PAN 2.0: అభివృద్ది చెందిన దేశాల మాదిరిగా ప్రతీ వ్యవస్థను డిజిటల్‌గా మార్చేందుకు దృష్టి సారించింది కేంద్రం. తొలుత ఆధార్.. ఆ తర్వాత రేషన్ కార్డు వంతైంది. తాజాగా ఇప్పుడు పాన్ కార్డు కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పన్ను చెల్లింపుదారులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. అలాగని నిజాలు దాయలేరు కూడా. అయితే కొత్త పాన్ 2.0 అంటే ఏమిటి? దాని ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం.
ఆదాయం పన్ను చెల్లించేవారికి తీపి కబురు చెప్పింది కేంద్రం. పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా, డిజిటల్‌గా మార్చే లక్ష్యంతో పాన్ 2.0 వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ఇప్పటికే ఉంది. పాన్ కార్డ్ 2.0 వ్యవస్థను సాంకేతికంగా అభివృద్ధి చేయనుంది.
పాన్ అనేది శాశ్వత ఖాతా సంఖ్య. టాన్ అనేది పన్ను తగ్గింపు, సేకరణ ఖాతా సంఖ్య. ఈ సేవలను సులభతరం చేసేందుకు పాన్ 2.0 ను తీసుకొచ్చింది. వీటి సేవలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది.
పాన్ సంబంధించిన పనుల కోసం పన్ను చెల్లింపుదారులు ఈ-ఫైలింగ్ పోర్టల్-యూటీఐఐటీఎస్ఎల్ పోర్టల్-ప్రోటీన్ ఈ-గవ్ పోర్టల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ గందరగోళానికి తెరదించింది. కొత్త పాన్ కార్డు జారీ, కార్డులో వివరాల మార్పులు, ఆధార్-పాన్ అనుసంధానం, పాన్‌కార్డు రీ-ప్రింట్, ఆన్‌లైన్ వెరిఫికేషన్ వంటి సేవలు కొత్త పోర్టల్ ద్వారానే లభించనున్నాయి.
ALSO READ: డిమార్ట్‌లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏయే రోజుల్లో చీప్‌గా ధరలు ఉంటాయి?
దేశంలో 81.24 కోట్లకు పైగాన పాన్‌కార్డులు ఉన్నాయి. 73 లక్షలకు పైగా టాన్ నంబర్లు ఉపయోగిస్తున్నారు. పాత పాన్ కార్డుదారులు ఎవరూ కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నది అధికారుల మాట.
PAN 2.0 లక్షణాలు
డైనమిక్ QR కోడ్- కొత్త పాన్ కార్డులో QR కోడ్ ఉంటుంది. ఖాతాదారుడికి సంబంధించి సమాచారం అందులో ఉంటుంది.
ఏకీకృత పోర్టల్- ఆధార్ లింకింగ్, ధృవీకరణ, తిరిగి జారీ చేయడం వంటి అన్ని పాన్/టాన్ సంబంధిత సేవలు ఒకే డిజిటల్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.
కాగిత రహిత ప్రక్రియ- మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది. పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. డాక్యుమెంటేషన్ ఇబ్బందులను తగ్గిస్తుంది.
సురక్షితమైన సేవలు- మెరుగైన సైబర్ భద్రత కలిగి ఉంటుంది. సేవా డెలివరీ వేగంగా మరింత సురక్షితంగా ఉంటుంది.
ప్రపంచవ్యాప్త పరిధి-NRI, OCI కార్డుదారులు ప్రపంచంలో ఏ మూల నుండైనా e-PAN కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పాన్ 2.0 కోసం దరఖాస్తు ప్రక్రియ
NSDL లేదా UTIITSL వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
పాన్, ఆధార్, పుట్టిన తేదీ వివరాలు పూర్తి చేయాలి.
OTP ద్వారా ధృవీకరించాలి.
30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రక్రియ ఉచితం. ఆ తర్వాత రూ. 8.26 రుసుము వసూలు చేస్తుంది. e-PAN కార్డ్ 30 నిమిషాల్లోపు రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు పంపుతుంది. QR కోడ్‌తో పాత PAN కార్డుని 2.0కి అప్‌గ్రేడ్ చేయడానికి NSDL/UTIITSLని సందర్శించండి. 15–20 రోజుల్లో రిజిస్టర్డ్ చిరునామాకు కార్డు పంపుతుంది.
PAN 2.0 అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, ఓటరు ఐడీ ఉండాలి.
బ్యాంక్ స్టేట్‌మెంట్, విద్యుత్ బిల్లు, అద్దె ఒప్పందం పత్రాలు ఉండాలి.
జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ ఉండాలి.