Women Invest In SIP: భారతీయ మహిళలు పొదుపు చేయడంలో తిరుగు లేదు. అందుకే ఇళ్లలో మహిళలకు ఆర్థిక కార్యక్రమాల బాధ్యతలు తీసుకుంటారు. ఫ్యామిలీకి ఇబ్బందులు వచ్చినప్పుడు సేవింగ్ చేసిన నిధులను ఉపయోగిస్తారు. ఫ్యామిలీని సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. వీలు చిక్కినప్పుడల్లా బంగారంలో పెట్టుబడులు సైతం పెడుతుంటారు. తాజాగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఇదొక శుభ సూచకం లాంటిదని చెప్పవచ్చు.
మహిళలదే పైచేయి
ఫోన్ పే యాప్‌లో రిఛార్జ్, బిలులు పేమెంట్ల కోసం అధికంగా ఉపయోగిస్తారు. అందులో లోన్స్ తీసుకోవచ్చు. అన్ని ఇన్యూరెన్స్‌లను తీసుకోవచ్చు. స్టాక్ మార్కెట్‌కు ఉద్దేశించింది వెల్త్ అనే కాలమ్. దీని గురించి సింపుల్‌గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించినది. ఇందులో రూ. 100 సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు. ఫోన్ పే వెల్త్ నివేదిక గురించి కీలక విషయాలు బయటపెట్టింది.
ఫోన్ పే ఏం చెప్పింది?
పురుషుల కంటే మహిళలు అధికంగా మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్-SIP పద్దతి ద్వారా లాంగ్ టర్న్ ఇన్వెస్ట్‌కు దాదాపు 90 శాతం మహిళలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. నెలకు దాదాపు రూ.1300 సిప్ వాయిదా చెల్లిస్తున్నారట. పురుషులు పెట్టుబడి సగటు కంటే ఇది ఎక్కువ.
ఒకేసారి పెద్ద మొత్తం(లంప్‌సమ్) పెట్టుబడుల్లో అతివలదే పైచేయి అని ఆ నివేదిక సారాంశం. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన మహిళలు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో టాప్ కొనసాగుతున్నారు. మరో కీలకమైన విషయం ఏంటంటే.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే మహిళల్లో 74 శాతం మంది 35 ఏళ్ల వయసు లోపు వారే ఉంటున్నారు.
ద్వితీయ శ్రేణి నగరాల మహిళలు సైతం
అందులో 29 శాతం మంది మహిళలు 26 నుంచి 30 ఏళ్ల లోపు వారే ఉన్నట్లు నివేదిక తేల్చింది. చాలా మంది సిప్ పెట్టుబడుల ద్వారానే మ్యూచువల్ ఫండ్లలోకి ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు 90 శాతం మహిళలు ఇదే రూటుని ఎంచుకుంటున్నారు. మెట్రో సిటీలకు చెందిన మహిళలు మాత్రమే కాకుండా సెకండ్, థర్డ్ శ్రేణి నగరాల మహిళలు సైతం మ్యూచువల్ ఫండ్స్‌లో అడుగుపెట్టేశారు.
వారణాసి, రాంచీ, గౌహతి, వడోదరా, డెహ్రాడూన్ వంటి నగరాల నుంచి అధిక సంఖ్యలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. మహిళలు అధికంగా వాల్యూ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది. ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, థీమ్యాటిక్ ఫండ్స్‌లో అధికంగా పెట్టుబడులు పెడుతున్నారని ప్రస్తావించింది.
మహిళలు పెట్టుబడుల విషయంలో చాలా దీర్థంగా ఆలోచన చేస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా అడుగులు వేస్తూ నిర్ణయాలను తీసుకుంటున్నారు. వారి ఆశయాలను ప్రతిబింబించే భవిష్యత్తును నిర్మించడంలో ముందంజ వేస్తున్నారు.
కరోనా సమయంలో స్టాక్ మార్కెట్ పతనం కాకుండా అడ్డుకున్నారు దేశీయ ఇన్వెష్టర్లు. అప్పట్లో పెట్టుబడి పెట్టినవారు మాంచి రిటర్న్స్ వచ్చాయి. తాము చేస్తున్న పొదుపులో కొంత వారికి నచ్చిన సిప్‌లో పెట్టడం మొదలు పెట్టారు. అయితే మార్కెట్ ఒక్కోసారి భారీగా పతనమవుతున్న సందర్భాలు లేకపోలేదు. పెట్టుబడులు పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి. లేకుంటే దాని మీద కొంతైనా అవగాహన ఉండాలి. అప్పుడు సక్సెస్ అవుతామన్నది కొందరు మార్కెట్ విశ్లేషకుల మాట.