Hyderabad: హైదరాబాద్ లో మరోసారి కిడ్నాపర్లు పంజా విసిరుతున్నారు. మొన్నటివరకు చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఓ మేకప్‌మెన్ కిడ్నాప్ హాట్ టాపిక్ గా మారింది. పారిపోయిన ప్రేమికుల ఆచూకీ చెప్పాలని బుల్లితెర నటుల వ్యక్తిగత మేకప్మెన్తో పాటు మరో యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. టీవీ నటుల మేకప్‌మెన్ కిడ్నాప్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు వల్లే ఈ కిడ్నాప్ విషయం బయటకు వచ్చింది. నకిలీ పోలీసులు ఈ డ్రామాను ఆడుతున్నారని గ్రహించిన టీవీ నటుడు ఇంద్రనీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ అయిన వ్యక్తిని రక్షించారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి..
ఏపీకి చెందిన భూమిరెడ్డి కిషోర్‌రెడ్డి చాలా కాలంగా టీవీ ఆర్టిస్టులు ఇంద్రనిల్, మేఘనకు పర్సనల్ మేకప్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కృష్ణానగర్ లో ఇరదాసు సందీప్, పల్లె శివతో కలిసి ఓ ఇంట్లో అద్దెకుండేవాళ్లు. కొద్ది రోజులుగా శివ మరో వర్గానికి చెందిన యువతితో సహజీవనం చేస్తూ ఇటీవల ఆమెను తీసుకొని నగరం వదిలి వెళ్లిపోయాడు. అయితే, ఈనెల 2న తెల్లవారుజామున భూమిరెడ్డి ఉంటున్న ఇంటి వద్దకు పోలీసు స్టిక్కర్ ఉన్న నంబర్‌ప్లేట్ లేని కారు వచ్చింది.. అందులో ఇద్దరు పోలీస్ గెటప్ లో ఉన్న వ్యక్తులు వచ్చారు.. భూమిరెడ్డిని, సందీప్ ను బలవంతంగా కారు ఎక్కించారు.
Also Read : నాని హిట్ 3 ఓటీటీ ప్లాట్ ఫామ్ లాక్.. కళ్లు చెదిరే మొత్తానికి డిజిటల్ హక్కులు..!
అనంతరం, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తామని చెప్పిన వాళ్లు దారి మల్లించి తుక్కుగూడలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడికి మరో రెండు వాహనాల్లో వచ్చిన మరో పదిమంది కలిసి భూమిరెడ్డి, సందీప్‌లను కట్టేసి శివ, ఆ యువతి ఆచూకీ చెప్పాలంటూ తీవ్రంగా కొట్టారు.. అక్కడితో విడిచిపెట్టకుండా వారిని మళ్లీ కారులో ఎక్కించుకొని అచ్చంపేటకు తీసుకువెళ్లారు.. అయితే ఇంద్రనీల్ భూమిరెడ్డి ఇంకా రాకపోవడంతో అసలు విషయం ఇదే అయ్యి ఉంటుందని గ్రహించాడు. భూమిరెడ్డికి ఇంద్రనీల్ ఫోన్ చేయగా కిడ్నాపర్లు లైన్‌లోకి వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత సందీప్, భూమిరెడ్డిలను అచ్చంపేట పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇంద్రనీల్ కూడా అక్కడకు చేరుకొని వారిని తిరిగి హైదరాబాద్ కు తీసుకొని వచ్చారు. బాధితులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఫిర్యాదు ఇప్పించాడు. వాళ్ళ వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల గెటప్ వేసుకొని మోసం చేసిన వ్యక్తులను పోలీసులను గుర్తించారు.. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.