Alia Bhatt:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న అలియా భట్ (Alia Bhatt) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే తన ప్రియుడు రణబీర్ కపూర్ ను (Ranbir Kapoor) ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహానికి ముందే గర్భం దాల్చిన అలియా భట్, పెళ్లయిన 8 నెలలకే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు రాహా అని నామకరణం కూడా చేసిన విషయం తెలిసిందే. ఇక రాహాతో సమయాన్ని గడుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అందరికీ తన కూతుర్ని పరిచయం చేసింది ఆలియా భట్.
Vijay Sethupathi:ఆన్‌లైన్ ఛాటింగ్.. ఫైటింగ్ చేసి పెళ్లి.. సేతుపతి ఫుల్ లవ్ స్టోరీ వినండి
అందుకే సోషల్ మీడియా నుండి రాహా ఫోటోలు తొలగించాను..
అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా సోషల్ మీడియా నుండి పాప ఫోటోలను డిలీట్ చేసింది. ముఖ్యంగా రాహా గోప్యతకు భంగం కలగకుండా ఉండేలా పాపకు సంబంధించిన ఫోటోలన్నింటినీ ఇంస్టాగ్రామ్ ద్వారా తొలగించడంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ విషయంపై తాజాగా అలియా భట్ స్పందిస్తూ.. అసలు విషయాన్ని తెలిపింది. అలియా భట్ మాట్లాడుతూ..” మా ఇంట్లోకి దుండగులు చొరబడి, రాహాను నాకు దూరంగా తీసుకెళ్లిపోయినట్లు ఒక పీడకల వచ్చింది. అంతకంటే దారుణమైన కల మరొకటి ఉండదు. అందుకే పాప సంరక్షణ కోసమే నేను తగిన జాగ్రత్తలు పాటించాలని నిర్ణయించుకున్నాను. ఇక పాప గోప్యతకు భంగం కలగకుండా ఉండేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాము. కాబట్టి మా అభ్యర్థనను మీరందరూ అర్థం చేసుకోండి. దయచేసి మా అనుమతి లేకుండా పాప ఫోటోలు తీయకండి. ఒకవేళ ఎప్పుడైనా మాతోపాటు పాప ఫోటోలను కూడా తీస్తే మీరు పాప మొహం కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సమయం వచ్చాక ఆమెను తప్పకుండా మేమే మీ అందరి ముందుకు తీసుకొస్తాము ” అంటూ అలియా తెలిపింది. మొత్తానికైతే పాప భద్రతా కోసం అలియా భట్ తీసుకున్న నిర్ణయానికి అటు నెటిజన్స్ కూడా మద్దతు పలుకుతున్నారు.
పాప రాకతో జీవితం పరిపూర్ణమైంది..
ఇక అలాగే తన కూతురు తన జీవితంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది అలియా భట్.” పాప రాకతో మా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోంది. రాహా పుట్టాక నేను కూడా ఎంతో మారాను. ప్రస్తుతం నాకు రోజులు చాలా బిజీగా గడుస్తున్నాయి.ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అటు వర్క్, ఇటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పనులతో బిజీగా గడిపేస్తున్నాను. రాహాతో ఉన్నప్పుడు నేను కూడా చిన్నపిల్లని అయిపోతాను. అన్ని విషయాల్లో కూడా తనకు స్వేచ్ఛనిస్తున్నాము” అంటూ వెల్లడించింది. మొత్తానికైతే రాహా కోసం అలియా తీసుకున్న నిర్ణయం, అలాగే తన అభిప్రాయాలపై చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.