Big Stories

Raghunandan Rao on Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్వవహారం.. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నేనే బాధితుడిని!

BJP Leaders On Phone Tapping Issue
BJP Leaders On Phone Tapping Issue

BJP Leaders on Phone Tapping Issue: ఫోన్‌ ట్యాపింగ్‌పై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే.. రెండో వ్యక్తిని తానేనన్నారు రఘునందన్ రావు. ఫోన్‌ ట్యాపింగ్ కేసుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు మాజీ మంత్రులు సోమవారం సమావేశమయ్యారని, వారు విదేశాలకు పారిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారని, ఆ ఇద్దరి పాస్‌ పోర్టులు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్, MLC నవీన్ రావులను అరెస్ట్ చేయాలన్నారు. బీఎల్ సంతోష్ ను ఈ కేసులో అనవసరంగా ఇరికించారన్నారు రఘునందన్ రావు.

- Advertisement -

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌పై న్యాయ విచారణకు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు మాఫియాగా ఏర్పడి ట్యాప్ చేశారన్నారు. బీజేపీ ఆఫీస్ సిబ్బంది నుంచి అగ్రనేతల వరకు ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పౌరుల హక్కులు భంగం కలిగేలా గత ప్రభుత్వ హయాంలో అధికారులు ప్రవర్తించారని తెలిపారు.

Also Read: ఖాకీలు కాదు వాళ్లు.. ఖతర్నాక్ రౌడీలు.. తెరపైకి బీఆర్ఎస్ పెద్దల పేర్లు

అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. బ్లాక్ మెయిల్ చేసి కోట్లు వసూళ్లు చేశారని స్పష్టం చేశారు. నారాయణగూడ బ్యాంక్‌లో డబ్బులు డ్రా చేసి వస్తుంటే, ఫోన్ ట్యాప్ చేసి మరీ తమ పార్టీ క్లర్క్‌లను పట్టుకున్నారని తెలిపారు. కేసిఆర్ నేర సామ్రాజ్యంపై సమగ్ర విచారణ చేపట్టాలి ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News