Free Loans: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన దేశంలో అద్భుత స్పందనను పొందుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్ట్ గా పేరొందిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 10 లక్షల ఇళ్లకు సౌరశక్తిని అందించగా, వచ్చే నెలల్లో ఈ సంఖ్యను 20 లక్షల ఇళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మూడు సంవత్సరాల్లో అంటే మార్చి 2027 నాటికి కోటి ఇళ్లలో సౌరశక్తిని అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
పూచీకత్తు లేకుండా రుణాలు
ఈ క్రమంలో ఈ స్కీం కింద సబ్సిడీతో పాటు పూచీకత్తు లేకుండా రుణాలను అందించనుంది. దీంతో సామాన్య ప్రజలు సైతం తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవడానికి తక్కువ ఖర్చుతో అవకాశం లభిస్తోంది. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడంతో పాటు, విద్యుత్ వినియోగ ఖర్చును తగ్గించే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన
ఈ పథకం కింద భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అర్హులైన కుటుంబాలకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను అమర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతును అందిస్తోంది. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ అమర్చడం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గడమే కాకుండా, అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను స్థానిక గ్రిడ్‌కు విక్రయించి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.
Read Also: Samsung Galaxy F16 5G: సాంసంగ్ నుంచి కొత్త 5జీ ఫోన్ ఆగయా. ..
ఈ పథకం ప్రయోజనాలు
-మౌలిక సదుపాయాల కల్పనలో మెరుగుదల.
-ఖర్చు తక్కువగా ఉండటంతో సామాన్యులకు అందుబాటులోకి రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్.
-పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి
-విద్యుత్ బిల్లులో గణనీయమైన తగ్గింపు
-అదనంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం
ప్రధాన పథకం ప్రయోజనాలు
-రూ. 78,000 వరకు సబ్సిడీ – సోలార్ ప్యానెల్ వ్యవస్థను అమర్చడానికి కేంద్రం 40% వరకు సబ్సిడీ అందిస్తోంది.
-పూచీకత్తు లేకుండా రుణం – రూ. 2 లక్షల వరకు ఆదాయ పత్రాలు లేకుండా రుణ సౌకర్యం.
–తక్కువ వడ్డీ రేటు – కేవలం 6.75% వడ్డీ రేటుతో రుణ సౌకర్యం.
-ఖర్చులో 90% వరకు ఫైనాన్స్ – మొత్తం ఖర్చులో 90% వరకు రుణం పొందే అవకాశం.
-అధిక ఉత్పత్తి సామర్థ్యం – అధిక సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్స్‌తో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
అర్హతలు
-కుటుంబ సభ్యులు తప్పనిసరిగా భారతీయ పౌరులు కావాలి.
-ఇంటికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
-ఇంటికి అనుకూలమైన పైకప్పు ఉండాలి.
-గతంలో మరే ఇతర సబ్సిడీ పొందకపోవాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
-ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన అధికారిక వెబ్‌సైట్ – https://pmsuryaghar.gov.in ను సందర్శించండి.
-వినియోగదారుల విభాగంలో “ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి” పై క్లిక్ చేయండి.
-మీ మొబైల్ నంబర్, పేరు, రాష్ట్రం, ఇతర వివరాలను నమోదు చేయండి.
-మీ ఇమెయిల్‌ను ధృవీకరించి ప్రొఫైల్‌ను సేవ్ చేయండి.
-విక్రేత ఎంపికలో “అవును లేదా కాదు” అని ఎంచుకోండి.
-సోలార్ రూఫ్‌టాప్ కోసం దరఖాస్తు చేయండి” పై క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా డిస్కామ్, ఇతర వివరాలను నమోదు చేయండి.
-ఆమోదం పొందిన తర్వాత విక్రేతను ఎంచుకుని, బ్యాంక్ వివరాలను నమోదు చేసి సబ్సిడీ పొందండి.
ప్రధాన పథకంపై ప్రభుత్వ లక్ష్యాలు
-వచ్చే ఆరు నెలల్లో 20 లక్షల ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ అమర్చే లక్ష్యం.
-2027 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ అందించే ప్రణాళిక.
-సోలార్ విద్యుత్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వ ప్రణాళిక.
-కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు.