July 1st New Rules: మరో ఆరు రోజుల్లో కొత్త జూలై నెల రాబోతోంది. ఏమైనా మార్పులున్నాయా? ప్రతి నెల మాదిరిగా రానున్న నెలలో ఆర్థిక, పరిపాలనా మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పులు సామాన్యుడిపై ఎంతమేరా పడనుంది? ఏయే రంగాలపై ప్రధానంగా ప్రభావం చూపుతోంది? అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం.
జూలై ఒకటి నుంచి మార్పులు ఈ రంగాల్లో మొదలు
జూలై నెల రావడానికి కొద్ది రోజులు మాత్రమే వున్నాయి. ప్రతి నెల మాదిరిగా కొత్త నెలలో కొన్ని మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక, పరిపాలనకు సంబంధించి కొత్త మార్పులు ఉండబోతున్నాయి. వాటి ప్రభావం సామాన్యుడిపై ప్రభావం చూపనున్నాయి. ఖర్చులు, బ్యాంకింగ్ సర్వీసు, ట్రావెలింగ్, ఆయిల్ వ్యయాలపై ప్రభావం చూపనుంది.
జూలై నెలలో అమల్లోకి రానున్న కొత్త మార్పు ఆధార్. దీనికి సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆధార్ కార్డులో ఈ-మెయిల్ ఐడీని అప్‌డేట్ ఉచితంగా చేసుకోవచ్చు. గతంలో ఈమెయిల్ చిరునామా మార్పు కోసం రూ.75 వరకు చెల్లించాల్సి వచ్చేది. జూలై ఒకటి నుంచి డిసెంబర్ చివరికి ప్రత్యేక గడువును కల్పించింది. ఆధార్‌కు ఈమెయిల్ ఐడీ లింక్ చేయడం వల్ల OTP, ప్రభుత్వ సేవలు, డిజిటల్ గుర్తింపు ప్రక్రియలు సులభతరం కానున్నాయి.
ఆధార్, బ్యాకింగ్, ట్రావెలింగ్, గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్
మరొక నిర్ణయం గ్యాస్ సిలిండర్ ధరల అంశం. ప్రతి నెల ఒకటిన చమురు సంస్థలు వాటి ధరలను సమీక్షించి కొత్త ధరలను ప్రకటించనున్నాయి. జూలై 1న గ్యాస్‌కు కొత్త ధరలు వెలువడనున్నాయి. జూన్ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.53.50 పెంచాయి. అదే సమయంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది కేంద్రం.
జూన్ 30లోపు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. గడువులోగా చేయని పక్షంలో వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ నిలిపి వేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ చేరనుంది. జూలై నెలలో CNG, PNG, విమాన ఇంధన ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా ముడి చమురు ధరలు మారుతూ ఉంటాయి. పరిశ్రమల్లో PNG వినియోగంతో ధరల సవరణలు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాహనదారులు ఉపయోగించే CNG ధరలు మారే అవకాశం ఉంది. విమాన ఇంధన ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. పెరిగితే టికెట్ల ధరలపై పరోక్ష ప్రభావం చూపనుంది.
ALSO READ: దేశంలో సైబర్ దాడులు తీవ్రతరం.. వ్యాపారవేత్తల్లో వణుకు మొదలు
క్రెడిట్ కార్డు ఉపయోగించేవారికి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రైవేట్ బ్యాంక్ HDFC జూలై నుంచి క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు తీసుకురానుంది. రెగాలియా క్రెడిట్ కార్డు వినియోగదారులపై ప్రభావం చూపనుంది. ఈ కార్డు ద్వారా దేశీయ ఎయిర్‌పోర్టుల్లో లాంజ్ సదుపాయాలను ఫ్రీ గా వినియోగించుకునే అవకాశం ఉండేది. జూలై నుంచి ఈ సదుపాయాన్ని కొనసాగించాలంటే కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
ఒక త్రైమాసికం అంటే కనీసం మూడునెలల్లో రూ.60 వేలు ఖర్చు చేసినవారికి తదుపరి త్రైమాసికంలో దేశీయ విమానాశ్రయంలో ఉచితంగా లాంజ్ యాక్సెస్ లభించనుంది. లాంజ్‌ల వినియోగం గణనీయంగా పెరగడంతో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ ప్రభావం తరచూ విమాన ప్రయాణాలు చేసే వ్యాపారులు, ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.