BigTV English

Rajnath Singh: మీకు చేతకాకపోతే చెప్పండి.. మేము రంగంలోకి దిగుతాం: పాక్‌కు భారత్ కౌంటర్

Rajnath Singh: మీకు చేతకాకపోతే చెప్పండి.. మేము రంగంలోకి దిగుతాం: పాక్‌కు భారత్ కౌంటర్

Rajnath Singh (National news Today India): ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్ పై భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్థాన్ వల్ల కాకపోతే ఈ దేశానికి సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.


ఉగ్రవాద నియంత్రణ విషయంలో పాక్ పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాని అరికట్టడంలో పాక్ అసమర్థతను భారత్ మరోసారి ఎద్దేవా చేసింది. ఉగ్రవాదులు నియంత్రించడం పాక్ చేతకాకపోతే.. వారిని అంతం చేయడానికి భారత్ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.

గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ.. భారత్ పైకి పంపిస్తూ రకరకాల అల్లర్లకు, దాడులకు పాక్ ప్రయత్నిస్తుంది. అయితే ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది.


Also Read: చల్లని కబురు చెప్పిన IMD.. ఈసారి ముందుగానే రుతుపవనాలు.. ఫుల్లుగా వర్షాలు!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింన నాటి పరిస్థితులను గుర్తు చేసుకుని ఈపార్టీపై విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ సమయంలో తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా తనకి అనుమతి ఇవ్వలేదని.. అలాంటి కాంగ్రెస్ తమని నియంతలుగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేస్తుందని దుయ్యబట్టారు.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×