Oppo Reno13 Pro: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రతీ రోజు కొత్త కొత్త సరికొత్త ఆవిష్కరణలు, కొత్త మోడల్స్ మన ముందుకు వస్తూనే ఉన్నాయి. ఈ పోటీలో ప్రతి కంపెనీ తన సొంత ప్రత్యేకతను చూపించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కొత్త ఫోన్ ఒప్పో రెనో 13 ప్రో 5జి. దీని ముఖ్య ఆకర్షణలు వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే తొలిసారి 108 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరాను ఇందులో అందించారు.
సాధారణంగా ఇప్పటి వరకు 32ఎంపి , 50ఎంపి వరకు మాత్రమే ఫ్రంట్ కెమెరాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓప్పో ఈ స్థాయికి తీసుకెళ్లడం వ్లాగర్లు, సోషల్ మీడియా క్రియేటర్లకు ఒక పెద్ద బహుమతి లాంటిదే. తక్కువ లైట్‌లోనూ, ఎక్కువ లైట్‌లోనూ ఈ సెల్ఫీ కెమెరా అత్యద్భుతంగా పని చేస్తుంది. ఒక సాధారణ ఫోటో కూడా ప్రొఫెషనల్ లాగా రావడం వినియోగదారులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.
కెమెరా 200ఎంపి
ఇక రియర్ కెమెరా విషయానికి వస్తే, దీని ప్రధాన కెమెరా 200ఎంపి రిజల్యూషన్ కలిగినది. అదనంగా 50ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 12ఎంపి టెలిఫోటో లెన్స్‌ను జోడించారు. ఈ మూడు కెమెరాల కలయికతో తీసే ఫోటోలు, వీడియోలు సినిమా స్థాయి క్వాలిటీని అందిస్తాయి. నైట్ మోడ్‌లో, పోర్ట్రెట్ షాట్స్‌లో లేదా జూమ్‌లోనూ క్వాలిటీ తగ్గకుండా ఉండటం దీని ప్రత్యేకత.
డిస్‌ప్లే ప్రీమియం లుక్
డిస్‌ప్లే విషయానికి వస్తే, రెనో సిరీస్ ఎప్పటిలాగే ప్రీమియం లుక్‌తో వచ్చింది. 6.7 అంగుళాల కర్వ్‌డ్ అమోలేడ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్‌రేట్‌తో వస్తోంది. ఈ రిఫ్రెష్‌రేట్ వల్ల స్క్రోల్ చేస్తూ, వీడియోలు చూస్తూ, గేమ్స్ ఆడుతూ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉండటం వల్ల ఇది చేతిలో పట్టుకున్న వెంటనే ప్రత్యేకంగా కనిపిస్తుంది.
Also Read: Jio Entertainment: జియో యూజర్ల కోసం ప్రత్యేక ఎంటర్టైన్‌మెంట్.. అదృష్టం పరీక్షించండి!
7000ఎంఏహెచ్ బ్యాటరీ
ఫోన్‌లోని మరో ఆకర్షణ 7000ఎంఏహెచ్ బ్యాటరీ. ఈ స్థాయి బ్యాటరీ సామర్థ్యం ఇప్పటి హై-ఎండ్ ఫోన్లలో చాలా అరుదు. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజులు సులభంగా వాడుకోవచ్చు. అంతేకాదు, 120డబ్ల్యూ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే కొద్దిసేపులోనే ఫోన్ పూర్తిగా చార్జ్ అయిపోతుంది. ఎక్కువగా బయట తిరిగే వాళ్లకు ఇది గేమ్‌చేంజర్‌గా మారుతుంది.
16జిబి ర్యామ్
పర్ ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని వల్ల హై ఎండ్ గేమ్స్, హెవీ మల్టీ టాస్కింగ్ సులభంగా చేయవచ్చు. ర్యామ్ 16జిబి వరకు, స్టోరేజ్ ఐటిబి వరకు అందిస్తున్నారు. అంటే ఫోన్ స్పీడ్ విషయంలోనూ, స్పేస్ విషయంలోనూ ఎలాంటి సమస్య ఉండదు.
వినియోగదారులకు కొత్త అనుభూతి
సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కొత్త కలర్ఓఎస్‌ను అందించారు. ఇందులో ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లు మరింత బలంగా ఉండటం వినియోగదారులకు అదనపు ప్లస్. కొత్త ఇంటర్‌ఫేస్, కస్టమైజేషన్ ఆప్షన్లు వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. అదనపు ఫీచర్లలో వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ సర్టిఫికేషన్, డాల్బీ ఆడియో సపోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి రెనో 13 ప్రో 5జిని ఫ్లాగ్ షిప్ స్థాయిలో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
ధర విషయానికి వస్తే, భారత మార్కెట్‌లో సుమారు 55 వేల నుండి 60 వేల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారిక ధర త్వరలో ప్రకటించబడుతుంది. మొత్తంగా చూసుకుంటే, ఎక్కువ సెల్ఫీలు తీసుకునే వాళ్లకు, సోషల్ మీడియా క్రియేటర్లకు, హై పర్ఫార్మెన్స్ కోరుకునే వినియోగదారులకు, బ్యాటరీ బ్యాకప్ ముఖ్యమని భావించే వారికి ఒప్పో రెనో 13 ప్రో 5జి ఒక అద్భుతమైన ఎంపిక అవుతుంది.