boAt Airdopes 212: ప్రస్తుత కాలంలో ప్రయాణాల్లో ఉన్నప్పుడు, జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు లేదా ఆఫీస్‌లో పనిచేస్తున్నప్పుడు వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఉపయోగించడం ప్రతి ఒక్కరికీ అలవాటుగా మారిపోయింది. వైర్లు లేకుండా మెడలో లేదా జేబులో ఇమిడి పోయే ఈ చిన్న గ్యాడ్జెట్లు ట్రెండ్‌లో భాగంగా నిలిచాయి. అయితే .. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం డిజైన్ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ అందించే ఇయర్ బడ్స్ దొరకడం కొన్ని సార్లు కష్టమవుతుంది. అలాంటి వారి కోసమే ఆడియో గాడ్జెట్ల మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ‘బోట్’సంస్థ సరికొత్తగా ‘బోట్ ఎయిర్ డోప్స్ 212’ ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర కేవలం రూ. 1099 మాత్రమే ఉండటం విశేషం.
ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ హైలైట్ వీటి డిజైన్. దీని ఛార్జింగ్ కేస్ పైన పారదర్శకంగా ఉండే ‘ట్రాన్స్‌లూసెంట్ లిడ్ ‘ను అందించారు. దీని వల్ల లోపల ఉండే ఇయర్ బడ్స్ బయటికి కనిపిస్తూ చాలా మోడరన్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి. ముఖ్యంగా ‘పీచ్ బ్లష్’ కలర్ ఆప్షన్‌లో ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇయర్ బడ్స్ డిజైన్ కూడా చెవుల్లో సౌకర్యంగా ఇమిడిపోయేలా ఇన్-ఇయర్ స్టైల్‌లో రూపుదిద్దుకుంది. ఎక్కువ సేపు చెవుల్లో పెట్టుకున్నా ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగదు.
ఈ బడ్జెట్‌లో లభించే అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ లైఫ్. ఈ చిన్న ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 50 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. అంటే.. ఒక్క సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే రోజల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు, తరచూ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రయాణాలు చేసేవారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. అలాగే.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది.
మ్యూజిక్ వినడానికే కాకుండా ఫోన్ కాల్స్ మాట్లాడటానికి కూడా ఈ ఇయర్ బడ్స్ అద్భుతంగా పని చేస్తాయి. ఇందులో బోట్ వారి ప్రత్యేకమైన ‘ENx టెక్నాలజీ’ని అందించారు. దీని వల్ల మనం మాట్లాడుతున్నప్పుడు చుట్టూ ఉండే అనవసరమైన శబ్దం తగ్గిపోయి, అవతలి వారికి మన గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. క్లియర్ కాల్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
Also Read: రూ.1000లోపు బ్లూటూత్ సౌండ్‌బార్..మ్యూజిక్ వింటే స్టెప్పులేయాల్సిందే!
టెక్నాలజీ పరంగా ఇది అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో డెడికేటెడ్ యాప్ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల ఇయర్ బడ్స్ ఈక్వలైజర్ సెట్టింగ్స్‌ను మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు, టచ్ కంట్రోల్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్ ఫోన్‌తో క్షణాల్లో పెయిర్ అయిపోతుంది. సిగ్నల్ కట్ అవ్వకుండా.. స్టేబుల్ కనెక్షన్‌ను అందిస్తుంది.
అతి తక్కువ బడ్జెట్‌లో, స్టైలిష్ ట్రాన్స్‌లూసెంట్ లుక్, 50 గంటల భారీ బ్యాటరీ లైఫ్ , క్లియర్ కాల్ క్వాలిటీ కోరుకునే వారికి ‘boAt Airdopes 212’ ఒక అద్భుతమన వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. మీరు కూడా తక్కువ ధరలో మంచి ఇయర్ బడ్స్ కొనాలని చూస్తుంటే.. దీనిని నిరభ్యంతరంగా కొనొచ్చు!