RCB Fan in Alipiri Steps: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} సీజన్ వచ్చిందంటే చాలు క్రికెట్ అభిమానులకు పండుగే. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్సిబి} జట్టు అభిమానుల కోలాహలం వేరే రేంజ్ లో ఉంటుంది. ఐపీఎల్ లో ఈ జట్టుకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినప్పటికీ.. అభిమానులు మాత్రం తమ ఆరాధ్య జట్టును ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు.
Also Read: Mohammed Shami: ఫైనల్స్ మ్యాచ్.. షమీ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు !
ఇందుకు కారణం ఆ జట్టులో విరాట్ కోహ్లీ ఉండడమే. ప్రతి సంవత్సరం ఆర్సీబీ అభిమానులు ఈసారి కప్ సాధించబోయేది తామేనని చెప్పడం.. ఆ జట్టు ఆటగాళ్లు అభిమానులను నిరాశ పరుస్తూ ఉండడం జరుగుతూ వస్తుంది. ఇక ఈ జట్టుకి 2013 నుండి 2021 వరకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు. 2016 లో ఈ జట్టును తొలిసారి విరాట్ కోహ్లీ ఫైనల్ కీ తీసుకువెళ్లగా.. ఫైనల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో ఓడిపోయింది.
ఇక 2021 సీజన్ తరువాత విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీ ని వదులుకున్నాడు. అతడి స్థానంలో డూప్లెసిస్ ని కెప్టెన్ గా నియమించారు. అతడి సారథ్యంలో కూడా జట్టు కప్ సాధించకపోవడంతో ఈ సీజన్ కి కెప్టెన్ గా రజత్ పటిదార్ ని ఎంపిక చేశారు. ఈ సీజన్లో ఆర్సిబి ట్రోఫీని గెలుచుకోవాలని వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఆర్సిబి అభిమానులు కూడా వారికి తోచిన విధంగా వారి అభిమాన జట్టు ఈ సీజన్ లో కప్ సాధించాలని పూజలు, పాదయాత్రలు చేస్తున్నారు.
తాజాగా ఓ ఆర్సిబి అభిమాని 2025 ఐపీఎల్ లో ఆర్సిబి ఛాంపియన్ అవ్వాలని {RCB Fan in Alipiri Steps} తిరుమల తిరుపతికి ఓ ఫ్లెక్సీ తో పాదయాత్రగా వెళ్ళాడు. అతడు అలిపిరి మెట్ల పైనుండి ఫ్లెక్సీ తో పాటు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో శరత్ కుమార్ అనే ఈ ఆర్సిబి డై హార్డ్ ఫ్యాన్ చేస్తున్న ఈ పాదయాత్ర పట్ల నెటిజె న్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఈ సీజన్ కి మెగా వేలంలో అనేక మార్పులు చేసిన తరువాత జట్టుకు సరైన కూర్పును కనుగొనడం పెద్ద సవాలుగా మారింది.
జట్టులో విరాట్ కోహ్లీ, లివింగ్ స్టోన్, పటిదార్ సాల్ట్ వంటి ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన ఇవ్వగలిగితే.. ఈసారి ఆర్సిబి జట్టు టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. లేదంటే గత సీజన్ల మాదిరిగానే నిరాశ ఎదురవుతుంది. ఇక ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్ తో టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">