E-Paper
Advertisement

మెటాకు భారీ షాక్.. ఏకంగా రూ.4,700 కోట్ల ఫైన్.. ఇంతకీ కేసు ఏంటంటే?

మెటాకు భారీ షాక్.. ఏకంగా రూ.4,700 కోట్ల ఫైన్.. ఇంతకీ కేసు ఏంటంటే?
Advertisement

Meta Fine: సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్‌ల వల్ల యువత, చిన్నారులు తీవ్రంగా ప్రభావితమౌతున్నారంటూ నమోదైన కేసులో న్యూమెక్సికో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు 567 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4,700 కోట్లకు పైగా) చెల్లించాలని మెటా సంస్థను ఆదేశించింది. రెండు విడతలుగా జరిగిన ఈ చారిత్రక విచారణలో మార్చి నెలలోనే మెటా ఓడిపోగా.. తాజాగా పరిహారానికి సంబంధించిన వివరాలను కోర్టు వెల్లడించింది.

ఆ నిధులు దేని కోసం?

జడ్జి బ్రయాన్ బీడ్‌షీడ్ ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఈ పరిహారం సొమ్ములో మెజారిటీ భాగం.. అంటే దాదాపు 420 మిలియన్ డాలర్లను బాధితులైన యువతకు చికిత్స, కౌన్సెలింగ్ సేవలు అందించడానికి ఉపయోగిస్తారు. మిగిలిన నిధులను రాబోయే ఐదేళ్లలో సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన పెంచడం, నివారణ చర్యలు చేపట్టడం, స్క్రీనింగ్ సేవలు అందించడం, అనుబంధ ఖర్చుల కోసం కేటాయించనున్నారు.

విచారణలోనే తీవ్ర వ్యాఖ్యలు

Advertisement

ఈ కేసు మొదటి దశ విచారణలోనే జ్యూరీ.. మెటాపై 375 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. తమ ప్లాట్‌ఫామ్‌ల వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిసినా మెటా కావాలనే నిర్లక్ష్యం వహించిందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్లాట్‌ఫామ్‌లలో జరిగే పిల్లల లైంగిక వేధింపుల గురించిన సమాచారాన్ని సంస్థ దాచిపెట్టిందని తీవ్ర స్థాయిలో మండిపడింది.

Also Read: ఇదెక్కడి వింత.. సముద్రంలా మారిన బావి.. ఎగసిపడుతున్న అలలు!

వయసు ధ్రువీకరణపై కోర్టు స్పష్టత

Advertisement

రెండో దశ విచారణలో భాగంగా.. ప్రాసిక్యూటర్లు కీలక విషయాలను లేవనెత్తారు. సోషల్ మీడియాకు పిల్లలు బానిసలుగా కాకుండా చూడటం, మెరుగైన వయస్సు నిర్ధారణ పద్ధతులు పాటించడం, డిఫాల్ట్ ప్రైవసీ సెట్టింగ్స్ తీసుకురావడం వంటి అనేక ప్రాథమిక మార్పులను మెటాలో అమలు చేయించాలని కోర్టును కోరారు. అయితే చట్టపరమైన పరిమితుల వల్ల వయస్సు నిర్ధారణ ప్రక్రియను నిర్బంధంగా అమలు చేయమని మెటాను ఆదేశించలేమని కోర్టు తెలిపింది. అంతేకాకుండా ఇతర సోషల్ మీడియా కంపెనీలను వదిలేసి కేవలం మెటాపైనే ఈ తరహా ఏజ్ వెరిఫికేషన్ నిబంధనలు రుద్దడం అన్యాయమని అభిప్రాయపడింది.

Also Read: డెలివరీ యాప్స్ కొత్త దందా.. మరీ ఇంత మోసమా.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు!

Tags

Related News

చమురు ధరల పెరుగుదల.. ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టాలు, పెట్రోల్‌పై రూ.8-డీజిల్‌ పై రూ.9

చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే.. కట్ చేస్తే నేడు వేల రూ.కోట్లకు అధిపతి

భారీగా దిగొస్తున్న బంగారం ధర.. మహిళల్లో ఒక్కటే ఆనందం, ఇవాళ మార్కెట్లో ధరలు

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌లో నెలకు రూ.4000 పెట్టుబడితో 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

సమ్మె ప్రభావం.. ఆదివారం బ్యాంకులు ఓపెన్, ఆర్థిక‌శాఖ ప్రకటన

నెలకు రూ.68 కోట్లు సంపాదిస్తున్న మిస్టర్ బీస్ట్.. పెద్ద యూట్యూబర్ కావాలంటే ఏం చేయాలి

రూ.50 లక్షల ఫైన్, 3 ఏళ్లు జైలు శిక్ష.. సిమ్ కార్డు దుర్వినియోగంపై కేంద్రం కఠిన నిబంధనలు

బంగారం ధరలు పతనం.. కొనుగోలుదారుల్లో ఉత్సాహం, తెలుగు రాష్ట్రాల్లో ధరలు

Big Stories

Advertisement
×