BigTV English

The Raja Saab: 24గంటల్లో ది రాజా సాబ్ షేక్ చేశాడు

The Raja Saab: 24గంటల్లో ది రాజా సాబ్ షేక్ చేశాడు

The Raja Saab : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ రేంజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా గురించి నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ మా బ్యానర్ లో వచ్చే బిగ్గెస్ట్ ప్రాజెక్టు ఇది. మా బ్యానర్ పేరును నిలబెడుతుంది. అని తన నమ్మకాన్ని తెలిపారు. అయితే ఈ సినిమా టీజర్, నిన్న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.


24గంటల్లో వచ్చిన వ్యూస్ 

ప్రభాస్ సినిమా అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టార్ హీరోలు రెండేళ్లకు ఒకసారి సినిమా చేస్తున్న తరుణంలో ప్రభాస్ మాత్రం మిగతా హీరోల కంటే ఎక్కువగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. ఇక రాజా సాబ్ టీజర్ విడుదల కాగానే, ఒక్కసారిగా యూట్యూబ్ షేక్ అయిపోయింది. కేవలం 24 గంటల్లోనే దాదాపు 50 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..


13M – తెలుగు

2.8M – తమిళ్

10M – హిందీ

2.3M – మలయాళం

2.2M – కన్నడ

మొత్తం – 50.1 M వ్యూస్ సాధించి, సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది.

పక్కా కమర్షియల్ సినిమా తర్వాత 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మారుతి కు మంచి సక్సెస్ రేట్ ఉంది. ఈ రోజుల్లో అనే సినిమాతో ఆ రోజుల్లోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఇప్పటివరకు మారుతీ కెరీర్ లో డిజాస్టర్ అయిన సినిమా లేదు. ప్రేక్షకుడికి వినోదాన్నివ్వాలి అనే మైండ్ సెట్ తో సినిమాలు చేసే అతి తక్కువ మంది దర్శకులు మారుతీ ఒకరు. గోపీచంద్ హీరోగా చేసిన పక్కా కమర్షియల్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. దానితో ప్రభాస్ కాంబినేషన్ సినిమా కోసం ముందుకు వచ్చిన ఒక ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్లిపోయాడు. ఇక ప్రభాస్తో సినిమా వద్దు కాంప్రమైజ్ అయిపోదాం అనుకున్న తరుణంలో, ప్రభాసే తనంతట తాను ఈ సినిమా కోసం నిలబడి ముందుకు నడిపించాడు. ప్రభాస్ అంత బలంగా నమ్మాడు అంటే సినిమా ఎలా ఉండబోతుందో ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Also Read : Puri Sethupathi : కొత్త హీరోయిన్ వచ్చేసింది… పూరి-సేతుపతి సినిమాలో మెయిన్ లీడ్ టబు కాదా ?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×