E-Paper
Advertisement

Divyanka Pregnancy: నలభై ఏళ్ల వయసులో తల్లిదండ్రులు కాబోతున్న బుల్లితెర జంట..

Divyanka Pregnancy: నలభై ఏళ్ల వయసులో తల్లిదండ్రులు కాబోతున్న బుల్లితెర జంట..
Advertisement

Divyanka Pregnancy: ప్రముఖ టెలివిజన్ నటీనటులు దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. వివాహమైన ఎనిమిదేళ్ల తర్వాత ఈ జంట తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారు ఆసక్తికర విషయలు ప్రేక్షకులతో పంచుకున్నారు. దివ్యాంక ప్రెగ్నెన్సీ వార్త గురించి వివేక్ దహియా స్పందిస్తూ, ‘మా జీవితం ఒక్క రాత్రిలో ఎవరో తిరగరాసిన స్క్రిప్ట్‌లా అనిపిస్తోంది. ఇది మొదట నమ్మశక్యంగా అనిపించలేదు, కొంచెం కంగారు పడ్డాను కూడా. కానీ గత కొన్ని నెలలుగా ఆ వార్తను జీర్ణించుకుని, ఇప్పుడు ఒక తండ్రిగా బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ఆనందం వ్యక్తం చేశారు.

Read also-Mohan Babu: ‘ది ప్యారడైజ్’ నుంచి మెహన్ బాబు మేకోవర్ వీడియో చూశారా.. ఇది ఊర మాస్..

నిరీక్షణ ఫలించింది

Advertisement

తల్లి కాబోతున్న అనుభూతిని దివ్యాంక వివరిస్తూ, “నేను ప్రతి నెలా ప్రెగ్నెన్సీ స్ట్రిప్స్ చూస్తూ ఎంతో ఆశగా ఎదురుచూసేదాన్ని. చివరకు ఆ రెండు గీతలు కనిపించినప్పుడు అది నిజమని నమ్మడానికి నాకు కొంత సమయం పట్టింది. ఆ సమయంలో నేను వెంటనే సంబరాలు చేసుకోలేదు, నా శరీరం మనస్సులో వస్తున్న మార్పులను గమనిస్తూ చాలా జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టాను” అని పేర్కొన్నారు. 40 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు కావడంపై ఈ జంట చాలా స్పష్టతతో ఉన్నారు. “వయసు అనేది భయపడాల్సిన విషయం కాదు, అది ఒక శక్తిగా మారాలి. ఈ వయసులో మన శరీరానికి ఏది అవసరమో మనకు బాగా తెలుస్తుంది. మాకు మానసిక స్పష్టత ఉన్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని వారు తెలిపారు.

Read also-Ustaad Bhagat Singh Review: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కంటే..

సరదా అనుభవాలు

Advertisement

సాధారణంగా గర్భిణీలకు ఉండే ఫుడ్ క్రేవింగ్స్ (రకరకాల పదార్థాలు తినాలనే కోరిక) వివేక్‌కు ఎక్కువగా ఉన్నాయట. “నాకు విపరీతంగా ఐస్‌క్రీమ్‌లు, చాట్, బర్గర్లు తినాలనిపిస్తోంది. నాకంటే వివేక్ కే ప్రెగ్నెన్సీ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని దివ్యాంక నన్ను ఆటపట్టిస్తోంది” అని వివేక్ సరదాగా చెప్పారు. ప్రస్తుతం దివ్యాంక తన ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జూన్ నెలలో ఈ జంట తమ చిన్నారిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వార్త విన్న అభిమానులు మరియు సహనటీనటులు వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×