Nissan Magnite Car: ఇండియాలో నిస్సాన్ కంపెనీకి బెస్ట్ సెల్లింగ్ మోడల్ కారు మాగ్నైట్. ఈ వాహనంపై ఉన్న డిమాండ్‌ను తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడింది ఆ కంపెనీ. నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ ధరను రూ. 4 వేలు వరకు పెంచింది ఆ సంస్థ. సింపుల్ చెప్పాలంటే ధర పెంపుతో కొనుగోలుదారులకు భారం పెరగనుంది.
నిస్సాన్ మాగ్నైట్ మళ్లీ వడ్డన
నిస్సాన్ మాగ్నైట్ కంపెనీ తన క్రమంగా ధరలు పెంచడం మొదలుపెట్టింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఒకసారి పెంచగా, తాజా మరోసారి పెంచేసింది. నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ ధరను రూ. 22వేలు పెంచుతున్నట్టు జనవరి 31న ఒక ప్రకటన చేసింది. తాజా పెంపుతో, మాగ్నైట్ ప్రారంభ ధర రూ .6.14 లక్షలకు చేరింది. ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే.
దేశంలో నిస్సాన్ విక్రయించే రెండు ప్యాసింజర్ వాహనాల్లో నిస్సాన్ మాగ్నైట్ అన్ని వేరియంట్లకు పెరిగిన ధరలు వర్తించనున్నాయి. దాని ఫలితంగా ఇప్పుడు మాగ్నైట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 6.14 లక్షల నుంచి రూ. 11.92 లక్షల వరకు ఉండనుంది. ఎస్‌యూవీ ఆరు వేరియంట్లు ఉండనుంది. వాటిలో 12 కలర్ ఆప్షన్లు, రెండు ఇంజన్లు, మూడు ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో వస్తోంది.
మరో విషయం ఏంటంటే మాగ్నైట్ ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్లతో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో కొత్త హైబ్రిడ్ మోడల్ రావచ్చనే వార్త సైతం లేకపోలేదు. నివేదికల ప్రకారం మాగ్నైట్ హైబ్రిడ్, సీఎన్జీ వేరియంట్లను త్వరలో విడుదల చేసే అవకాశముంది. వచ్చే ఏడాది అంటే 2026 నాటికి ఈవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆ సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు గతంలో వెల్లడించింది. నిస్సాన్ మాగ్నైట్ ఈవీ వర్షెన్ కూడా వస్తుందో? లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సివుంది.
ALSO READ: పురుషులను అధిగమించిన మహిళలు
నిస్సాన్ మాగ్నైట్ శ్రేణిని ఈ 20 కంపాటబుల్ పవర్ ట్రెయిన్‌తో అప్డేట్ చేసింది. ఎస్‌యూవీకి చెందిన 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ బీఆర్ 10 పెట్రోల్ ఇంజిన్ ఈ 20 కంప్లైంట్‌గా మారిపోయింది. 1.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ మోటార్ కొంతకాలం కిందట ఈ 20 కంప్లైంట్‌గా మారిన విషయం తెల్సిందే. ది.
నిస్సాన్ మాగ్నైట్ ఇంజన్ విషయానికి వద్దాం. 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ 71 బీహెచ్పీ పవర్, 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మరోవైపు టర్బోఛార్జ్డ్ పెట్రోల్ మోటార్ 98 బీహెచ్పీ పీక్ పవర్, 160 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ని జనరేట్ చేయనుంది.
నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎమ్‌టీ) ఆప్షన్స్ దీని సొంతం. మరోవైపు టర్బోఛార్జ్డ్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించనుంది.