Big Stories

iQOO Z9x 5G Launch Confirmed: 6000mAh బ్యాటరీతో ఐక్యూ ఫోన్.. మే 16న లాంచ్.. బ్యాటరీతో పాటు ఫీచర్స్ అదుర్స్!

iQOO Z9x 5G Launching on MY 16th: 5G స్మార్ట్‌ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. 5G పోన్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొబైల్ యూజర్లు ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ నెట్వర్క్ కారణంగా వేగవంతమైన ఇంటర్నెట్, మంచి నెట్వర్క్‌‌ను పొందవచ్చు. ఇందులో భాగంగానే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటాపోటీగా 5G ఫోన్లను తీసుకొస్తున్నారు.

- Advertisement -

తాజాగా iQOO భారతీయ కస్టమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతోంది. కంపెనీ iQOO Z9x 5Gని విడుదల చేయనుంది.  ఫోన్ లాంచ్ తేదీకి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ వెల్లడించింది. iQOO ఇండియా సీఈఓ నిపున్ మరియా ఈ ఫోన్‌ను మే 16న లాంచ్ చేయబోతున్నట్లుగా తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెెలుసుకోండి.

- Advertisement -

iQOO Z9x 5G లాంచ్ టీజర్ అమెజాన్‌లో కంపెనీ లైవ్ చేసింది. ఈ పేజీలో అందించిన సమాచారం ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌ను మే 16న విడుదల కానుంది. అయితే, iQOO Z9x 5Gకి సంబంధించిన ఇతర సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. iQOO ఇండియా CEO నిపున్ మరియా రాబోయే ఫోన్‌కు సంబంధించి పోస్టర్‌ను షేర్ చేశారు.

Also Read: ధమాకా ఆఫర్స్.. టాప్ 5 కాస్ట్‌లీ 5G ఫోన్లు రూ.10 వేల కంటే తక్కువ ధరకే!

ఈ పోస్టర్‌ను కంపెనీ CEO నిపున్ తన అధికారిక X హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ పోస్టర్‌తో కొత్త ఫోన్ డిజైన్ రివీల్ అయింది. కంపెనీ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను క్యాప్షన్ చేశారు. – Fully loaded for a full day of action!.  పోస్టర్‌లో ఈ ఫోన్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. కంపెనీ చైనాలో iQOO Z9x 5Gని ఇంతకముందే తీసుకొచ్చింది. దీనితో పాటు కంపెనీ చైనాలో ఉన్న అదే మోడల్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Also Read: ఆఫర్ల జాతర.. బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, నెక్‌బ్యాండ్‌లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు! 

iQOO Z9x 5G స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే కంపెనీ iQOO Z9x 5Gని మూడు కాన్ఫిగరేషన్‌లలో తీసుకొస్తుంది. 4GB+128GB, 6GB+128GB, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్‌లు ఉంటాయి.
ఈ ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌సెట్‌తో తీసుకురావచ్చు. కంపెనీ ఇందులో 6,000mAh బ్యాటరీ ప్యాక్ ఇస్తుంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్‌ను తీసుకురావచ్చు. Z9x 5Gలో 50MP ప్రైమరీ కెమెరాను చూడొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News