E-Paper
Advertisement

Ola EV Scooter: ఓలా ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 69 వేలకే ఎస్1 స్కూటీ

Ola EV Scooter: ఓలా ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 69 వేలకే ఎస్1 స్కూటీ
Advertisement

 

Ola EV Scooter: స్కూటీ లవర్స్‌కు ఓలా కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కంపెనీ నుండి ఎంట్రీ లెవల్ ఇచ్చే స్కూటీపైనే భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎస్1 ఎక్స్ సిరీస్ కు చెందిన ఈవీలను రూ. 69,999లకే మార్కెట్లోకి అమ్మకానికి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓలా ఎస్1 ఎక్స్ కొత్త ధరలను ఓలా వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేవారికి అతి తక్కువ ధరకే ఈ స్కూటర్లు అందుబాటులో ఉండనున్నాయి.

Advertisement

ఎస్1ఎక్స్ ఈవీఎం ఫీచర్ల విషయానికొస్తే ఫిజికల్ కీతో తయారుచేయబడింది. ఇది వచ్చే వారం నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఇది 3 బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 8 ఏళ్ల పాటు 80 కిలోమీటర్లు మేర బ్యాటరీ వారంటీతో వస్తుంది. ఇందులో మూడు రకాల ఫీచర్లు ఉన్నాయి. 2 కేడబ్ల్యూహెచ్ స్కూటర్ ఐడీసీ రేంజ్ 95 కిలోమీటర్లు, 3 కేడబ్ల్యూహెచ్ స్కూటర్ 143 కిలోమీటర్లు, 4 కేడబ్ల్యూహెచ్ స్కూటర్ 190 కిలోమీటర్ల రేంజ్ తో ఈవీలు ఉండనున్నాయని కంపెనీ వెల్లడించింది.

కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్లు వేగాన్ని అందుకుంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో 2 కిలో వాట్ బ్యాటరీ వేరియంట్ స్పీడ్ 85 కిలోమీటర్లు ఉంది. ఈ స్కూటర్లలో 6 కేడబ్ల్యూ మోటార్ ఉంటుందని తెలిపింది. అయితే ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ఓలా ఎలక్ట్రిక్ యాప్, రివర్స్ మోడ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఓలా ఈవీఎంలు ప్రస్తుతం 7 కలర్స్ లలో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఈవీఎం ధరలు..

2 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌ ధర రూ. 69,999
3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్‌ ధర రూ. 84,999
4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్‌ ధర రూ. 99,999

Tags

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

Advertisement
×