BigTV English

Mollywood : ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

Mollywood : ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

Mollywood : ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీలో వరుసగా ఏదోక కారణాలతో చాలా మంది నటులు చనిపోతున్నారు. కేవలం రెండు నెలల్లోనే పదుల సంఖ్యలో మరణించారు. మొన్న తెలుగు ఇండస్ట్రీలో ఒకే నెలలో ఏకంగా ముగ్గురు చనిపోయారు. అటు మిగిలిన ఇండస్ట్రీలలో కూడా వరుసగా చనిపోతున్నారు. తాజాగా మాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాలీవుడ్ లో పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు లెజండరీ ఫిలిం ఐకాన్ ప్రేమ్ నజీర్ కుమారుడు షానావాస్ మృతి చెందారు. ఈయన గత కొద్ది రోజులుగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ చికిత్సను తీసుకుంటున్నారు. ఆ వ్యాధి తీవ్రం కావడంతో ఇవాళ ఆయన తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు. నేడు సాయంత్రం ఆయన అంతేక్రియలు జరగనున్నాయి. కార్యక్రమానికి మలయాళ ఇండస్ట్రీలోని పలువురు సీనియర్ హీరోలు, నటీనటులు హాజరు కానున్నారని సమాచారం..


షానవాస్ ప్రేమ్ నజీర్ కన్నుమూత.. 

షానవాస్ ప్రేమ్ నజీర్ మలయాళ చిత్రాలలో నటించిన ఒక భారతీయ నటుడు . ఆయన ప్రముఖ మలయాళ నటుడు ప్రేమ్ నజీర్ కుమారుడు . ఆయన 50 కి పైగా మలయాళ చిత్రాలలో నటించారు. మలేషియాలో స్థిరపడ్డాడు. షానవాస్ భార్య ఆయిషా బీవి ప్రేమ్ నజీర్ పెద్ద సోదరి దివంగత సులేఖ బీవి కుమార్తె . ఈ దంపతులకు షమీర్ ఖాన్ మరియు అజిత్ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. షమీర్ మలయాళ చిత్రం ఉప్పుకండం బ్రదర్స్ బ్యాక్ ఇన్ యాక్షన్‌లో తన అదృష్టాన్ని ప్రయత్నించాడు కానీ అది విజయవంతం కాలేదు మరియు ఇప్పుడు మలేషియాలో మేనేజర్, అలాగే వ్లాగర్‌గా పనిచేస్తున్నాడు. అజిత్ ఖాన్ ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు. ఈయన బాల్యం, పైచదువులు మొత్తం తిరువనంతపురంలోనే.. తండ్రి హీరో అవ్వడంతో.. బుల్లి తెర పై, వెండితెర పై ఈయన నటించారు.. నిన్న అనారోగ్య సమస్య కారణంగా మరణించారని కుటుంబ సభ్యులు వెళ్లడించారు. ఆ మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


సినిమాల విషయానికొస్తే.. 

షానవాస్ ప్రేమ్ నజీర్ తండ్రి హీరో అవ్వడంతో సులువుగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. 50 కి పైగా మలయాళ చిత్రాలలో నటించారు.. ఈయన 1981 లో మొదటి చిత్రంలో నటించారు. ప్రేమ గీతాంగల్ అనే చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. దాదాపు 50 సినిమాలకు పైగా చేసిన ఈయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ శేష జీవితాన్ని కొడుకులతో గడుపుతున్నాడు. ఈయనకు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు రావడంతో చికిత్స తీసుకుంటూ తుది శ్వాసని విడిచారు. ఆయన మరణ వార్త విన్న టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నేడు జరగనున్న అంతేక్రియల కార్యక్రమంలో ఆయనతోపాటు నటించినా పలువురు ప్రముఖులు హాజరై అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×