E-Paper
Advertisement

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !
Advertisement

Virender Sehwag On MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై నిత్యం ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. ధోని అప్పట్లో కెప్టెన్ గా వ్యవహరించిన నేపథ్యంలో చాలా మందికి అవకాశాలు రాలేదని ఇప్పుడు మొత్తుకుంటున్నారు. చాలామందిని తొక్కేస్తూ.. ధోని కెప్టెన్ గా ఎదిగాడని స్పష్టం చేస్తున్నారు. తనకు నచ్చిన వాళ్లను మాత్రమే టీమిండియాలో పెట్టుకునేవాడని.. మిగిలిన క్రికెటర్లను బయటకు పంపించేవాడని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీ పై మరోసారి వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ (Virender Sehwag On MS Dhoni ) కామెంట్స్ చేశారు. 2008లో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన తర్వాత తనను టీమిండియా నుంచి గెంటేసాడని ధోనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, తనను స్లోగా ఫీల్డింగ్ చేస్తామన్న కారణంతో బయటకు పంపించాడని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వీరేంద్ర సెహ్వాగ్. దీంతో ధోనిపై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

2008 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా సెహ్వాగ్ కు ధోని అవమానం?

2007 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోని కొత్తగా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకొని… జట్టును చాంపియన్ గా నిలిపాడు. ఈ క్రమంలో 2008 సందర్భంగా కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్ (CB Series) ఆస్ట్రేలియా వేదికగా జరిగింది. ఈ ట్రై సిరీస్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక తో పాటు టీమిండియా తలపడ్డాయి. వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీకి ఫుల్ పవర్స్ ఇచ్చింది బీసీసీఐ. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై జట్టుకు ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్లను మాత్రమే టీమిండియా తరఫున ఆడించాడు ధోని. ఒక్క మ్యాచ్ విఫలమైన కూడా బయటకు పంపించాడు. ఈ క్రమంలోనే ఐదు మ్యాచ్ లు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్, కేవలం 81 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ ట్రై సిరీస్ చివరలో వీరేంద్ర సెహ్వాగ్ ను పక్కకు పెట్టేసాడు ధోని.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

సరిగ్గా పరిగెత్తలేమని సచిన్, గంభీర్ తో పాటు నన్ను పక్కకు పెట్టాడు

ఈ తరుణంలో తీవ్ర ఆగ్రహానికి లోనైనా వీరేంద్ర సెహ్వాగ్, రిటైర్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. తుది జట్టులో లేకపోతే, ఆడడం దండగ అంటూ… సచిన్ దగ్గరికి వెళ్లి రిటైర్మెంట్ ఇస్తానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఆ సమయంలో సచిన్ టెండూల్కర్… వీరేంద్ర సెహ్వాగ్ కు నచ్చ చెప్పాడు. ఇండియాకు వెళ్లిన తర్వాత దానిపైన ఆలోచిద్దాం.. ఇప్పుడు రిలాక్స్ అవ్వు అని సలహాలు ఇచ్చారు. ఇక సచిన్ మాట విన్న వీరేంద్ర సెహ్వాగ్… రిటైర్మెంట్ అంశాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు వీరేంద్ర సెహ్వాగ్. అంతేకాదు 2012లో కూడా సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, తనను టీమ్ ఇండియా నుంచి ధోని బయటకు పంపించడానికి ఫైర్ అయ్యారు. తాము ఫీల్డింగ్ స్లోగా చేస్తామని పక్కకు పెట్టినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తమతో సైలెంట్ గా చెబితే.. సైడ్ అయ్యే వాళ్ళం కానీ, మీడియా ముందు తమ పరువు తీసాడని ధోనిపై నిప్పులు చెరిగారు.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

Related News

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

ధోని కెప్టెన్సీలో ఆడటమే కొంప ముంచింది..ఆ దుర్మార్గుడు నన్ను తొక్కేసాడు!

భారతి ఫుల్మాలికి ఘోర అవమానం…అమ్మాయి కాదు మగాడు అంటూ!

పాకిస్తాన్ ఫైనల్స్ కు వస్తే, టీమిండియా ఓడిపోతుందని… శ్రీలంక గెలిచేలా ఫిక్సింగ్ చేశారు!

Big Stories

Advertisement
×