Pakistan: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా పై ( Danish Kaneria ) సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ నుంచి ఇండియాకు డానిష్ కనేరియా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడు త్వరలోనే ఇండియా పౌరసత్వం తీసుకోబోతున్నాడని అంటున్నారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా డానిష్ కనేరియా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలోనే ఇండియాకు వెళ్లిపోతున్నాడని అతనిపై పాకిస్తాన్ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కీలక స్పిన్నర్ గా ఉన్న డానిష్ కనేరియా…. సమయం వచ్చినప్పుడు అలా హిందుత్వానికి సపోర్ట్ గా మాట్లాడతారన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి డానిష్ కనేరియా ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ కు సపోర్ట్ గా నిలుస్తూ కామెంట్స్ చేశారు. దీంతో డానిష్ కనేరియా పై పర్సనల్ గా అటాక్ చేస్తోంది పాకిస్తాన్ సోషల్ మీడియా. ఇండియాకు డానిష్ కనేరియా వెళ్ళిపోతున్నాడని… భారత పౌరసత్వాన్ని తీసుకునేందుకు కుట్రలు పన్నుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. అందుకే ఆర్ఎస్ఎస్ ను సపోర్ట్ చేస్తూ కామెంట్ చేశాడని, అంటున్నారు. అయితే దీనిపై తాజాగా డానిష్ కనేరియా స్పందించారు. తాను ఇండియాకు వెళ్లిపోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ కామెంట్స్ చేశాడు.
తాను ఇప్పటివరకు భారత పౌరసత్వం ఆశించి… ఎలాంటి పనులు చేయలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు డానిష్ కనేరియా. అసలు ఇండియాకు వచ్చే ఉద్దేశం కూడా లేదన్నాడు. పాకిస్తాన్ నుంచి అలాగే ఆ దేశ ప్రజల నుంచి నేను చాలా ప్రేమను పొందాను… వాళ్ళు అంటే తనకు ఎంతో గౌరవం అని తెలిపాడు. అదే సమయంలో పాకిస్తాన్ అధికారులు అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా తనపై వివక్ష చూపించిందని మండిపడ్డాడు. నన్ను మతం మారాలని బాగా టార్చర్ పెట్టారని… ఇందులో షాహిద్ ఆఫ్రిది కూడా ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు డానిష్. పాకిస్తాన్ తనకు జన్మభూమి కావచ్చు కానీ ఇండియా మాత్రం మాతృభూమి అని తెలిపాడు. తన పూర్వీకులది భారతదేశమని.. నా దృష్టిలో భారత్ ఒక దేవాలయం అంటూ వ్యాఖ్యానించారు.
Also Read: Shoaib Malik Divorce: మూడో భార్యకు కూడా షోయబ్ మాలిక్ విడాకులు..? సానియా మీర్జా పాపం తగిలిందా !
ఇటీవల కాలంలోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సేవలను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కనేరియా ప్రసంశించాడు. ఇలాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉండాలని కోరాడు. అప్పుడే హిందూ ధర్మం కాపాడబడుతుందని తెలిపాడు. దీంతో అతనిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు పాకిస్తాన్ దేశంలోని ఇస్లాం మతస్తులు. కాగా పాకిస్తాన్ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన కనేరియా.. 2000 నుంచి ఈ 2010 వరకు జట్టులో కొనసాగాడు. అనంతరం రిటైర్మెంట్ ఇచ్చాడు.