BigTV English

Loan Against FD : ఎమర్జెన్సీ ఆర్థిక అవసరాలకు ఎఫ్‌డీ లోన్..!

Loan Against FD : ఎమర్జెన్సీ ఆర్థిక అవసరాలకు ఎఫ్‌డీ లోన్..!
Loan against Fixed Deposit
 

Loan against Fixed Deposit (FD): చేతిలో మిగులు డబ్బులుంటే.. మదుపరులకు ముందు వచ్చే ఆలోచన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ). అయితే.. చాలామంది ఎమర్జెన్సీలో టక్కున ఎఫ్‌డీని బ్రేక్ చేస్తుంటారు. దీనివల్ల కొంత వడ్డీని వదులుకోవాల్సి వస్తుంది. ఒకానొక సమయంలో అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు ఏంచేయాలో తోచదు. బయట వ్యక్తుల వద్ద తీసుకున్న వడ్డీ ఎక్కువగా ఉంటుంది. పోనీ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుందామంటే ప్రాసెస్ కే ఎక్కువటైమ్ పడుతుంది.


ఇలాంటి సందర్భాలలో అత్యవసర సమయంలో డబ్బులు సమకూర్చుకునేందుకు మీరు చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉపయోగపడతాయి. ఇలాంటి సమయాల్లో ఎఫ్‌డీ మీద రుణం తీసుకోవటం అత్యుత్తమ నిర్ణయం. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఎఫ్‌డీల మీది రుణాలు గతంలో కంటే 43 శాతం పెరగ్గా, ఫిబ్రవరి నాటికి తీసుకున్న ఎఫ్‌డీలపై రుణాల మొత్తం రూ.1.13 లక్షల కోట్లకు చేరింది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఇచ్చే రుణాల వడ్డీ రేటు బ్యాంకులు చెల్లించే పడ్డీ రేటు కన్నా 0.75 శాతం నుంచి 2 శాతం వరకు అదనంగా ఉంటుందని గుర్తించకోవాలి.

ఎఫ్‌డీపై రుణం వల్ల ప్రయోజనాలు..
ఎఫ్‌డీ చేసిన మొత్తంలో 70 – 90% వరకు రుణంగా పొందొచ్చు. ఒక్కో బ్యాంకును బట్టి రూ.10 లక్షల ఎఫ్‌డీ మీద కనీసం రూ. 7లక్షల రుణం లభిస్తుంది. ఎఫ్‌డీపై తీసుకునే రుణానికి వడ్డీ కూడా తక్కువే. ఎఫ్‌డీ చేసినందుకు బ్యాంకు మనకు 7 శాతం వడ్డీ ఇస్తుంటే.. అదే ఎఫ్‌డీ మీద మరో 2 లేదా 3 శాతమే అధికంగా చెల్లిస్తే చాలు.


వ్యక్తిగత రుణం, బయటి వడ్డీలతో పోల్చితే ఇది చాలా తక్కువే. ఎఫ్‌డీ ఎంత కాలానికి తీసుకున్నారో.. అదే టైం దానిమీద తీసుకున్న రుణానికీ వర్తిస్తుంది. వీలున్నంత తక్కువ టైం కోసం దీనిమీద రుణం తీసుకుని మళ్లీ వెంటనే చెల్లించేయటం ఉత్తమమైన విధానం. ఇతర రుణాలలాగా ఎఫ్‌డీపై తీసుకునే రుణానికి ప్రాసెసింగ్ రుసుములు వంటివి ఉండవు.  ఏదైనా బ్యాంకు దీన్ని వసూలు చేసినా అది నామమాత్రమే.
ఇతర రుణాల మాదిరిగా దీనికి పెద్దగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉండదు. వాటికి సంబంధించిన ఫారాలపై రుణం తీసుకుంటున్నట్లు సంతకం చేస్తే సరిపోతుంది.

 

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×