E-Paper
Advertisement

New ATM Rules: ఏటీఎం మనీ విత్ డ్రా పై కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

New ATM Rules: ఏటీఎం మనీ విత్ డ్రా పై కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Advertisement

New ATM Rules: కొన్ని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ఫ్లాట్ ఫామ్స్ ఏప్రిల్ 1,2026 నుంచి ఏటీఎం నిబంధనలలో మార్పులు చేస్తున్నాయి. కొత్త ఏటీఎం రూల్స్ లో భాగంగా.. మనీ విత్ డ్రా లిమిట్స్, లావాదేవీ ఛార్జీల్లో మార్పులు చేయనున్నాయి. కొత్త నిబంధనలు రోజువారీ మనీ విత్ డ్రా, బడ్జెట్, బ్యాంకింగ్ ఖర్చులను ప్రభావితం చేయనున్నాయి.

హెచ్డీఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏప్రిల్ 1,2026 నుంచి ఏటీఎం లావాదేవీలలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఏటీఎంలో యూపీఐ ద్వారా మనీ విత్ డ్రా చేయడాన్ని ఉచిత లావాదేవీల పరిమితిలో చేర్చనున్నట్లు హెచ్డీఎఫ్సీ తెలియజేసింది. ఇంతకు ముందు వీటిని విడిగా పరిగణించేవారు. ఇప్పుడు వీటిని ఉచిత ఏటీఎం లావాదేవీలలో యాడ్ చేయనున్నారు. ఉచిత లావాదేవీల పరిమితిని మించితే కస్టమర్ల నుంచి ప్రతి విత్‌ డ్రాకు రూ. 23 ఛార్జీ వసూలు చేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ తెలిపింది. కస్టమర్ మనీ విత్ డ్రా విషయంలో ఈ రెండింటినీ గమనించాల్సి ఉంటుంది.

విత్ డ్రా లిమిట్ తగ్గింపు

Advertisement

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు.. ప్రస్తుతం ఉచిత ATM విత్‌డ్రాయల్ పరిమితులు ప్రాంతాన్ని బట్టి అమలు చేస్తుంది. ఇతర బ్యాంకుల ATMలలో, మెట్రో నగరాల్లో నెలకు 3 ఉచిత విత్‌డ్రాయల్స్, నాన్-మెట్రో నగరాల్లో 5 ఫ్రీ విత్‌డ్రాయల్స్ పొందుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఏప్రిల్ 1 నుంచి ఏటీఎం విత్‌డ్రాయల్ లిమిట్స్ లో మార్పులను ప్రకటించింది. కొన్ని రకాల డెబిట్ కార్డులకు రోజువారీ లిమిట్స్ ను సవరిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్లు తమ కార్డు రకాన్ని బట్టి రోజుకు రూ. 50,000 లేదా రూ. 75,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. రూపే NCMC ప్లాటినం డొమెస్టిక్ డెబిట్ కార్డు పరిమితిని రూ. 1,00,000 నుంచి రూ. 50,000కి తగ్గించింది. రూపే NCMC ప్లాటినం ఇంటర్నేషనల్, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం డెబిట్ కార్డులతో కూడా ఈ పరిమితిని విధించింది.

యూపీఐతో మనీ విత్ డ్రా

యూపీఐ క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేసి మనీ విత్ డ్రా చేసుకోవచ్చని జియో పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. ఈ సర్వీస్ తమ బిజినెస్ కరస్పాండెంట్ (BC) పాయింట్ల ద్వారా అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. కస్టమర్ తమ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బీసీ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనుంది.

Advertisement

Also Read:  ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం ప్రారంభం.. క్షణాల్లో గ్యాస్ సిలిండర్, 24 గంటలు అందుబాటులో

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×