BigTV English

Prabhas: అదేంటండీ.. మొన్నటివరకు శివుడు అన్నారు.. ఇప్పుడు కాదంటారేంటీ..?

Prabhas: అదేంటండీ.. మొన్నటివరకు శివుడు అన్నారు.. ఇప్పుడు కాదంటారేంటీ..?

Prabhas: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ముకేశ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో స్టార్ క్యాస్ట్ ను చూసి ఇండస్ట్రీ మొత్తం ముక్కున వేలేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్.. ఇలా ఎన్ని వుడ్స్ అయితే ఉన్నాయో అందరిని ఈ సినిమా కోసం దించేశాడు విష్ణు. ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా హైప్ రాలేదు కానీ, ప్రభాస్ నటిస్తున్నాడు అనగానే.. మొత్తం ఇండస్ట్రీ ఒక్కసారిగా కన్నప్పపై ఫోకస్ పెట్టింది.


విష్ణు అడగగానే ఒక గెస్ట్ పాత్రలో ప్రభాస్ నటించడానికి ఒప్పుకున్నాడు. అయితే మొదటి నుంచి ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నాడని, పార్వతిగా అనుష్క నటిస్తుందని వార్తలు వచ్చాయి. ప్రభాస్ శివుడు క్యారెక్టర్ చేస్తున్నాడు అని తెలియడంతోనే అభిమానులు ఎడిట్స్ మొదలుపెట్టేశారు. శివుడి గెటప్ లో ప్రభాస్ ఫొటోస్ ను ఎంతో న్యాచురల్ గా ఎడిట్ చేసి వైరల్ చేసేశారు. కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అయ్యింది. కన్నప్పలో ప్రభాస్ శివుడిగా చేయడం లేదట.. ఆ పాత్రను అక్షయ్ కుమార్ అందుకున్నాడని టాక్ నడుస్తోంది.

మరి ప్రభాస్ శివుడు కాకపోతే ఇంకా ఎవరు.. ? అంటే.. నందీశ్వరుడు అని సమాచారం. ముందుగా శివుడి పాత్ర ప్రభాస్ వద్దకే వచ్చిందంట.కానీ, ఆ పాత్రకు తాను సెట్ కాను అని డార్లింగ్ చెప్పగానే డైరెక్టర్ నందీశ్వరుడు పాత్ర గురించి చెప్తే వెంటనే ఓకే చెప్పాడట. దీనికోసం ఒక వారం రోజులు డేట్స్ కూడా ఇచ్చాడట. దీంతో అభిమానులు.. అదేంటండీ.. మొన్నటివరకు శివుడు అన్నారు.. ఇప్పుడు కాదంటారేంటీ..? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది కూడా నిజమో కాదో తెలియాలంటే విష్ణు నోరు విప్పక తప్పదేమో..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×