Big Stories

Upcoming Cars in 2024: ఇక రేస్ మొదలెడదామా.. లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు!

2024 Upcoming Cars
2024 Upcoming Cars

Upcoming Cars in 2024: ఈ ఏడాది ప్రారంభం నుంచే చాలా వాహనాలు భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో అడుగుపెట్టాయి. అమ్మకాల్లో రికార్డులు మోత మోగించాయి. కార్ల కంపెనీలు భారీ స్థాయిలో లాభాలను గడించాయి. ఇదే జోరును కొనసాగించేందుకు కార్ల కంపెనీలు మళ్లీ సిద్దం అయ్యాయి. ఏప్రిల్‌లో మరికొన్ని కార్లు రంగప్రవేశం చేయనున్నాయి. ఆ కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

- Advertisement -

టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్

- Advertisement -

టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్ ఏప్రిల్ నెలలో విడుదల కావడానికి సిద్దమవుతుంది. ఈ వేరియంట్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ నుంచి ప్రేరణ పొందిన SUV. టయోటా, మారుతి సుజుకి సహకారంతో దేశీయ మార్కెట్లో విడుదలకానున్న నాలుగవ మోడల్ ఈ టైసర్. ఇది ఏప్రిల్ 3న ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.

ఈ కారులో కొత్త గ్రిల్, బంపర్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిలో మార్పులు చేశారు. ఇది 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ మరియు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌లో వస్తుంది. ఇది మార్కెట్లో టాటా పంచ్ ,హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి వాటికి గట్టిపోటీగా నిలువనుంది.

Also Read: బైకు కొనేందుకు ఇదే మంచి ఛాన్స్.. రూ.60 వేలు డిస్కౌంట్!

మహీంద్రా ఎక్స్‌యువీ300 ఫేస్‌లిఫ్ట్

దేశీయ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యువీ 300 కారును లాంచ్ చేయనుంది. ఇది రిఫ్రెష్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, రీడిజైన్ గ్రిల్, అప్డేటెడ్ అల్లాయ్ వీల్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన లేటెస్ట్ ఫీచర్లతో రానుంది. ఇది కూడా వచ్చే నెలలో లాంచ్ కానుంది.

మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

భారతీయ మార్కెట్లో ఎక్కువమంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్న కార్ల కంపెనీ మారుతి. ఈ కంపెనీకి చెందిన మారుతి స్విఫ్ట్ త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల కానుంది. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ, డిజైన్ ఉండనుంది. ఇది కూడా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధిస్తోందని సంస్థ భావిస్తోంది.

కొత్త మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 Bhp పవర్ 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మరింత మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించడానికి సెల్ఫ్ ఛార్జింగ్ 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టంను అమర్చారు. అంతేకాకుండా కొనుగోలు దారులకు మెరుగైన భద్రత
అందించడానికి కంపెనీ ఈ కారులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ ఉండనుంది.

Also Read: ఈ 10 కార్లతో మీ ప్రయాణం సేఫ్.. ఎందుకంటే?

టాటా ఆల్ట్రోజ్ రేసర్

టాటా కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాటా అత్యంత సురక్షితమైన కార్లను అందిస్తుంది. ఏప్రిల్‌లో టాటా కొత్త ఆల్ట్రోజ్ రేసర్ అనే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును రిలీజ్ చేయనుంది. ఈ కొత్త కారులో 1.2 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120 Bhp పవర్,170 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

అంతేకాకుండా మంచి డిజైన్, అధునాతన ఫీచర్స్‌లో టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఏప్రిల్ రేసులో నిలవనుంది. ఇందులో బోల్డ్ గ్రాఫిక్స్ స్పోర్టి బకెట్ సీట్లతో సహా అనేక విలక్షణమైన ఫీచర్స్ ఉంటాయి. అలానే పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే మాత్రమే కాకుండా అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ వంటి సిస్టమ్ ఉంది.

స్కోడా సూపర్బ్

స్కోడా వచ్చే నెలలో తన సూపర్బ్ కారును తీసుకురానుంది. దీని అమ్మకాలు ఏప్రిల్ 3న ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త మోడల్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 189 Bhp పవర్, 320 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ సెడాన్ కంప్లీట్ బిల్డ్ యూనిట్ ద్వారా అటోమొబైల్ మార్కెట్‌లోకి రానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News