో న్యూయార్క్ 119 మందితో మొదటి స్థానంలో ఉంది. 97 మందితో లండన్ రెండో స్థానంలో నిలిచింది. మన దేశ రాజధాని ఢిల్లీ ఈ నివేదిక ప్రకారం తొలిసారిగా టాప్-10లో చోటు సంపాదించింది.

Also Read: Hand Bags: గాలితో తయారైన హ్యాండ్ బ్యాగ్.. ప్రపంచంలోనే లైట్ వెయిట్ బ్యాగ్‌గా రికార్డ్

అయితే దేశాల వారిగా చూస్తే ఎక్కువ మంది బిలియనీర్లతో చైనానే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో చైనా 155 మంది కోటీశ్వరులు తమ సంపదను భారీగా కోల్పోయారు. అయినా సరే 814 మంది బిలియనీర్లతో చైనా మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. చైనా తర్వాత స్థానంలో.. 800 మందితో అమెరికా రెండో స్థానానికి పరిమితమైంది. అయితే ఈ జాబితాలో 271 మందితో భారత్ మూడో స్థానంలో ఉంది. త్వరలోనే భారత్ లో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని హురున్ గ్లోబల్ రిచ్ అభిప్రాయపడింది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×