E-Paper
Advertisement

Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. రూ.219కే 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్.. వివరాలు ఇవే!

Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. రూ.219కే 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్.. వివరాలు ఇవే!
Advertisement

Airtel Prepaid Plans: స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో అన్‌లిమిటెడ్ కాల్స్, బేసిక్ ఇంటర్నెట్ సేవలు కోరుకునేవారి కోసం టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. రూ.219 ధరతో వచ్చిన ఈ ప్లాన్.. ఎయిర్ టెల్ యూజర్ల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఇంతకీ ఈ ప్లాన్ ద్వారా ఎయిర్ టెల్ అందిస్తున్న బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వ్యాలిడిటీ, డేటా, కాలింగ్

ఎయిర్ టెల్ ఈ రూ.219 ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ మెుత్తానికి 3GB మాత్రమే ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. దీనిని ఒకేసారి లేదా ప్లాన్ గడువు పూర్తయ్యేవరకూ నెమ్మదిగా వాడుకోవచ్చు. మరోవైపు ఫ్రీ కాల్స్ తో పాటు ప్లాన్ మెుత్తానికి 300 ఎస్ఎంఎస్ లను సైతం ఎయిర్ టెల్ అందిస్తోంది.

అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం

Advertisement

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అత్యంత కీలకమైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను ఎయిర్ టెల్ ఉచితంగా అందిస్తోంది. దాదాపు రూ.4,000 విలువ చేసే 12 నెలల అడోబ్ ప్రీమియం సేవలను యూజర్లు ఫ్రీగా వినియోగించుకోవచ్చు. దీని సాయంతో సోషల్ మీడియా పోస్టులు, ప్రమోషనల్ బ్యానర్లు, పోస్టర్లు అందంగా తయారు చేసుకోవచ్చని ఎయిర్ టెల్ వర్గాలు పేర్కొంటున్నాయి. కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం పోస్టర్లు రూపొందించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ఎయిర్‌టెల్ సేఫ్, హలో ట్యూన్స్

ఈ రూ.219 ప్లాన్ లో కాలింగ్, డేటా, అడోబ్ ప్రీమియంతో పాటు మరికొన్ని అదనపు బెనిఫిట్స్ ను సైతం ఎయిర్ టెల్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ సేఫ్ (Airtel Safe) సేవలను ఇదే ప్లాన్ ద్వారా ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా స్పామ్ కాల్ అలర్ట్స్, ఫ్రాడ్ లింక్స్ బ్లాకింగ్, ఓటీపీ అలాగే బ్యాంకింగ్ మోసాల నుంచి యూజర్లు భద్రంగా ఉండొచ్చు. మరోవైపు ఫ్రీ హలో ట్యూన్స్ వెసులుబాటును సైతం ఈ ప్లాన్ కింద ఎయిర్ టెల్ కల్పిస్తోంది. దీని ద్వారా ప్రతీ నెలా యూజర్లు తమకు నచ్చిన సాంగ్ ను కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: జియో అదిరిపోయే దీపావళి ఆఫర్.. 10 నెలల రీఛార్జ్‌తో 15 నెలల జియోహోమ్ సేవలు ఫ్రీ!

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే

అటు ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ సేవలను సైతం ఎయిర్ టెల్ ఈ ప్లాన్ కింద ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ టీవీ ఛానెల్స్ వీక్షించవచ్చు. ఇందులో చనా జోర్ (Chana Jor), రన్ టీవీ (Runn TV) వంటి ప్లాట్‌ఫారమ్‌లతో పాటు సోనీఎల్‌ఐవీ (SonyLIV) ఉచిత వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ ప్లాన్‌లో ఇచ్చిన 3GB డేటా పూర్తయిన తర్వాత అదనంగా వాడే ప్రతీ 1MB డేటాకు 50 పైసల చొప్పున చార్జ్ చేయనున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది. అలాగే కేటాయించిన 300 ఎస్‌ఎంఎస్‌ల కోటా ముగిశాక.. లోకల్ ఎస్‌ఎంఎస్‌కు రూ. 1, ఎస్టీడీ ఎస్‌ఎంఎస్‌కు రూ. 1.50 చొప్పున వసూలు చేయనున్నారు.

Also Read: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. టవర్లు లేకపోయినా ఫుల్ సిగ్నల్.. ‘ట్రాయ్’ సంచలన సిఫార్సులు!

Tags

Related News

రూ.2,599కే అదిరిపోయే..స్మార్ట్‌వాచ్!బోట్ నుంచి కొత్త గాడ్జెట్

ఇంటర్నెట్ అక్కర్లేదు.. భారత్ సొంతంగా తీసుకొచ్చిన స్వదేశీ పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్ ఇవే!

పండుగ ఆఫర్ల పేరుతో భారీ సైబర్ మోసాలు.. ఆన్‌లైన్ షాపింగ్‌లో సేఫ్‌గా ఉండండిలా!

జియో అదిరిపోయే దీపావళి ఆఫర్.. 10 నెలల రీఛార్జ్‌తో 15 నెలల జియోహోమ్ సేవలు ఫ్రీ!

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. టవర్లు లేకపోయినా ఫుల్ సిగ్నల్.. ‘ట్రాయ్’ సంచలన సిఫార్సులు!

TRAI సూచనలతో జియో సంచలనం.. రూ.147కే అన్‌లిమిటెడ్ కాలింగ్.. రూ.200 లోపు 4 చౌకైన ప్లాన్లు!

వాట్సప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. చాట్ స్క్రీన్ నుంచే రీసెంట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేయండిలా!

Big Stories

Advertisement
×