E-Paper
Advertisement

రూ.100 కోట్లపైగా ఆదాయం.. నాలుగు రెట్లుకు పెరిగిన భారతీయులు, వివరాలు బయటపెట్టిన కేంద్రం

రూ.100 కోట్లపైగా ఆదాయం.. నాలుగు రెట్లుకు పెరిగిన భారతీయులు,  వివరాలు బయటపెట్టిన కేంద్రం
Advertisement

Business: దేశంలో బిలియనీర్ల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది. ఈ విషయంలో  ప్రపంచంలో అగ్రదేశాలలో భారత్ ఒకటిగా ఉంది. ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో రూ. 100 కోట్ల పైగా వార్షిక ఆదాయాన్ని పన్ను రిటర్నులలో చూపినవారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో స్వయంగా వెల్లడించారు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.

రూ.100 కోట్లపైగా ఆదాయం– ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా సభా సమావేశాలు ఎలాంటి ఆందోళనలు లేకుండా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. 2025-26 ఆర్ధిక ఏడాదికి ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని పెందిన వ్యక్తుల సంఖ్య 576 కు చేరిందన్నారు. 2021-22 ఏడాదిలో ఆ సంఖ్య 142 గా ఉందని వెల్లడించారు.

Advertisement

నాలుగు రెట్లు అధికం-గడిచిన నాలుగేళ్లుగా పరిశీలిస్తే ఆ సంఖ్య నాలుగు రెట్లు అధికమన్నమాట. 2021-22లో 142 మంది ఉండగా, 2022-23లో 301కి పెరిగింది. 2023-24లో ఆ సంఖ్య స్వల్పంగా తగ్గి 284కి చేరింది. 2024-25లో ఆ సంఖ్య 415కి పెరగ్గా, 2025-26 నాటికి 576కి చేరిందని వివరాలు బయటపెట్టారు. అదే సమయంలో ఆదాయపు పన్ను చట్టం-2025 కింద గానీ, 1961 ఆదాయపు పన్ను చట్టం కింద గానీ బిలియనీర్ అనే పదానికి చట్టబద్ధమైన నిర్వచనం లేదన్నారు. కేవలం రూ. 100 కోట్లు దాటిన వారి సమాచారాన్ని ట్రాక్ చేస్తామన్నారు. 2016లో వెల్త్ టాక్స్ రద్దు చేయడంతో ఇన్వెస్టర్ల సంపద వివరాలను మేనేజ్ చేయలేదన్నారు.

ఆర్థిక అసమానతలు తగ్గుతున్నాయి-తాజా గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24ను ఉటంకిస్తూ.. ఆర్థిక అసమానతలు 2022-23లో 0.266 నుంచి 0.314గా ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 0.237 పడిపోయిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 0.284కు చేరిందన్నారు. అదే సమయంలో గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గుతున్నాయని ప్రధానంగా ప్రస్తావించారు. మరో వైపు 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 2022లో 3.6శాతం ఉంది.

Advertisement

ALSO READ: క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా? జూలై 31 ఐటిఆర్ ఫైలింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు పాటించాలి

2025 నాటికి 3.1 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ప్రగతి శీల పన్నుల విధానం, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, గృహనిర్మాణం, గ్రామీణాభివృద్ధిపై వ్యయం పెంచడంతో అసమానతలను పరిష్కరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉపాధి కల్పన కోసం పన్ను ప్రోత్సాహకాలు, స్టార్టప్‌లకు మద్దతు, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే సంక్షేమ పథకాలను సూచించిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

Related News

1980 నుంచి 2026 వరకు.. తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా? లెక్కలు చూస్తే షాకే!

మళ్లీ సమ్మె చేయనున్న బ్యాంకు ఉద్యోగులు.. అసలు సమస్య ఇదే

పుత్తడి ప్రియులకు షాక్.. అమాంతంగా పెరిగిన ధర, నేడు మార్కెట్లో ధరలు ఇవే

ఐఫోన్ 18 ప్రో తక్కువ ధరలో కావాలా? ఈ దేశాల్లో కొంటే ఇండియా కంటే చీప్

పిఎఫ్ సెటిల్మెంట్ ఆలస్యం చేస్తే వడ్డీ తప్పదా? EPFO కేసులో మండిపడిన కోర్టు

SBI తప్పిదం.. రోజుకు రూ.5 వేలు చెల్లించాలన్న కోర్టు, ఇలా మీకూ జరిగిందా?

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

Big Stories

Advertisement
×