Ola Electric Scooter: ట్రెండ్‌ను తమకు అనుకూలంగా మారిపోతున్నాయి కొన్ని కంపెనీలు. ఒకప్పుడు సమయం, సందర్భాన్ని బట్టి ప్రత్యేక సెల్స్‌ని ప్రకటించేవి మొబైల్స్, టీవీ కంపెనీలు. ఈ ట్రెండ్ ఇప్పుడు వాహనాలకు సైతం సోకింది. కారణాలు ఏమైనా కావచ్చు. లేటెస్ట్‌గా హోలి సందర్భంగా ఫ్లాష్ సేల్ ఆఫర్‌ని ప్రకటించింది ఓలా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ.
మార్కెట్‌పై కన్నేసిన ఓలా
ఏ సెక్టార్ అయినా అతి పెద్ద మార్కెట్ ఇండియా. ఎందుకంటే 140 కోట్ల జనాభాను ఆకట్టుకోవడమంటే మాటలు కాదు. దిగువ, మధ్య, ఎగువ స్థాయి వర్గాల వారిని ఆకట్టుకునేందుకు కొన్ని కంపెనీలు వినూత్నమైన ఆఫర్లు ప్రకటిస్తాయి. ఆ విధంగా మార్కెట్ పరిధిని ఆయా కంపెనీలు పంచుకుంటూ పోతున్నాయి.
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ట్రెండ్ కొనసాగుతోంది. ఏ ఇంటి వద్ద చూసినా ఎలక్ట్రిక్ వాహనం కనిపిస్తున్న రోజులివి. ప్రభుత్వాలు కూడా వాటికి కొన్ని పన్నులను మినహాయింపు ఇస్తున్నాయి. దీనివల్ల పొల్యూషన్ తగ్గడమే ప్రధాన కారణం. ప్రభుత్వాలు తీసుకున్న పాలసీలకు అనుగుణంగా ఆయా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.
‘హోలీ’ ఆఫర్
హోలీ సందర్భంగా విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక సేల్‌ని ప్రకటించింది. ఓలా ఎస్1 విభాగంలోని ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ ఎత్తున డిస్కౌంట్ ప్రకటించింది. ఇదీ కూడా కేవలం ఐదు రోజులు మాత్రమే. మార్చి 13 నుంచి ప్రారంభమైన ఫ్లాష్ సేల్ మార్చి 17వరకు అందుబాటులో ఉండనుంది. వాహనదారులు ఈ ఆఫర్ ని వినియోగించుకోవాలని పేర్కొంది.
ALSO READ: రూ. 20 వేలకే డికైన్ ఏసీ, బెస్ట్ బ్రాండ్.. బెస్ట్ డీల్
ఓలా ఎస్1 ఎయిర్ కొనుగోలుపై దాదాపు రూ.26,750 వేల డిస్కౌంట్ అందిస్తుంది ఆ కంపెనీ. ప్రస్తుతం ఓలా ఈవీ ధర రూ.89,999గా ఉంది. దాదాపు ఒక వంతు ఆఫర్‌గా అందిస్తున్న మాట. అయితే ఓలా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈవీ వేరియంట్‌ని ధరల్లో మార్పులు ఉండనున్నాయి. ఓలా ఎక్స్ ప్లస్ జెన్2 పై రూ.22 వేల వరకు రాయితీ ఇవ్వనుంది.
ఐదురోజులు మాత్రమే
ఆఫర్ల వెనుక మరో మెలిక పెట్టింది. ఇటీవల మార్కెట్లోకి కొత్తగా తీసుకొచ్చిన ఎస్1 జెన్3 వాహనాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. డిస్కౌంట్‌తో పాటు రూ.10,500 విలువైన ప్రయోజనాలను ఆ కంపెనీ అందిస్తోంది. కొత్తగా పైన చెప్పిన మోడల్ స్కూటర్ కొనుగోలు చేసేవారికి ఏడాదిపాటు రూ.2,999 విలువైన మూవ్ ఓఎస్+ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా ఇవ్వనుంది. అంతేకాదు రూ.14,999 విలువైన ఎక్స్‌టెండెడ్ వారెంటీని కేవలం రూ.7,499కే ఇస్తోంది.
ఫ్లాగ్ షిప్ మోడల్ ఎస్ 1 ప్రొ ఫ్లస్ 5.3kWh ధర రూ. 1,85,000గా ధర ఉంది. 4kWh వేరియంట్ ధర రూ. 1,59,999. ఎస్ 1 ప్రొ 4kWh వేరియంట్ ధర రూ. 1,54,999, 3kWh వేరియంట్ ధర రూ. 1,29,999గా ఉంది. ఎస్ 1 X 2kWh, 3kWh, 4kWh వేరియంట్ల ధరలు వరుసగా రూ. 89,999, రూ. 1,02,999, రూ. 1,19,999 గా ఉన్నాయి. ఎస్ 1 X+ 4kWh వేరియంట్ ధర రూ. 1,24,999గా ఉంది.